top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 21, DECEMBER 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 21, DECEMBER 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀

1) 🌹21, DECEMBER 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 475 / Bhagavad-Gita - 475 🌹

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -06 / Chapter 12 - Devotional Service - 06 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 831 / Sri Siva Maha Purana - 831 🌹

🌻. శంఖచూడుని వివాహము - 1 / The penance and marriage of Śaṅkhacūḍa - 1 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 88 / Osho Daily Meditations  - 88 🌹

🍀 88. సమతుల్యంలో పని చేయండి / 88. WORK IN BALANCE 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 513 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 513 - 2 🌹

🌻 513. 'కాకినీ రూప ధారిణీ' - 2 / 513. 'Kakini Roopa Dharini' - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 21, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*


*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 34 🍀*


*67. దయావాన్ కరుణాపూర్ణో మహేంద్రో మాహురేశ్వరః |*

*వీరాసనసమాసీనో రామో రామపరాయణః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఆరోహణ - అవరోహణ - పరావరి భూమికల మధ్యగల అవరోధాన్ని భేదించుకొంటూ మనలోని చేతన పరభూమికలలోనికి ఆరోహించడం ద్వారా అనంత తేజోమయాత్మగా రూపాంతరం చెందనూ గలదు. ఆ పరచేతనా అనుభవపు ప్రతి చాయలను మాత్రమే కాక, దాని సాక్షాత్సన్నిధిని సైతమూ క్రిందికి ఆపర ప్రకృతిలోనికి గొనివచ్చి దానిని రూపాంతరం చెందించనూ గలదు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

మార్గశిర మాసం

తిథి: శుక్ల-నవమి 09:38:52 వరకు

తదుపరి శుక్ల-దశమి

నక్షత్రం: రేవతి 22:10:51 వరకు

తదుపరి అశ్విని

యోగం: వరియాన 13:27:49 వరకు

తదుపరి పరిఘ

కరణం: కౌలవ 09:38:52 వరకు

వర్జ్యం: 25:41:30 - 39:22:06

దుర్ముహూర్తం: 10:22:55 - 11:07:18

మరియు 14:49:10 - 15:33:32

రాహు కాలం: 13:37:04 - 15:00:16

గుళిక కాలం: 09:27:28 - 10:50:40

యమ గండం: 06:41:04 - 08:04:16

అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:35

అమృత కాలం: -

సూర్యోదయం: 06:41:04

సూర్యాస్తమయం: 17:46:40

చంద్రోదయం: 13:20:08

చంద్రాస్తమయం: 01:09:57

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: మీనం

యోగాలు: మిత్ర యోగం - మిత్ర

లాభం 22:10:51 వరకు తదుపరి

మానస యోగం - కార్య లాభం

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 475 / Bhagavad-Gita - 475 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -06 🌴*


*06. యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పతా: |*

*అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్తే ఉపాసతే ||*


*🌷. తాత్పర్యం : ఓ పార్థా! సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింత లేక నాకు భక్తులై, మనస్సును నా యందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించు చున్న వారిని..,*


*🌷. భాష్యము : పరమభాగ్యుశాలురైన భక్తులు శ్రీకృష్ణభగవానునిచే అతిశీఘ్రముగా భవసాగరము నుండి తరింపజేయబడుదురని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భగవానుడు అత్యంత ఘనుడని మరియు జీవుడు అతనికి సేవకుదనియు తెలిసికొనగలిగే జ్ఞానమునకు శుద్ధభక్తియోగమున మనుజుడు అరుదెంచును.*


*శ్రీకృష్ణభగవానునికి సేవను గూర్చుటయే జీవుని నిజధర్మము. అతడట్లు చేయనిచో మాయను సేవింప వలసివచ్చును. పూర్వము తెలుపబడినట్లు భక్తియోగము చేతనే శ్రీకృష్ణభగవానుఇ సంపూర్ణతత్త్వము అవగతము కాగలదు. కనుక ప్రతి యొక్కరు పూర్ణముగా భక్తియుతులు కావలెను.*

