top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 22, FEBRUARY 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 22, FEBRUARY 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀

1) 🌹 22, FEBRUARY 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 505 / Bhagavad-Gita - 505 🌹

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 16 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 16 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 860 / Sri Siva Maha Purana - 860 🌹

🌻. శంఖచూడునిపై శివుని యుద్ధ సన్నాహము - 5 / March of The Victorious Lord Śiva - 5 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 118 / Osho Daily Meditations  - 118 🌹

🍀 118. స్నేహం 118. FRIENDSHIP 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 536-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 536-3 🌹

🌻 536. 'స్వాహా స్వధా' - 3 / 536. 'Swaha Swadha' - 3 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 22, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹*

*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*


*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 75 🍀*


*75. సంవర్తరూపో మౌద్గల్యో మార్కండేయశ్చ కాశ్యపః |*

*త్రిజటో గార్గ్యరూపీ చ విషనాథో మహోదయః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : భూమికలు - సత్యములు - వేర్వేరు భూమికలకు వర్తించే సత్యములు వేర్వేరుగా వుంటాయి. క్రింది భూమికలకు వర్తించే కొన్ని సత్యములు పై భూమికలకు వర్తించవు. ఉదాహరణకు, కామము అహంకారము అనునవి మనోమయ. ప్రాణమయ, అన్నమయ, అజ్ఞాన భూమికలకు వర్తించే సత్యాలు. ఈ భూమికలను దాటి మనం పైకి పోగలిగినప్పుడు కామాహంకారముల సత్యత్వం అంతరించి, నిక్కమైన పురుషుని కప్పిపుచ్చే అసత్యములుగా అవి మనకు గోచరిసాయి. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శిశిర ఋతువు, ఉత్తరాయణం,

మాఘ మాసము

తిథి: శుక్ల త్రయోదశి 13:23:31

వరకు తదుపరి శుక్ల చతుర్దశి

నక్షత్రం: పుష్యమి 16:44:50

వరకు తదుపరి ఆశ్లేష

యోగం: సౌభాగ్య 12:12:20 వరకు

తదుపరి శోభన

కరణం: తైతిల 13:23:31 వరకు

వర్జ్యం: 30:58:24 - 32:45:12

దుర్ముహూర్తం: 10:32:52 - 11:19:36

మరియు 15:13:14 - 15:59:58

రాహు కాలం: 13:57:18 - 15:24:55

గుళిక కాలం: 09:34:28 - 11:02:05

యమ గండం: 06:39:15 - 08:06:51

అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52

అమృత కాలం: 09:41:04 - 11:26:48

సూర్యోదయం: 06:39:15

సూర్యాస్తమయం: 18:20:09

చంద్రోదయం: 16:38:28

చంద్రాస్తమయం: 05:16:38

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు: శుభ యోగం - కార్య జయం

16:44:50 వరకు తదుపరి అమృత

యోగం - కార్య సిధ్ది

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 505 / Bhagavad-Gita - 505 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 16 🌴*


*16. బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ |*

*సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్ ||*


*🌷. తాత్పర్యం : పరమాత్ముడు స్థావర, జంగములైన సర్వజీవుల అంతర్భాహ్యములలో నిలిచియుండును. సూక్ష్మత్వకారణముగా అతడు భౌతికేంద్రియములకు అగోచరుడును, ఆగ్రాహ్యుడును అయియున్నాడు. అతిదూరమున ఉన్నను అతడు సర్వులకు సమీపముననే ఉండును.*


*🌷. భాష్యము : పరమపురుషుడైన నారాయణుడు ప్రతిజీవి యొక్క అంతర్భాహ్యములలో నిలిచియుండునని వేదవాజ్మయము ద్వారా మనము తెలిసికొనగలము. అతడు భౌతిక, ఆధ్యాత్మిక జగత్తులు రెండింటి యందును నిలిచియున్నాడు. అతడు అత్యంత దూరమున ఉన్నను మనకు సమీపముననే యుండును. ఇవియన్నియును వేదవచనములు. ఈ విషయమున కఠోపనిషత్తు (1.2.21) “ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వత:” అని పలికినది.*


