top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 20, JUNE 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 20, JUNE 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀

1) 🌹. శ్రీమద్భగవద్గీత - 543 / Bhagavad-Gita - 543 🌹

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 54 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 54 🌴

3) 🌹 సిద్దేశ్వరయానం - 84 🌹

🏵 కాశీలో కథ - రామకవి - 2 🏵

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 548 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 548 - 3 🌹

🌻 548. 'విమర్శరూపిణీ’ - 3 / 548. 'Vimarsharupini' - 3 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 543 / Bhagavad-Gita - 543 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 19 🌴*


*19. నాన్యం గుణేభ్య: కర్తారం యదా ద్రష్టానుపశ్యతి |*

*గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో(ధిగచ్ఛతి ||*


*🌷. తాత్పర్యం : సర్వకర్మల యందును ప్రకృతి త్రిగుణములకన్నను అన్యుడైన కర్త వేరోక్కడు లేడని చక్కగా దర్శించి, త్రిగుణాతీతమైన పరమాత్మను ఎరుగగలిగినపుడు మనుజుడు నా దివ్యస్వభావమును పొందగలడు.*


*🌷. భాష్యము : త్రిగుణములకు సంబంధించి కర్మలను సరిగా అవగాహనము చేసికొనుట ద్వారా మనుజుడు వాటిని సులభముగా అధిగమింపగలడు. అట్టి అవగాహనము మహాత్ముల నుండి తెలియుట ద్వారా సాధ్యమగును. నిజమైన ఆధ్యాత్మికగురువు శ్రీకృష్ణుడే. అతడే ఇచ్చట అర్జునునకు ఆధ్యాత్మికజ్ఞానము నందించుచున్నాడు.*


*అదే విధముగా కృష్ణభక్తిరసభావన యందు నిష్ణాతులైనవారి నుండి మనుజుడు గుణముల దృష్ట్యా కర్మవిషయకమైన జ్ఞానమును నేర్వవలసియున్నది. లేనిచో జీవితము తప్పుదారి పట్టగలదు. ప్రామాణికుడైన ఆధ్యాత్మికగురువు యొక్క ఉపదేశము ద్వారా జీవుడు తన ఆధ్యాత్మికస్థితిని గూర్చియు, తన దేహమును గూర్చియు, తన ఇంద్రియములను గూర్చియు, తానే విధముగా బంధితుడయ్యాడనెడి విషయమును గూర్చియు ఎరుగవలెను. గుణముల బంధనములో నిస్సహాయుడై యుండు ఆ జీవుడు తన నిజస్థితిని తెలిసినపుడు ఆధ్యాత్మికస్థితిని పొందగలడు. అట్టి స్థితిలో అతనికి భక్తియుక్త జీవనమునకు అవకాశమేర్పడును. వాస్తవమునకు జీవుడెన్నడును వివిధకర్మలకు కర్త కాడు.*


*దేహమునందు నిలిచియున్నందున ప్రత్యేకగుణము ననుసరించి అతడు బలవంతముగా కర్మల యందు వర్తింపజేయుచున్నాడు. ఆధ్యాత్మికజ్ఞానమున నిష్ణాతుడైన మహాత్ముని సహాయము లేనిదే తాను ఎట్టి స్థితిలో నిలిచియున్నాడో అతడు ఎరుగజాలడు. ప్రామాణికగురువు సాహచర్యమున అతడు తన నిజస్థితిని గాంచగలిగి, అట్టి అవగాహనము ద్వారా కృష్ణభక్తిరసభావనలో స్థిరుడు కాగలడు. ఆ రీతి కృష్ణభక్తిభావనలో స్థిరుడైనవాడు ప్రకృతిగుణములచే ప్రభావితుడు కాడు. శ్రీకృష్ణుని శరణువేడినవాడు ప్రకృతికర్మల నుండి విడివడునని సప్తమాధ్యాయమున ఇదివరకే తెలుపబడినది. అనగా యథార్థదృష్టి కలిగినవానిపై ప్రకృతి ప్రభావము క్రమముగా క్షీణింపగలదు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 543 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 19 🌴*


*19. nānyaṁ guṇebhyaḥ kartāraṁ yadā draṣṭānupaśyati*

*guṇebhyaś ca paraṁ vetti mad-bhāvaṁ so ’dhigacchati*


*🌷 Translation : When one properly sees that in all activities no other performer is at work than these modes of nature and he knows the Supreme Lord, who is transcendental to all these modes, he attains My spiritual nature.*