🌹🌹🌹🌹🌹


*🌹 Bhagavad-Gita as It is - 475 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


*🌴 Chapter 12 - Devotional Service - 06 🌴*


*06. ye tu sarvāṇi karmāṇi mayi sannyasya mat-parāḥ*

*ananyenaiva yogena māṁ dhyāyanta upāsate*


*🌷 Translation : O Partha, Those who worship Me, giving up all their activities unto Me and being devoted to Me without deviation, always meditating upon Me..,*


*🌹 Purport : It is explicitly stated here that the devotees are very fortunate to be delivered very soon from material existence by the Lord. In pure devotional service one comes to the realization that God is great and that the individual soul is subordinate to Him. His duty is to render service to the Lord – and if he does not, then he will render service to māyā.*


*As stated before, the Supreme Lord can be appreciated only by devotional service. Therefore, one should be fully devoted. One should fix his mind fully on Kṛṣṇa in order to achieve Him. One should work only for Kṛṣṇa. It does not matter in what kind of work one engages, but that work should be done only for Kṛṣṇa. That is the standard of devotional service.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 830 / Sri Siva Maha Purana - 830 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 28 🌴*


*🌻. శంఖచూడుని వివాహము - 1 🌻*


*సనత్కుమారుడిట్లు పలికెను- అపుడా శంఖచూడుడు జైగీషవ్యమహర్షి ఉపదేశమును పొంది పుష్కరక్షేత్రమునందు చిరకాలము బ్రహ్మను ఉద్దేశించి పరమప్రీతితో తపస్సును చేసెను (1). ఆతడు ఇంద్రియములను నిగ్రహించి మనస్సును ఏకాగ్రము చేసి గురువుచే ఉపదేశింప బడిన బ్రహ్మ మంత్రమును జపించెను (2). లోకములకు తండ్రి, సర్వసమర్థుడు నగు బ్రహ్మ వెంటనే పుష్కరములో తపస్సు చేయుచున్న ఆ శంఖచూడాసురునకు వరము నిచ్చుటకై అచటకు వెళ్లెను (3). అపుడు బ్రహ్మ ఆ రాక్షసవీరునితో 'వరమును కోరుకొనుము' అని పలికెను. ఆతడు బ్రహ్మను గాంచి మిక్కిలి వినయముతో ప్రణమిల్లి పవిత్రమగు వచనములతో స్తుతించెను (4).*


*దేవతలచే జయింపబడకుండుట అను వరమును ఆతడు బ్రహ్మనుండి కోరగా, ఆయన మిక్కిలి ప్రసన్నమగు మనస్సుతో తథాస్తు అనెను (5). జగత్తులోని సర్వమంగళవస్తువులకంటే మంగళప్రదమైనది, సర్వదేశములలో మరియు సర్వకాలములలో విజయము నొసంగునది, దివ్యమైనది అగు శ్రీకృష్ణకవచమును ఆయన శంఖచూడునకు ఇచ్చెను (6). నీవు బదరికి వెళ్లి అచట తులసిని వివాహమాడుము. ఆమె అచటనే తన కోరికననుసరించి తపస్సును చేయుచున్నది (7).*


*'ఆమె ధర్మధ్వజుని కుమార్తె' అని బ్రహ్మ ఆతనికి బోధించి ఆతడు చూచు చుండగా వెంటనే అదృశ్యడాయెను (8). పుష్కరములో తపస్సును చేసి గొప్ప సిద్ధిని పొందియున్న ఆ శంఖచూడుడు అపుడు జగత్తు మంగళములకు కూడ మంగళమైన కవచమును మెడలో కట్టుకొనెను (9).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 830 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 28 🌴*


*🌻 The penance and marriage of Śaṅkhacūḍa - 1 🌻*


Sanatkumāra said: —

1. As instructed by Jaigīṣavya, Śaṅkhacūḍa performed a penance in Puṣkara for a long time in order to propitiate Brahmā with devotion.