*దివ్యానందమగ్నుడైన ఆ పరమపురుషుడు ఎట్లు తన ఐశ్వర్యముల ననుభవించునో మనము అవగతము చేసికొనజాలము. ఈ భౌతికేంద్రియములతో ఈ విషయమును గాంచుట గాని, అవగతము చేసికొనుట గాని చేయజాలము. కనుకనే అతనిని తెలియుట యందు మన భౌతిక మనో, ఇంద్రియములు పనిచేయజాలవని వేదములు పలుకుచున్నవి. కాని కృష్ణభక్తిరసభావనలో భక్తియోగమును అవలంబించుచు మనస్సును, ఇంద్రియములను పవితమొనర్చుకొనినవాడు అతనిని నిత్యము గాంచగలడు. శ్రీకృష్ణభగవానుని యెడ ప్రేమను వృద్ధిగావించుకొనినవాడు అతనిని నిర్విరామముగా నిత్యము గాంచగలడని బ్రహ్మసంహిత యందు నిర్ధారింపబడినది. భక్తియుక్తసేవ ద్వారానే అతడి దర్శింపబడి అవగతమగునని భగవద్గీత (11.54) యందును ఈ విషయము నిర్ధారింపబడినది.*

🌹 🌹 🌹 🌹 🌹



*🌹 Bhagavad-Gita as It is - 505 🌹

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 16 🌴*


*16. bahir antaś ca bhūtānām acaraṁ caram eva ca*

*sūkṣmatvāt tad avijñeyaṁ dūra-sthaṁ cāntike ca tat*


*🌷 Translation : The Supreme Truth exists outside and inside of all living beings, the moving and the nonmoving. Because He is subtle, He is beyond the power of the material senses to see or to know. Although far, far away, He is also near to all.*


*🌹 Purport : In Vedic literature we understand that Nārāyaṇa, the Supreme Person, is residing both outside and inside of every living entity. He is present in both the spiritual and material worlds. Although He is far, far away, still He is near to us. These are the statements of Vedic literature. Āsīno dūraṁ vrajati śayāno yāti sarvataḥ (Kaṭha Upaniṣad 1.2.21). And because He is always engaged in transcendental bliss, we cannot understand how He is enjoying His full opulence. We cannot see or understand with these material senses.*


*Therefore in the Vedic language it is said that to understand Him our material mind and senses cannot act. But one who has purified his mind and senses by practicing Kṛṣṇa consciousness in devotional service can see Him constantly. It is confirmed in Brahma-saṁhitā that the devotee who has developed love for the Supreme God can see Him always, without cessation. And it is confirmed in Bhagavad-gītā (11.54) that He can be seen and understood only by devotional service. Bhaktyā tv ananyayā śakyaḥ.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 860 / Sri Siva Maha Purana - 860 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 33 🌴*


*🌻. శంఖచూడునిపై శివుని యుద్ధ సన్నాహము - 5 🌻*


*భయంకరము, మిక్కిలి చంచలము, యోజనము పొడవు గలది యగు నాలుకను కలిగినదై నడచెను. శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గము, ధనస్సు, మరియు బాణములను (39). గుండ్రని లోతైన యోజనము వెడల్పుగల కాపాలమును, ముద్గరమును, రోకలిని, ఆకసమును స్పృశించు త్రిశూలమును, యోజనము పొడవు గల శక్తిని, వజ్రమును, దట్టని డాలును ఆమె ధరించెను. అమె వైష్ణవ, వారుణ, వాయవ్యాస్త్రములను, నాగపాశమును (40, 41), నారాయణ, గాంధర్వ, బ్రహ్మ, గారుడ, పార్జన్య, పాశుపత, జృంభణ, పార్వత (42), మహావీర, సౌర కాలకాల, మహానల, మహేశ్వర అస్త్రములను, యమదండమును, సంమోహన (43), సమర్థ అస్త్రములను, ఇంకనూ అనేకములగు దివ్యాస్త్రములను చేతులన్నిటియందు దాల్చి, అపుడామె బయలు దేరెను (44).*


