🍀🌹 21, MARCH 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀
🌹 21, MARCH 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 511 / Bhagavad-Gita - 511 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 22 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 22 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 866 / Sri Siva Maha Purana - 866 🌹
🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 3 / The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 3 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 124 / Osho Daily Meditations - 124 🌹
🍀 124. విశ్వాసం మరియు నమ్మకం / 124. FAITH AND TRUST 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 539-1 🌹
🌻 539. 'శ్రుతిః' - 1 / 539. 'Shrutih' - 1 🌻
5) 🌹 సిద్దేశ్వరయానం - 20 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 511 / Bhagavad-Gita - 511 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 22 🌴*
*22. పురుష: ప్రకృతిస్థో హి భుఙ్త్కే ప్రకృతిజాన్ గుణాన్ |*
*కారణం గుణసఙ్గోస్య సదసద్యోనిజజన్మసు ||*
*🌷. తాత్పర్యం : భౌతికప్రకృతి యందు త్రిగుణముల ననుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతికప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ, అధమజన్మలను పొందుచుండును.*
*🌷. భాష్యము : జీవుడు ఏ విధముగా ఒక దేహము నుండి వేరొక దేహమును పొందుననెడి విషయమును అవగాహనము చేసికొనుటకు ఈ శ్లోకము అత్యంత ముఖ్యమైనది. మనుజుడు వస్త్రములను మార్చిన చందమున జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు చేరునని ద్వితీయాధ్యాయమున వివరింపబడినది. ఇట్టి వస్త్రముల వంటి దేహముల మార్పునకు భౌతికస్థితితో అతని తాదాత్మ్యయే కారణము.*
*అట్టి మిథ్యాభావనచే అతడు ప్రభావితుడై యుండునంతవరకు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పుచెందవలసియే యుండును. అనగా ప్రకృతిపై అధికారము చలాయించవలెననెడి అతని కోరికయే అతనిని అట్టి అవాంచిత పరిస్థితుల యందు నిలుపుచున్నది. కోరిక కారణముగనే అతడు కొన్నిమార్లు దేవతారూపమును, కొన్నిమార్లు మానవదేహమును, కొన్నిమార్లు జంతుదేహమును, కొన్నిమార్లు పక్షిదేహమును, కొన్నిమార్లు, కీటకదేహమును, కొన్నిమార్లు జలచరదేహమును, కొన్నిమార్లు సాధుజన్మను, కొన్నిమార్లు నల్లిదేహమును పొందుచుండును. ఇది అనంతముగా సాగుచున్నది. ఈ అన్ని స్థితుల యందును జీవుడు తనను తాను ప్రభువునని తలచుచుండును. కాని వాస్తవమునకు అతడు ప్రకృతి ప్రభావమునకు లోబడియే యుండును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 511 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 22 🌴*
*22. puruṣaḥ prakṛti-stho hi bhuṅkte prakṛti-jān guṇān*
*kāraṇaṁ guṇa-saṅgo ’sya sad-asad-yoni-janmasu*
*🌷 Translation : The living entity in material nature thus follows the ways of life, enjoying the three modes of nature. This is due to his association with that material nature. Thus he meets with good and evil among various species.*
*🌹 Purport : This verse is very important for an understanding of how the living entities transmigrate from one body to another. It is explained in the Second Chapter that the living entity is transmigrating from one body to another just as one changes dress. This change of dress is due to his attachment to material existence. As long as he is captivated by this false manifestation, he has to continue transmigrating from one body to another. Due to his desire to lord it over material nature, he is put into such undesirable circumstances. Under the influence of material desire, the entity is born sometimes as a demigod, sometimes as a man, sometimes as a beast, as a bird, as a worm, as an aquatic, as a saintly man, as a bug.*
