🍀🌹 21, JULY 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹🍀
🌹. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి / Guru Pournami Greetings to All 🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 554 / Bhagavad-Gita - 554 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 03 / Chapter 15 - Purushothama Yoga - 03 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 106 🌹
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 2 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 3 🌹
🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 3 / 552. 'Sarvamrutyu Nivarini' - 3 🌻
*🌹🎥 ఆత్మ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించడం : నిజమైన విజయం కోసం మార్గం 🎥🌹*
*🌹🎥 Embarking on the Soul's Journey : A Pathway to Success 🎥🌹*
*Prasad Bharadwaj*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి / Guru Pournami Greetings to All 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 గురు ప్రార్ధన : 🍀*
*గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరః*
*గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః*
*అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |*
*తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః |*
*గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక:*
*అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ:*
*ఆషాఢ శుధ్ధపూర్ణిమను గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ అంటారు. ఙ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి, ఆరాధించి కృతఙ్ఞతలను తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురు దర్శనానికి, స్మరణనకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనసునూ, సూర్యుడు బుద్ధిని ప్రకాశింపజేస్తారు. మానవుల మనసులో అష్టమదాలూ, అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయి.*
*🌻 వ్యాస మహర్షి ప్రార్ధన : 🌻*
*వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తైః పౌత్రమకల్మషమ్ |*
*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*
*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |*
*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ll*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Guru Pournami Greetings to All 🌹*
*✍️. Prasad Bharadwaj*
*Guru Brahma, Guru Vishnu Guru Devo Maheshwarah*
*Guru Sakshat Parabrahma Tasmai Sri Guruve Namah*
*Akhanda Mandalakaram vyaptham yena chara charam*
*tatpadam Darshitham Yena Tasmai Sri guruve Namah*
*Gukarascha andhakarastu Rukarastanni Rodhaka:*
*Ajjana Grasakam Brahma Gurureva Na Samsaya*
*Ashadha Suddha Purnima is called Guru Purnima or Vyasa Purnima. Seekers of knowledge, remember them, Worship and express Gratitude to their Spiritual Masters on this day. The Darshan and Smarana of the Guru, who teaches mukti vidyas apart from bhukti vidyas, has special significance today. The moon illuminates the mind and the sun enlightens the intellect. Ashtamadas, Arishadvargas and the sixteen impurities of egoism in the human mind are removed by chanting the name of Guru / Master on Guru Purnima.*
*🌻 Yvasa Maharshi prayer 🌻*
*Vyasam Vasistha Naptaram Shaktaih Poutramakalmasham |*
*parasaratmajam vande shukatatam taponidhim ||*