*ఆమె భయంకరాకారులగు మూడుకోట్ల డాకినిలతో, మరియు మూడు కోట్ల యోగినులతో సహా వచ్చి అక్కడ నిలబడెను (45). భూత, ప్రేత, పిశాచ, కూష్మాండ, బ్రహ్మరాక్షస, వేతాల, యక్ష, కిన్నరులతో (46) చుట్టువార బడియున్న కుమారస్వామి తండ్రియగు చంద్రశేఖరునకు ప్రణమిల్లి ఆయన ఆజ్ఞచే ఆయనకు సహాయకుడై ప్రక్కనే నిలబడెను (47). అపుడు ఉగ్రరూపుడు, నిర్భయుడు నగు శంభుడు తన సైన్యమునంతనూ తీసుకొని శంఖచూడునితో యుద్ధమునకు వెళ్లెను (48). దేవతల నుద్దరించుట కొరకై మహాదేవుడు సుందరమగు చంద్రభాగానదీ తీరమునందు వటవృక్షము యొక్క మూలమునందు మకాము చేసెను (49).*


*శ్రీ శివమహాపురాణములో రుద్రససంహితయందలి యుద్ధఖండలో మహాదేవుని యుద్ధయాత్ర వర్ణనమనే ముప్పది మూడవ అధ్యాయము ముగిసినది (33).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 860 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 33 🌴*


*🌻 March of The Victorious Lord Śiva - 5 🌻*


39-44. Her tongue was a yojana long and terrible. She bore conch, discus, mace, lotus, sword, leather shield, bows, arrows, skull of circular shape, a yojana in width and majestic in appearance, a trident that touched the sky, a yojana long spear, iron club, threshing rod, thunderbolt, sword, a thick shield, the miraculous weapons of Viṣṇu, Varuṇa, Vāyu, Nārāyaṇa, Gandharva, Brahmā, Garuḍa, Parjanya, Paśupati, Parvata, and Maheśvara, Nāgapāśa, Jṛṃbhaṇāstra, the Mahāvīra, the Saura, the Kālakāla and the Mahānala weapons, the staff of Yama, the Sammohana, the divine weapon called Samartha. Many such and other divine weapons she held in her hands.


45. She came and stood there with three crores of Yoginīs and three crores of terrible Ḍākinīs.


46. Bhūtas, Pretas, Piśācas, Kūṣmāṇḍas, Brahmarākṣasas, Vetālas, Yakṣas, Kinnaras and Rākṣasas too came there.


47. Skanda was surrounded by these all. He bowed to Śiva and at his bidding stayed near his father to assist him.


48. The fearless, fierce Śiva gathered his armies and went to fight Śaṅkhacūḍa.


49. The great god stationed himself at the foot of a beautiful Banyan tree on the banks of the river Candrabhāgā,


[9] for the emancipation of the gods.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 118 / Osho Daily Meditations  - 118 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 118. స్నేహం 🍀*


*🕉  ఒకరికి ముందుగా స్నేహం తనతోనే ఉండాలి, కానీ చాలా అరుదుగా తనతో తాను స్నేహంగా ఉండే వ్యక్తిని మీరు కనుగొంటారు, మనం వేరొకరితో స్నేహంగా ఉండగలమని వృధాగా ఆశిస్తూనే మనకు మనం శత్రువులం. 🕉*


*మనల్ని మనం ఖండించుకోవడం నేర్పించబడింది. స్వీయ ప్రేమ పాపంగా భావించబడింది. అది కాదు. ఇది అన్ని ఇతర ప్రేమలకు పునాది. స్వయం ప్రేమ ద్వారానే పరోపకార ప్రేమ సాధ్యమవుతుంది. స్వీయ ప్రేమను ఖండించినందున, ప్రేమ యొక్క అన్ని ఇతర అవకాశాలు భూమి నుండి అదృశ్యమయ్యాయి. ప్రేమను నాశనం చేయడానికి ఇది చాలా మోసపూరిత వ్యూహం. మీరు ఒక చెట్టుతో, 'భూమి ద్వారా నిన్ను నువ్వు పోషించుకోవద్దు; అది పాపం. చంద్రుడు మరియు సూర్యుడు మరియు నక్షత్రాల నుండి నిన్ను నువ్వు పోషించుకోవద్దు; అది స్వార్థం. పరోపకారంతో ఇతర చెట్లకు సేవ చేయి.' ఇది తార్కికంగా కనిపిస్తుంది కానీ అది ప్రమాదం. ఇది తార్కికంగా కనిపిస్తుంది:*