*🌹 Purport : One can transcend all the activities of the modes of material nature simply by understanding them properly by learning from the proper souls. The real spiritual master is Kṛṣṇa, and He is imparting this spiritual knowledge to Arjuna. Similarly, it is from those who are fully in Kṛṣṇa consciousness that one has to learn this science of activities in terms of the modes of nature. Otherwise, one’s life will be misdirected. By the instruction of a bona fide spiritual master, a living entity can know of his spiritual position, his material body, his senses, how he is entrapped, and how he is under the spell of the material modes of nature. He is helpless, being in the grip of these modes, but when he can see his real position, then he can attain to the transcendental platform, having the scope for spiritual life. Actually, the living entity is not the performer of different activities. He is forced to act because he is situated in a particular type of body, conducted by some particular mode of material nature.*


*Unless one has the help of spiritual authority, he cannot understand in what position he is actually situated. With the association of a bona fide spiritual master, he can see his real position, and by such an understanding he can become fixed in full Kṛṣṇa consciousness. A man in Kṛṣṇa consciousness is not controlled by the spell of the material modes of nature. It has already been stated in the Seventh Chapter that one who has surrendered to Kṛṣṇa is relieved from the activities of material nature. For one who is able to see things as they are, the influence of material nature gradually ceases.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 సిద్దేశ్వరయానం - 84 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*


*🏵 కాశీలో కథ - రామకవి - 2 🏵*


*రామ కవి: శ్రీనాధ కవిరాజు తిరిగిన ప్రదేశం. ఆ నగరానికి కొంత దూరంలో కోటప్ప కొండ ఉంది దానికి త్రికూటాచల క్షేత్రమని పేరు. దానికి దగ్గర మా స్వగ్రామం ఏల్చూరు. అక్కడ కొండపై గుహలో నరసింహస్వామి వెలిశాడు. ఆయన మా యిలవేల్పు.*


*స్వామి : తెలుసు. మీరా స్వామిపై శతకం వ్రాస్తున్నారు గదా! ఆ ప్రహ్లాద వరదుడు మీ యందు బాగా అనుగ్రహం కలిగి ఉన్నాడు. ఒక పద్యం మీ తీర్ధయాత్రలను గూర్చి పలకండి.*


*రామకవి : మీ ఆజ్ఞ!*

*సీ. కాశికాధీశుని గాంచి గంగానది గ్రుంకి గయాదుల కోర్కె జూచి శ్రీరంగనగరిని చేరి రంగని గాంచి కాంచికాధీశునగ్గించి యెంచి కుశశాయి గన్గాని కోర్కెదీర ననంత శయను వీక్షించి నార్హతను గాంచి సేతుస్థలిని గ్రుంకి శేషాద్రి నిలయుని కాళహస్తీశుని కాంక్ష గొలిచి*

*గీ|| యిందరిని నిన్నెకా హృదినెన్నుకొనుచు తిరిగితిని తీర్థ దర్శనాధీన గతిని నిత్యలోక స్థితినొసంగు నీరజాక్ష ! జితదనుజరంహ! యేర్చూరి శ్రీనృసింహ!*


*స్వామి : మంచి పద్యం చెప్పారు. మరి యేల్చూరులో విశ్వనాధుడు నీలకంఠుని పేర ప్రకాశిస్తున్నాడు గదా! ఆ స్వామికి ఈవిశేషాలను విన్నవించరా?*


*రామ : తప్పకుండా ! మీ మాటే ప్రేరణ. ఇది కూడా సీసపద్యంలోనే చెపుతాను.*


*సీ|| గంగానదీజలోత్తుంగ తరంగాళి భంగపెట్టితి పాపపటలములను సరయూనదీ జలస్పర్శనం బొనరించి హరియించితిని ఘోరదురితచయము ఫల్గునీ నది జలాస్వాదనం బొనరించి కలిగించితిని మనః కలుషశుద్ధ సప్తగోదావరీ లములలో దోగి సంతసించితి దోషసమితినడచి కృష్ణానదీ జలక్రీడలు గావించి వెడలించికొంటిని వృజిన తతిని కావేరి నీటిలో గావించి స్నానంబు పారజిమ్మితి సర్వపాతకముల*

*గీ॥ ప్రథిత పంచాక్షరీమంత్ర పఠనమునకు నైతినర్హుడ మీద యనంద ముక్తి నిత్యనందిత వైకుంఠ ! దైత్యలుంఠ! నిరుపమోత్కంఠ! యేర్చూరి నీలకంఠ!*


*స్వామి : సీసమాలతో శివుని అలంకరించారు. రమణీయంగా ఉన్నది. అప్పుడప్పుడు వచ్చి కాశీలో ఉన్నంతకాలం మీకవిత వినిపిస్తూ ఉండండి! ఇవాళ ఉదయం గంగాస్నానం చేసివస్తూ “చంద్రశేఖరమాశ్రయే” అని శ్లోకాలు చదివారు గదా! వాటిని తెలుగులో అనువాదం చేయండి! మీ తెలుగు కవిత చాలా సుందరంగా ఉంది.*