*Vyasaya Vishnu Rupaya Vyasarupaya Vishnave |*
*namo y brahmanidhaye vasishthaya namo namah ll*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
https://youtu.be/8Fm9-9OziWM
*🌹🎥 ఆత్మ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించడం : నిజమైన విజయం కోసం మార్గం 🎥🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*“ఆత్మయాత్ర ప్రారంభం: విజయానికి మార్గం” లో, ప్రసాద్ భరద్వాజ్ భౌతిక లాభాలను మించి ఉన్న విజయానికి లోతైన అంశాలను అన్వేషిస్తారు. ఈ యాత్ర మన సారాంశాన్ని, సంతృప్తిని, పరమార్థాన్ని, మరియు లోతైన విజయాన్ని అన్వేషిస్తుంది. ఈ సందేశము స్వీయ అన్వేషణ, ఆధ్యాత్మిక వృద్ధి, మరియు నిజాయితీతో జీవించడం యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపుతుంది. ఈ యాత్రను ముందుకు తీసుకుని వెళ్లడానికి ఆచరణాత్మక మార్గాలను అందిస్తుంది, స్వీయ ప్రతిబింబం, విలువలతో అనుసంధానం, మరియు సవాళ్లను వృద్ధి అవకాశాలుగా స్వీకరించడం వంటి అంశాలను ప్రస్తావిస్తుంది. ఒక లోతైన మార్గదర్శకుడిగా అంతర్గత మార్పు మరియు ఆధ్యాత్మిక వృద్ధి ద్వారా నిజమైన విజయానికి మార్గం చూపుతుంది.*
🌹🌹🌹🌹🌹
*🌹🎥 Embarking on the Soul's Journey : A Pathway to Success 🎥🌹*
*Prasad Bharadwaj*
*In “Embarking on the Soul’s Journey: A Pathway to Success,” Prasad Bharadwaj explores the deeper aspects of success that transcend material gains. This journey delves into the essence of our being, seeking fulfillment, purpose, and a profound sense of accomplishment. The text emphasizes the importance of self-discovery, spiritual growth, and living authentically. It provides practical ways to navigate this journey, including self-reflection, aligning actions with core values, and embracing challenges as opportunities for growth. This insightful guide offers a pathway to genuine success through internal transformation and spiritual evolution.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹🎥 Embarking on the Soul's Journey : A Pathway to Success 🎥🌹*
*Prasad Bharadwaj*
*In “Embarking on the Soul’s Journey: A Pathway to Success,” Prasad Bharadwaj explores the deeper aspects of success that transcend material gains. This journey delves into the essence of our being, seeking fulfillment, purpose, and a profound sense of accomplishment. The text emphasizes the importance of self-discovery, spiritual growth, and living authentically. It provides practical ways to navigate this journey, including self-reflection, aligning actions with core values, and embracing challenges as opportunities for growth. This insightful guide offers a pathway to genuine success through internal transformation and spiritual evolution.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 554 / Bhagavad-Gita - 554 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 03 🌴*
*03. న రూపమస్యేహ తథోపలభ్యతే నాన్తో న చాదిర్న చ సంప్రతిష్టా |*
*అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన ఛిత్వా ||*
*🌷. తాత్పర్యం : ఈ వృక్షపు యథార్థరూపము ఈ జగమునందు తెలియబడదు. దాని అదిగాని, అంతమునుగాని లేదా మూలముగాని ఎవ్వరును అవగతము చేసికొనజాలరు. కాని స్థిరముగా నాటుకొని యున్న ఈ సంసారవృక్షమును మనుజుడు దృఢచిత్తముతో అసంగమను శస్త్రముచే ఖండించి వేయవలయును.*