*This is going on. And in all cases the living entity thinks himself to be the master of his circumstances, yet he is under the influence of material nature. How he is put into such different bodies is explained here. It is due to association with the different modes of nature. One has to rise, therefore, above the three material modes and become situated in the transcendental position. That is called Kṛṣṇa consciousness. Unless one is situated in Kṛṣṇa consciousness, his material consciousness will oblige him to transfer from one body to another because he has material desires since time immemorial. But he has to change that conception. That change can be effected only by hearing from authoritative sources. The best example is here: Arjuna is hearing the science of God from Kṛṣṇa. The living entity, if he submits to this hearing process, will lose his long-cherished desire to dominate material nature, and gradually and proportionately, as he reduces his long desire to dominate, he comes to enjoy spiritual happiness. In a Vedic mantra it is said that as he becomes learned in association with the Supreme Personality of Godhead, he proportionately relishes his eternal blissful life.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 866 / Sri Siva Maha Purana - 866 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 35 🌴*
*🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 3 🌻*
*దేవతలకు వారి రాజ్యమును అప్పజెప్పుము. ఓ దానవా! నాకు నీయందు గల ప్రేమను నిలబెట్టు కొనుము. నీ రాజ్యములో నీవు సుఖముగా నుండుము. దేవతలు తమ స్థానములో ఉండెదరు గాక! (21) ప్రాణులతో విరోధమును చాలించుము. దేవద్రోహము వలన ప్రయోజనమేమి గలదు? కశ్యపుని వంశములో పుట్టిన వాందరు శుద్ధముగ కర్మలననుష్ఠించి కులమర్యాదను నిలబెట్టెదరు (22). బ్రహ్మ హత్య మొదలగు ఏ పాపము లైనను జ్ఞాతి ద్రోహము వలన కలిగే పాపములో పదునారవ వంతు అయిననూ కాజాలవు (23).*
*సనత్కుమారుడిట్లు పలికెను - ఈ తీరున శంకరుడు శ్రుతిస్మృతుల తాత్పర్యముతో కూడిన శుభకరమగు అనేక వచనమును పలికి ఆతనికి ఉత్తమమగు జ్ఞానమును బోధించెను (24). కాని ఆ దూత తర్కములో దిట్ట ; పైగా శంఖచూడుడు ఆతనికి తర్ఫీడునిచ్చి పంపెను. కావున ఆతడు విధిబలముచే మోహమును పొంది వినయముతో నిట్లు పలికెను (25).*
*దూత ఇట్లు పలికెను - ఓ దేవా! నీవు చెప్పిన వచనములన్నియూ సత్యమే. మరియొకటి గాదు. ఆయిననూ నేను కూడ కొన్ని యథార్థ విషయములను విన్నవించెదను. వినుడు (26). ఓ ప్రభూ! జ్ఞాతులకు ద్రోహము చేయుట మహాపాపమని నీవీనాడు చెప్పిన మాట రాక్షసులకు మాత్రమే ఏల వర్తించుచున్నది? ఓ ఈశా! అది దేవతలకు అన్వయించదా యేమి? చెప్పుడు (27). అందరికీ వర్తించుననే పక్షములో, నేను ఆలోచించి కొన్ని విషయములను చెప్పెదను. వాటిపై మీ నిర్ణయమును ప్రకటించి నా సందేహమును తొలగించుడు (28). ఓ మహేశ్వరా1 ప్రళయసముద్రములో రాక్షసులలో శ్రేష్ఠులగు మధుకైటభుల తలలను చక్రధారి యగు విష్ణువు నరుకుటకు కారణమేమి? (29) నీవు త్రుపురాసులతో యుద్ధమును చేసి వారి నగరములను భస్మము చేయుటకు కారణమేమి?*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 866 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 35 🌴*
*🌻 The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 3 🌻*
20. Don’t be malicious towards them. You can enjoy your kingdom zealously. Do not try to expand your kingdom nor spoil it.
21. O Dānava, return their kingdom to the gods. Maintain my affection. Stay in your kingdom happily. Let the gods stay in their region.
22. Do not offend people. Don’t be malicious to the gods. The descendants of Kaśyapa are noble and indulge in pure activities.
23. Whatever sin is there in the world, even including that of slaughter of a brahmin, does not merit even a sixteenth part of the sin accruing from the offence towards kinsmen.