*రామకవి : రేపే వ్రాసి తీసుకు వస్తాను. మీ సమయం ఎక్కువ తీసుకోవటం వల్ల వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుందేమోనని సంకోచిస్తున్నాను. కాని మీరు అనుగ్రహిస్తే మీ నుండి వీలైనన్ని ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవాలని కోరికగా ఉంది.*


*స్వామి : అలానే ! మీ వల్ల తెలుగు కవిత్వమంటే నాకు ఇష్టం ఏర్పడుతున్నది. ఇది యెటు దారి తీస్తుందో ! మంచిది వెళ్ళి రండి!*

*రామకవి: నమస్కారం సెలవు.*

*మరుసటి రోజు వచ్చి రామకవి చంద్రశేఖర స్తుతికి తెలుగు అనువాదం వినిపించాడు. (మూలసంస్కృత శ్లోకాలు రామకవిగారి పద్యాలు ప్రత్యేకంగా ఇవ్వబడుతున్నవి). ఇలా కాశీలో ఉన్నన్ని రోజులు అప్పుడప్పుడు వచ్చి స్వామివారి కోరిక మీద తను వ్రాసిన తెలుగు పద్యాలు వినిపించేవాడు. సంస్కృత కాశీఖండాన్ని పోల్చి శ్రీనాథుని తెలుగు రచనను వ్యాఖ్యానిస్తూ కొన్నిరోజులు వరుసగా పురాణ ప్రవచనం చేయవలసిందిగా స్వామి వారిచ్చిన ఆదేశాన్ని శిరసావహించి వారి ఆశ్రమంలో సాయంకాలవేళ ప్రసంగించాడు. సందర్భానుసారంగా తాను చేసిన తీర్థయాత్రా విశేషాలను కూడా కలిపి కమనీయంగా ఉపన్యసిస్తూ మధ్య మధ్య శ్లోకాలను, పద్యాలను వినిపిస్తుంటే తెలుగువారు చాలామంది వచ్చి వినేవారు.*


*ఇలా కొన్నాళ్ళు గడిచిన తరువాత రామకవి తిరిగి వెళ్ళే సమయం వచ్చింది. సాయంకాలం దర్శనానికి వచ్చి స్వామి వారితో తన ప్రయాణాన్ని గురించి విన్నవించుకొన్నాడు. ఆయన వచ్చే సమయంలో స్వామివారు శంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకం గొంతెత్తి చదువుతున్నారు. అవి పఠిస్తుంటే స్వామి కంటి వెంట కన్నీరుకారుతున్నది. నెమ్మదిగా ఆపుకొని రామకవి వైపు చూచి ఇలా అన్నారు.*


*స్వామి : కవిగారూ! మీరీరోజు ఉదయం భైరవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని సెలవు తీసుకొంటూ ఏమి కోరుకున్నారు?*


*రామకవి : మీతో చెప్పాలంటే భయ సంకోచములు కలుగుతున్నవి. అయినా మీరు దివ్య దృష్టి కలవారు. నేను చెప్పకపోయినా మీకు తెలుస్తుంది.*


*( సశేషం )*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 548 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 548 - 3 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*

*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*


*🌻 548. 'విమర్శరూపిణీ’ - 3 🌻*


*విమర్శరూపిణిగ మనలో వుండి మనకు సదసద్వివేకము గావించునది శ్రీమాతయే. సత్యము-అసత్యము, శాశ్వతము-అశాశ్వతము, ధర్మము-అధర్మము ఇత్యాది విచక్షణ, వివేకము స్వయం విమర్శ వలననే తెలియును. స్వయం విమర్శ కలవాడు దారి మళ్ళక జీవితమున పయనించి జీవన గమ్యమును చేరును. ఇట్లు విమర్శ రూపిణిగా శ్రీమాత జీవులలో నుండియే జీవులను సంరక్షించుకొను చుండును.* *ఆత్మజ్ఞానము కూడ ఆత్మవిచారముచే జరుగును. ఆత్మవిచారము నకు ఊహ అవసరము. ఊహ విమర్శ యందలి భాగమే. ఊహ లేనివారు ఉన్నతి చెందుట దుస్సాధ్యము.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 548 - 3 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*

*sarvavyadhi prashamani sarvamrutyu nivarini  ॥112 ॥ 🌻*


*🌻 548. 'Vimarsharupini' - 3 🌻*


*It is Sri Mata who is the form of reflection within us and gives us wisdom. Truth and falsehood, eternity and impermanence, righteousness and unrighteousness, etc., are known only through self-reflection. A self-critic will not deviate from his path and will reach the goal of life. In this form of reflection, Sri Mata protects living beings being among them. Self-awareness also happens through self-enquiry. Self-reflection requires imagination. Imagination is part of reflection. It is impossible for those without imagination to rise.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page