*మీరు ఇతరులకు సేవ చేయాలనుకుంటే, త్యాగం చేయండి; సేవ అంటే త్యాగం. కానీ ఒక చెట్టు త్యాగం చేస్తే, అది చనిపోతుంది, అది ఏ ఇతర చెట్టుకు సేవ చేయలేదు; అది ఉనికిలోనే ఉండదు. మీరు బోధింపబడింది, 'మిమ్మల్ని మీరు ప్రేమించుకోవద్దు.' దాదాపుగా వ్యవస్థీకృత మతాలు అని పిలవబడే వాటి విశ్వవ్యాప్త సందేశం ఇదే. యేసు యొక్క కాదు, కానీ ఖచ్చితంగా క్రైస్తవ మతం; బుద్ధునిది కాదు, బౌద్ధమతం-- అన్ని వ్యవస్థీకృత మతాల బోధన: మిమ్మల్ని మీరు ఖండించుకోండి, మీరు పాపులు, మీరు విలువ లేనివారు. ఈ ఖండన కారణంగా మానవ చెట్టు కుంచించుకు పోయింది, మెరుపును కోల్పోయింది, ఇక సంతోషించలేదు. ప్రజలు తమను తాము ఏదో ఒకవిధంగా లాగుతున్నారు. ప్రజలకు ఉనికిలో మూలాలు లేవు, వారు నిర్మూలించబడ్డారు. వారు ఇతరులకు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరియు వారు చేయలేరు, ఎందుకంటే వారు తమతో తాము స్నేహంగా కూడా ఉండరు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 118 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 118. FRIENDSHIP 🍀*


*🕉  The first friendship has to be with oneself, but very rarely will you find a person who is friendly toward himself or herself We are enemies to ourselves, while hoping in vain that we can be friends to someone else.  🕉*


*We have been taught to condemn ourselves. Self-love has been thought of as a sin. It is not. It is the foundation of all other loves. It is only through self-love that altruistic love is possible. Because selflove has been condemned, all other possibilities of love have disappeared from the earth. This has been a very cunning strategy to destroy love. It is as if you were to say to a tree, "Don't nourish yourself through the earth; that is sin. Don't nourish yourself from the moon and the sun and the stars; that is selfishness. Be altruistic serve other trees." It looks logical, and that is the danger. It looks logical:*


*If you want to serve others, then sacrifice; service means sacrifice. But if a tree sacrifices, it will die, it will not be able to serve any other tree; it will not be able to exist at all. You have been taught, "Don't love yourself."That almost has been the universal message of the so-called organized religions. Not of Jesus, but certainly of Christianity; not of Buddha but of Buddhism-- of all organized religions, that has been the teaching: Condemn yourself, you are a sinner, you are worthless. And because of this condemnation the tree of the human being has shrunk, has lost luster, can no longer rejoice. People are dragging themselves along somehow. People don't have any roots in existencethey are uprooted. They are trying to be of service to others and they cannot, because they have not even been friendly to themselves.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 536 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 536 - 3 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*

*స్వాహా, స్వధా,ఽమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*


*🌻 536. 'స్వాహా స్వధా' - 3 🌻*


*స్వధా అనగా బాగుగా ధరించునది అని అర్ధము. సృష్టిని బాగుగా ధరించి పోషించునది గనుక స్వధా అని శ్రీమాతను ప్రశంసింతురు. స్వధా అనగా తనను తాను ధరించుట అని అర్థము. అనగా ఆత్మయే ఆధారముగ జీవించుట అని అర్థము. సాధు అన్న పదము స్వధా పదము నుండియే ఉత్పన్న మయ్యెను. తనకు తానే ఆధారమై సమస్తమునకు తాను పోషకుడై నిలచినపుడు స్వధానమున చేరినట్లు భావించవలెను.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 536 - 3 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*

*svahasvadha mati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻*


*🌻 536. 'Swaha Swadha' - 3 🌻*


*Swadha means one who wears well. Sri Mata is praised as Swadha as she who wears and nurtures the universe well. Swadha means wearing oneself. It means living totally dependent on the soul itself. The word Sadhu is derived from the word Swadha. When he stands as the patron of everything based on himself, he should feel that he has reached Swadhana.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Commentaires


bottom of page