*🌷. భాష్యము : ఈ భౌతికజగమునందు అశ్వత్థవృక్షము యథార్థరూపము అవగతము కాదని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. మూలము ఊర్థ్వముగా నున్నందున ఈ వృక్షపు విస్తారము క్రిందుగా నున్నది. అట్టి వృక్షము యొక్క విస్తారమునందు బద్ధుడైనపుడు మనుజుడు అది ఎంతవరకు వ్యాపించియున్నదనెడి విషయముగాని, దాని మొదలుగాని గాంచలేడు. అయినను అతడు ఈ వృక్షకారణమును కనుగొనియే తీరవలెను.*
*నేను ఫలానావారి కుమారుడును, నా తండ్రి ఫలానావారి కుమారుడు, నా తండ్రి యొక్క తండ్రి ఫలానావారి కుమారుడు అనుచు పరిశోధన గావించుచు పోయినచో చివరకు గర్భోదకశాయివిష్ణువు నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు సర్వులకు మూలమని తెలియును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 554 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 15 - Purushothama Yoga - 03 🌴*
*03. na rūpam asyeha tathopalabhyate nānto na cādir na ca sampratiṣṭhā*
*aśvattham enaṁ su-virūḍha-mūlam asaṅga-śastreṇa dṛḍhena chittvā*
*🌷 Translation : The real form of this tree cannot be perceived in this world. No one can understand where it ends, where it begins, or where its foundation is.*
*🌹 Purport : It is now clearly stated that the real form of this banyan tree cannot be understood in this material world. Since the root is upwards, the extension of the real tree is at the other end.*
*When entangled with the material expansions of the tree, one cannot see how far the tree extends, nor can one see the beginning of this tree. Yet one has to find out the cause. “I am the son of my father, my father is the son of such-and-such a person, etc.”*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 106 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵యోగులు - సూక్ష్మశరీరులు - 2 🏵*
*రసయోగి శ్రీరాధికాప్రసాద్ మహారాజ్ (నాన్నగారు) రాధాదేవి యొక్క అనన్యభక్తుడు. ఏ ఇతర దేవతలనూ పూజించేవాడు కాదు. నా యందు ఎంతో అభిమానము ఉన్నా మా పీఠంలో అవతరించిన కాళీదేవిని చూడటానికి ఎప్పుడూ రాలేదు. ఒకరోజు ఆయన బృందావనం నుంచి వస్తూ ఉంటే కాళీదేవి కన్పించి, ఆయనతో “నాన్నా! నేను రాధాసఖినే కదా! నన్ను చూడటానికి రావా ?" అని అడిగింది. ఆశ్చర్యపోయి గుంటూరురాగానే నేను కాళీదేవిని చూడటానికి వస్తాను" అని వార్త పంపారు. కాళీ మందిరానికి వచ్చి దర్శించిన తరువాత అక్కడ ఏర్పాటు చేసిన భక్తుల సమావేశంలో ప్రసంగిస్తూ “కాళీదేవతలో కూడ వివిధమైన ఆకృతులు ఉన్నవి. రాధాదేవి యొక్క సఖీ మండలంలో ఉన్న శ్యామకాళి, కోమలప్రేమస్వరూపిణి, నా కిక్కడ దర్శన మిస్తున్నది” అన్నారు. ఆయన చెప్పిన విధంగా శ్యామకాళి సుందరదేవత, ప్రసన్న స్వరూపిణి. కలకత్తా ప్రాంతంలో ఉన్న ఒక శ్యామకాళి దేవాలయంలో చాలాకాలం సేవచేసిన భక్తురాలు జన్మ మారి ప్రస్తుతం ఒక మిత్రుడి భార్యగా ఉన్న మహిళ ఆనాటి సమావేశంలో ఉండటం గమనించాను.*
*చాలా గ్రహణాలకు చీరాల దగ్గర ఉన్న 'వాడరేవు' కు వెళ్ళి అక్కడ సముద్రతీరం దగ్గర కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవాడిని. నాతో పాటు చాలా మంది రావటం గ్రహణ జపం తరువాత అక్కడే హోమములు చేయటం అలవాటైంది. ఒకసారి అక్కడ ధ్యానంలో కాళీదేవి సాక్షాత్కరించి శ్రీశైలం రమ్మని ఆజ్ఞాపించింది. "అక్కడికి ఎందుకు? అని ప్రశ్నించాను” నేను. “అక్కడ ఉన్నది నేనే, వెంటనే రా" అన్నది. శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని ఆ కొండమీద ఆమె ఇచ్చిన అనుభూతిని ఇలా వర్ణించాను.*
*చ॥ హరుడు స్వయమ్ముగా శిశువునట్టుల నల్గొని పోయి వత్సలాం తరమున నప్పగింప నను నక్కున జేర్చి పరిస్ఫురత్పయో ధరముల క్షీర ధారలను దన్పిన ప్రేమ సుధావలంబ - శ్రీ గిరి భ్రమరాంబ పాదముల కేను సదా నతులా చరించెదన్.*