24. These and many such words of advice, auspiciously based on injunctions of Śruti and Smṛti, Śiva said to him enlightening him in an excellent manner.
25. The emissary who had been well instructed by Śaṅkhacūḍa who knew his duties well but who had been deluded by destiny spoke these words humbly.
The messenger said:—
26. O lord, what has been narrated by you is true. It cannot be otherwise. But let my submission based on certain factual elements be heard.
27. O lord Śiva, verily a great sin has been cited as the result of offence to kinsmen by you now. But does it concern only Asuras and not the gods? Please tell me.
28. If it applies to all alike, I shall consider it and let you know. Please tell me your decision at the outset and clear my doubts.
29. O lord Śiva, why did the discus-bearing lord Viṣṇu sever the heads of Madhu and Kaiṭabha[1] the excellent Daityas in the ocean of dissolution?
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 124 / Osho Daily Meditations - 124 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 124. విశ్వాసం మరియు నమ్మకం 🍀*
*🕉 విశ్వాసం అనేది జీవం లేని నమ్మకం. నిజానికి, మీకు నమ్మకం లేదు, కానీ మీరు ఇప్పటికీ నమ్ముతున్నారు, అదే విశ్వాసం. కానీ నమ్మకం అనేది సజీవమైనది. ఇది ప్రేమ లాంటిది. 🕉*
*అన్ని ధర్మాలు మీరు ప్రార్థన అని పిలిచే వాటిని కోల్పోయాయి, మీరు ధ్యానం అని పిలిచే వాటిని కోల్పోయాయి. పారవశ్య భాష మొత్తం మరిచిపోయారు. వారందరూ మేధావులుగా మారారు: మతాలు, సిద్ధాంతాలు, వ్యవస్థలు. చాలా పదాలు ఉన్నాయి, కానీ అర్థం లేదు, ప్రాముఖ్యత పోయింది. అది సహజమైనదే. అది అలాగే ఉండాలి. ఒక గురువు సజీవంగా ఉన్నప్పుడు, మతం భూమిపై తిరుగుతుంది మరియు అతనిని గుర్తించి, అతనితో కొన్ని అడుగులు నడిచే అదృష్టం ఉన్న కొద్దిమంది మాత్రమే రూపాంతరం చెందుతారు. మీరు మిడిమిడి మతస్థులుగా మారడం కాదు- ఏదో దైవత్వం మీలోకి ప్రవేశిస్తుంది. మీకు మరియు దైవానికి మధ్య ఏదో జరుగుతుంది.*
*మీరు ప్రార్థనాపరులుగా మారుతారు. మీకు చూడటానికి భిన్నమైన కళ్ళు ఉన్నాయి, వేరొక హృదయ స్పందన. ప్రతిదీ అలాగే ఉంటుంది, కానీ మీరు మారతారు. చెట్లు పచ్చగా ఉంటాయి కానీ ఇప్పుడు వేరే విధంగా ఉంటాయి. పచ్చదనం సజీవంగా మారింది. మీరు మీ చుట్టూ ఉన్న జీవితాన్ని దాదాపుగా తాకగలరు. కానీ గురువు పోయిన తర్వాత, అతను చెప్పినదంతా సూత్రీకరించబడుతుంది, వ్యవస్థీకృత మవుతుంది. అప్పుడు ప్రజలు మేధోపరంగా మతస్థులుగా మారతారు, కానీ సజీవ దైవం ఇప్పుడు లేడు. విశ్వాసం అనేది జీవం లేని నమ్మకం. నిజానికి, మీకు నమ్మకం లేదు, కానీ మీరు ఇప్పటికీ నమ్ముతున్నారు, అదే విశ్వాసం. కానీ నమ్మకం అనేది సజీవమైనది. ఇది ప్రేమ లాంటిది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 124 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 124. FAITH AND TRUST 🍀*
*🕉 Faith is a dead trust. In fact, you don’t trust but you still believe, that's what faith is. But trust is something alive. It is just like love. 🕉*