2. He concentrated his mind, controlled the senses and organs of activities, and muttered the mantra of Brahmā imparted by his preceptor.


3. Lord Brahmā, the preceptor of the worlds, went to Śaṅkhacūḍa who was practising penance at Puṣkara in order to grant him the boon soon.


4. Brahmā said to him: “Tell me the boon you wish to choose.” On seeing Brahmā, the king of Dānavas bowed to him humbly and eulogised him with words of devotion.


5. He requested Brahmā to grant him the power of being invincible to the gods. With a delighted mind, Brahmā said “Be it so.”


6. He gave Śaṅkhacūḍa the divine amulet of Śrīkṛṣṇa the most auspicious of all auspicious things in the universe, that yielded victory everywhere.


7. “You now go to Badari. There you marry Tulasī who is performing penance just at her own will.


8. She is the daughter of Dharmadhvaja.” Brahmā instructed him thus and vanished even as he was watching him.


9. Then Śaṅkhacūḍa whose penance had been fruitful in the holy centre of Puṣkara tied the most auspicious amulet round his neck.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 88 / Osho Daily Meditations  - 88 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 88. సమతుల్యంలో పని చేయండి 🍀*


*🕉. ప్రపంచంలో పని చేయడం కానీ దానిలో కోల్పోకుండా ఉండడం అనేది ఉత్తమమైన ఏర్పాటు. ఐదు లేదా ఆరు గంటలు పని చేయండి, ఆపై దాని గురించి మరచిపోండి. మీ అంతర్గత ఎదుగుదలకు కనీసం రెండు గంటలు, మీ సంబంధానికి, ప్రేమకు, మీ పిల్లలకు, మీ స్నేహితులకు, సమాజానికి కొన్ని గంటలు ఇవ్వండి. 🕉*


*మీ వృత్తి జీవితంలో ఒక భాగం మాత్రమే కావాలి. ఇది సాధారణంగా చేసే విధంగా మీ జీవితంలోని ప్రతి కోణంలో అతివ్యాప్తి చెందకూడదు. ఒక వైద్యుడు దాదాపు ఇరవై నాలుగు గంటల వైద్యుడు అవుతాడు. అతను దాని గురించి ఆలోచిస్తాడు, దాని గురించి మాట్లాడుతాడు. తింటున్నప్పుడు కూడా డాక్టర్‌. అతను ప్రేమలో ఉండగా కూడా, అతను ఒక వైద్యుడే. అప్పుడు అది పిచ్చి. ఈ రకమైన పిచ్చిని నివారించడానికి, ప్రజలు తప్పించుకుంటారు. అప్పుడు వారు ఇరవై నాలుగు గంటల అన్వేషకులు అవుతారు. మళ్లీ అదే తప్పు చేస్తున్నారు-ఇరవై నాలుగు గంటలు దేనిలోనైనా ఉండటమే తప్పు. నా ప్రయత్నమంతా మీరు లోకంలో ఉండి కూడా అన్వేషకుడిగా ఉండటానికి సహాయం చేయడమే. అయితే ఇది చాలా కష్టం, ఎందుకంటే మరింత సవాలుతో కూడిన పరిస్థితులు ఉంటాయి.*