*మల్లికార్జునుడు నన్ను శిశువుగా మార్చి భ్రమరాంబ దగ్గరకు తీసుకు వెళ్ళి ఇడుగో! వీడు మనవాడు అని అందించాడు. ఆమె వాత్సల్యంతో దగ్గరకు తీసుకొని స్తన్యపానం అనుగ్రహించింది. అంతటి దయచూసిన ఆ ప్రేమామృత నిలయమైన శ్రీశైల భ్రమరాంబ పాదములకు వినయపూర్వకంగా వినతులు చేస్తున్నాను.*
*శ్రీశైలం కారులో వెళ్తుండగా రోడ్డు మీద అడ్డంగా 8 అడుగులు పొడుగున్న పెద్ద నల్లత్రాచు వచ్చింది. కారు ఆపించాను. ఒకసారి తలయెత్తి అనుగ్రహ సూచకంగా చూచి నెమ్మదిగా కదలిపోయింది. అదే సమయంలో ఇదే అనుభూతి గుంటూరులో ఉన్న మా అమ్మాయి డా॥ జయంతికి కలగటం ఆశ్చర్యకరం !*
*కొద్ది నెలల క్రింద అయోధ్యలో సాధువుల సమ్మేళనం జరిగింది. దాదాపు వెయ్యిమంది సాధువులు, ఇరవై అయిదు వేల మంది ప్రజలు వచ్చారు. దక్షిణాపధం నుండి అక్కడు చేరినవాడను నే నొక్కడనే. 'విశ్వహిందూపరిషత్' ఏర్పాటు చేసిన సమావేశమది. సమ్మేళనానంతరం ప్రధాన కార్యకర్తలు ఆ రోజు రాత్రి ధర్మరక్షణకోసం యజ్ఞం చేయవలసిందిగా నన్ను అభ్యర్థించారు. “యాభై మంది పీఠాధిపతులు, వెయ్యి మంది సాధువులు ఇక్కడకు వచ్చారు. వా రెవ్వరినీ కోరక నన్నే ఎందుకు అడుగు తున్నారు ?” అన్నాను. “మీరు పిలిస్తే దేవతలు వస్తారని మా నమ్మకం" అన్నారు వారు. నేను చిరునవ్వుతో” వస్తారు. నిజమే ! కానీ ఆ సంగతి తెలుసుకోగల వాళ్ళెవరైనా ఉన్నారా ?" అన్నాను" ఉన్నారు. మధ్యప్రదేశ్ నుండి వచ్చిన కార్యకర్తలలో ధ్యానయోగి ఒకరున్నారు. అతడు దేవతల రాకను తెలుసుకోగలడు" అన్నారు. “సరే, సంతోషం అలానే చేద్దాము” అని ఆరోజు రాత్రి పన్నెండు గంటలకు సీతాదేవి పూజించినదని చెప్పబడే దేవకాళీ మందిరంలో అశ్వత్థ వృక్షం క్రింద నా అనుచరులతో కలసి హోమం చేయటం జరిగింది. కొంత సేపు ఆహుతులు వేసిన తరువాత ఆ ప్రదేశం అంతా సుగంధంతో నిండిపోయింది. దేవత హోమకుండంలో అవతరించడాన్ని ఆ ధ్యానయోగి గుర్తించి చెప్పాడు. అద్భుతకాంతిపుంజం మధ్య దేవత నిల్చున్నది అని అతడు చెప్పటం అక్కడి ప్రధాన వ్యక్తులకు సంతృప్తిని కలిగిగించింది. అప్పుడప్పుడు ఇటువంటి సన్నివేశాలు జరిగినవి.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*
*🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 3 🌻*
*ఉత్తరాయణ దక్షిణాయనములు, కృష్ణ శుక్ల పక్షములు, తిథులు, నక్షత్రములు వీని ననుసరించి కూడ అకాల మృత్యువును నిర్ధారణ చేయుదురు. అశుభ సమయములలో దేహము విడిచినపుడు, ఆ దేహియు మరియు ఆ కుటుంబము వారు చాల కష్టనష్టములకు గురి అగుదురు. పై తెలిపిన రెండునూ గాక మృత్యువు అనునది అజ్ఞాన కారణము. మృత్యువు స్వరూప స్వభావములు నెఱిగి స్వచ్చందముగా దేహమును విడచుట వేరు, దేహమున బంధింపబడి భయముతో, బాధతో, వేదనలతో అపస్మారక స్థితిలో మరణించుట వేరు. ఇందు రెండవ సంఘటనను మరణించుట లేక చచ్చుట అందురు. మొదటి విధానమును దేహమును త్యజించుట, పరిత్యజించుట, విడచుట అందురు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻*
*🌻 552. 'Sarvamrutyu Nivarini' - 3 🌻*
*Uttarayana Dakshinayanams, Krishna Shukla Pakshas, Tithi and Nakshatra these also determine premature death. When the body leaves during inauspicious times, the body and the family suffer great losses. Apart from the above, ignorance is the cause of death. It is one thing to leave the body voluntarily while knowing the nature of death, and another to die in an unconscious state with fear, pain and agony while bound to the body. The second event is death. The first method is to renounce, relinquish or separate the body.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
コメント