*All faiths have lost what you call prayer, they have lost what you call meditation. They have forgotten the whole language of ecstasy. They have all become intellectuals: creeds, dogmas, systems. There are many words, but the meaning is missing, the significance is lost. And that is natural. It has to be so. When a Master is alive, religion walks on the earth, and those Few who are fortunate enough to recognize him, to walk a few steps with him, will be transformed. It is not that you become a religious that's superficial-but something of Divine enters you. Something transpires between you and Divine.*
*You become prayerful. You have different eyes to see with, a different heart beating. Everything remains the same, but you change. The trees are green but now in a different way. The greenery has become alive. You can almost touch the life surrounding you. But once Master is gone, whatever he has said becomes formulated, systematized. Then people become Religious intellectually, but the living God is no longer present. Faith is a dead trust. In fact, you don't trust but you still believe, that's what faith is. But trust is something alive. It is just like love.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*
*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*
*🌻 539. 'శ్రుతిః' - 1 🌻*
*వేదరూపిణి శ్రీమాత అని అర్ధము. వేద మనగా తెలియదగినది. ఏది తెలిసిన మరి తెలియ వలసిన దేదియు వుండదో దానిని వేద మందరు. అట్టి వేదమును ఒక రూపముగ నూహించినచో వేదమాత అనగా నేమో తెలియును. వేదరూపిణి అనగా నేమో తెలియును. తెలియకోరువాడు, తెలియ వలసినది, తెలుసుకొను కార్యము మూడునూ దేనినుండి దిగివచ్చుచున్నవో అది వేదము. కర్త కర్మ క్రియలకు మూలము వేదము. మూల ప్రకృతికి, కాలమునకు కూడ మూలము వేదము. సమస్తము పుట్టుకకు మూలము వేదము. దానినే తత్ అనిరి. బ్రహ్మము అనిరి. వేదము అనిరి.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*
*svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻*
*🌻 539. 'Shrutih' - 1 🌻*
*Vedarupini is the Mother. Veda is knowable to us. That when known leaves nothing to be known is called Veda. If one imagines such a Veda with a form, then one would know Veda Mata. One would know what Vedarupini means. The one who wants to know, the thing to be known, and the act of knowing, that from which all these three descend, that is Veda. Vedas are the source of the subject, object and action. Veda is the source of nature and time. Veda is the source of all birth. That is called Tat. That is called Brahman. That is called Veda.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 20 🌹*
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
*🏵 భైరవనాథుడు 🏵*
వాసుకి, ఐరావతుడు, ధృతరాష్ట్రుడు, తక్షకుడు మొదలైన నాగ రాజులు రాక్షసులతో సంగ్రామాలు చేసి నాగజాతిని రక్షించారు. అసురజాతులు, వారిదేశాలు ఉండగా భారతదేశంలో భువర్లోకంలోని రాక్షసులు, పూర్వం ఇక్కడ ఉన్నవారు పునర్జన్మతీసుకొన్నారు. వారిలో చాలామందిని కృష్ణదేవుడు సంహరించాడు. భారత యుద్ధంలో నాశనం చేయించాడు. అయినా వారింకా వస్తూనే ఉన్నారు. వారిలో కొందరు భయంకర తామస సాధనలు చేసి తీవ్రశక్తులు సాధించారు. హిమాలయ పర్వతప్రాంతాలలో ఉత్తర భారతంలోని కొన్ని రాజ్యలలో వారి సంచారం ఎక్కువగా ఉంది.
యువ: గురుదేవా! భూమిమీద అసురజాతులు, మ్లేచ్ఛులు, నాస్తికులు ఉన్నారు. భువర్లోకంలో రాక్షసులున్నారు. వారూ వీరూ ఒకరేనా?