*డాక్టర్‌గా లేదా అన్వేషకుడిగా ఉండటం సులభం. రెండుగా ఉండటం కష్టం, ఎందుకంటే అది మీకు అనేక విరుద్ధమైన పరిస్థితులను ఇస్తుంది. కానీ ఒక వ్యక్తి విరుద్ధమైన పరిస్థితులలో ఎదుగుతాడు.ఆ గందరగోళంలో, వైరుధ్యాల ఘర్షణలో, సమగ్రత పుడుతుంది. మీరు ఐదు లేదా ఆరు గంటలు పనిచేయాలని నా సూచన. మిగిలిన గంటలను ఇతర విషయాల కోసం ఉపయోగించండి: నిద్ర కోసం, సంగీతం కోసం, కవిత్వం కోసం, ధ్యానం కోసం, ప్రేమ కోసం లేదా ఏదో హాస్యంగా ఉండడం కోసం. అది కూడా కావాలి. ఒక వ్యక్తి చాలా తెలివైనవాడు కానీ హాస్యం లేనివాడయితే, అతను బరువుగా, నిబ్బరంగా, గంభీరంగా ఉంటాడు. అతను జీవితాన్ని కోల్పోతాడు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 88 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 88. WORK IN BALANCE 🍀*


*🕉.  The best arrangement is to work in the world but not to be lost in It. Work for five or six hours, and then forget all about it. Give at least two hours to your inner growth, a few hours to your relationship, to love, to your children, to your friends, to society.  🕉*


*Your profession should only be one part of life. It should not overlap into every dimension of your life, as ordinarily it does. A doctor becomes almost a twenty-four-hour doctor. He thinks about it, he talks about it. Even when he is eating, he is a doctor. While he is making love, he is a doctor. Then it is madness; it is insane. To avoid this kind of madness, people escape. Then they become twenty-fourhour seekers. Again they are making the same mistake-the mistake of being in anything for twenty-four hours. My whole effort is to help you to be in the world and yet to be a seeker. Of course this is difficult, because there will be more challenge and situations.*


*It is easier to be either a doctor or a seeker. It will be difficult to be both, because that will give you many contradictory situations. But a person grows in contradictory situations. In the turmoil, in that clash of the contradictions, integrity is born. My suggestion is that you work for five or six hours. Use the remaining hours for other things: for sleep, for music, for poetry, for meditation, for love, or for just fooling around. That too is needed. If a person becomes too wise and cannot fool around, he becomes heavy, somber, serious. He misses life.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 513 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 513 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।*

*దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀*


*🌻 513. 'కాకినీ రూప ధారిణీ' - 2 🌻*


*షట్చక్ర నిరూపణము నందుగల వివరములకు, లలితా సహస్రము నందు గల వివరములకు వ్యత్యాస మున్నట్లు గోచరించును. నిజమున కట్టి వ్యత్యాసము లన్నియూ అంతర్గత ధ్యానమున పరిష్కారము కాగలవు. యాకినీ, హాకినీ, సాకినీ, కాకినీ, లాకినీ, రాకినీ, డాకినీ యిట్లు ఏడు నామములు అటు యిటుగా ఏడు కేంద్రములలో చెప్పబడెను. నిజమునకు ఈ దేవత లందరునూ బీజాక్షర సంకేతములు. యం, హం, సం, కం, లం, రం, ఢం- ఇవి అన్నియూ బీజాక్షరములే. వీనికి గల ఆరోహణ అవరోహణ క్రమములు అంతర్దృష్టికి సమముగ గోచరింప గలవు. స్వాధిష్ఠానమున వరుణ బీజముగ 'వం' కూడ తెలుపబడి యుండును. వీటి పరిష్కారములు గురు శిష్య అనుగతముగ తెలియును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 513 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻105. Medhonishta maduprita bandinyadi samanvita*

*dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻*


*🌻 513. 'kakini rupadharini' - 2 🌻*


*There is a discrepancy between these details in the Shatchakra Nirupana and the details in the Lalita Sahasranama. In fact, all differences can be resolved through internal meditation. Yakini, Hakini, Sakini, Kakini, Lakini, Rakini, Dakini are mentioned in seven centers. In fact, these goddesses are all symbols( beeja aksharas). Yam, Ham, Sam, Kam, Lum, Rum, Dham- these are all powerful symbols( beeja aksharas). The ascending and descending order of these can be discerned by insight. Lord Varuna's symbol 'Vam' is also mentioned in Swadhisthana. Teachings from Guru to the student will get the solutions of these.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page