వామ: దీని నేపధ్యం చాలా ఉంది. భూమి జలంనుండి బయటకు వచ్చి సృష్టి ప్రారంభైనప్పుడు ఊర్ధ్వలోకాలలోని దేవతలు, ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి సౌందర్యానికి పరవశించి నివాసాలు ఏర్పరచుకొన్నారు. దేవికా నదీతీరం వారి ప్రథమ నివాసం. మొదట్లో రాకపోకలెక్కువగా ఉండేవి. భూలోకపు అణువులు వారి శరీరాలలో ప్రవేశించి దివ్య లోక గమనశక్తి పోయింది. అయినా ఆ దేవమానవులంటే దివ్యలోక వాసులకు ఇష్టం. తమ జాతివారు గనుక అవసరమైన సమయంలో వచ్చి సహాయం చేస్తుంటారు. అలానే భువర్లోకవాసులైన విద్యాధరులు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, సిద్ధులు భూలోకవాసులైనారు. రాక్షసులు తమ జాతివారిని మానవలోకంలోని వారిని ప్రేరేపించి ధర్మపరులైన దేవజాతి మానవులతో యుద్ధాలు చేయిస్తుంటారు. ఈ లోకమంతా తమ చేతిలో ఉండాలని అందరూ తమ జాతి బానిసలుగా ఉండాలని ప్రపంచంలోని ఐశ్వర్యము అధికారము రాజ్యములు స్త్రీలు తమ వశంలో ఉండాలని కోరే స్వార్ధపరులువారు.
తపస్సులు చేసి తీవ్రసాధనలు చేసి సైన్యములు కూర్చుకొని సర్వదేశాలను ఆక్రమించి ధర్మవినాశనం చేస్తుంటారు. దుర్మార్గులను శిక్షించటానికి అప్పుడప్పుడు మహాదేవతలు అవతరిస్తుంటారు. హిమాలయ సిద్ధాశ్రమంలోని యోగులు దివ్యలోకాలలో ఉండే దేవతల, సిద్ధుల కరుణవల్ల ధర్మరక్షణ కోసం కృషి చేస్తుంటారు. వారు మహర్షులు, యోగీశ్వరుల ప్రణాళిక ననుసరించి అవసరాన్ని బట్టి, జన్మలు తీసుకొంటారు. కొందరు యోగ్యులైన మానవులలో ప్రవేశించి ప్రేరణ నిచ్చి మహాకార్యములు చేయించి కొన్ని శక్తులు ప్రదర్శించి కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంటారు. వారు వెళ్ళిన తర్వాత ఆ మానవులు సామాన్యులవుతారు. దివ్యశక్తులుండవు. కాకుంటే ఒకప్పుడు దేవతలెన్ను కొన్నవారు గనుక ఉత్తమ సంస్కారంతో మిగిలిన జీవిత భాగం గడుపుతారు.
నీవు క్రూరశక్తులు సాధించిన మంత్ర సిద్ధులతో పోరాడవలసి ఉంటుంది. వారు ధనవంతులను రాజులను వశం చేసుకొని తమ మతాలను ప్రచారం చేసుకొని వేదమార్గీయులను తమ మతంలోకి మారుస్తారు. కాముకులై స్త్రీలను వశం చేసుకుంటారు. పతివ్రతలను పాడుచేస్తారు. అప్రతిహతమైన వారి మంత్రశక్తి ముందు ఎవరూ నిలవలేరు. దానిని ఎదుర్కోగల మహాశక్తిని నీవు సాధించాలి.
యువ : గురుదేవా ! నేనేం చేయాలో ఎలా చేయాలో ఆదేశించండి!
వామ : నాగభైరవా ! నేను పూర్వయుగంలో ఒక కన్య చేత తీవ్రసాధన చేయించిన పద్ధతి చెపుతాను. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. అతని కుమారుడు బలి. రాక్షసరాజు. అతని కథ భాగవతంలో ఉంది. ప్రసిద్ధమైనది. విరోచనుని కొక కూతురున్నది. అందరూ ఆమెను వైరోచని అనేవారు. చాలా సౌందర్యవతి. విద్యావతి. వినయశీల. ఆమె నా ఆశ్రమానికి వచ్చి పోతూ ఉండేది. ఆమె ఒకరోజు నన్ను ప్రార్ధించింది. "గురువుగారూ! మీరు మహర్షులు. మీ తపశ్శక్తి అసామాన్యమైనది. మా పూర్వుల చరిత్రలు - వారి తపస్సులు జగద్విదితములు, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల దేవద్వేషము స్వార్ధము వారిని నాశనము చేసినవి. మా తాతగారు ప్రహ్లాదులవారు మహనీయులు. దేవకార్యంకోసం వైకుంఠవాసి, విష్ణువు అనుచరుడు అయిన శంకుకర్ణుడనే వ్యక్తి జన్మతీసుకొని హిరణ్యకశిపుని తన సాత్వికశక్తితో ఓడించాడని పెద్దలు చెప్పగా విన్నాను. మా తండ్రి మహావీరుడు. ఆయనను యుద్ధంలో గెలువలేక ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి యాచిస్తే తన ప్రాణములనే దానం చేసిన మహానీయుడతడు.
నాకు అందరివలె పెండ్లి చేసుకొని పిల్లలను కని జీవితం గడపాలని లేదు. తపస్సు చేసి దివ్యత్వాన్ని సాధించాలని ఉంది. మా ముత్తాతల వలె ఘోర సాధన చేయలేను. సులభపద్ధతి అడగను. కానీ శీఘ్రంగా ఇష్టసిద్ధిని పొందే మార్గం ఉపదేశించమని ప్రార్థిస్తున్నాను. "నేను కొంత సేపు ఆలోచించి మా ఆశ్రమం ఏ కొండ క్రింద ఉన్నదో ఆ కొండమీది గుహలోకి ఆ అమ్మాయిని తీసుకు వెళ్ళాను.
అది నా గుహ. దానిలోనికి ఎవరికీ ప్రవేశం లేదు. మొదటిసారి ఈమెకు అనుమతి ఇచ్చాను. ఆ గుహలో లోపలికి పోతే ఒక విగ్రహం భయంకరంగా ఉంది. అది ఛిన్నమస్తా విగ్రహం. ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో నరకబడిన తనతల రతిమన్మధాసనం మీద నిలబడిన దిగంబర, ముక్తకేశ, కపాల మాలాధర - అటు ఇటు చెలకత్తెలు వర్ణిని, డాకిని. కంఠంలో నుండి ఎగజిమ్మే మూడు రక్తధారలు మధ్య ధార తన శిరస్సుతో తానే పానం చేస్తున్నది. మిగతా రెండు రక్తధారలను చెలికత్తెలు త్రాగుతున్నారు. "అమ్మా! యీ దేవత ఛిన్నమస్త - వజ్రవైరోచని ఈమెను హిరణ్యాక్షుడుపాసించాడు. సాక్షాత్కారించిన ఆ దేవతను అమరత్వం ఇమ్మని ప్రార్థించాడు. అది తప్ప ఇంకేదైనా కోరుకోమన్నది దేవత. అతడు "అమ్మా! నీవు తప్ప నన్నింకెవడూ చంపగూడదు" అన్నాడు. ఆమె దానికి తథాస్తు అన్నది. మళ్ళీ “నీవు కూడా నన్ను చంపకూడదు" అన్నాడు. దానికి కూడా తథాస్తు అన్నది. వరగర్వంతో అతడు దుష్కార్యములు చేశాడు. వజ్రేశ్వరి శిరస్సు మీది కిరీటం మీద వరాహ చిహ్నం ఉంటుంది. అందువల్ల ఆమెను వజ్రవారాహి అన్నారు. వరాహముఖిగా కూడా కొందరు దర్శించారు. ఆ దేవత పురుష రూపంలో శ్వేత వరాహమూర్తియై హిరణ్యాక్షుని సంహరించింది. ఆమె యొక్క పురుష రూపం గనుక ఆమె చంపినట్లే. అయితే ఆమె స్త్రీగా చంపలేదు గనుక చంపినట్లూ కాదు. అలా అతని కథ ముగిసింది. ఆ దేవతను నేనుపాసించాను. బలులులేవు. పంచాగ్ని మధ్యంలోనో కంఠదఘ్నజలంలోనో ఉండి తపస్సు చేయటం లేదు.ఆ దేవత అనుగ్రహించింది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Σχόλια