top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 22, MAY 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀🌹 22, MAY 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀

1) 🌹 కపిల గీత - 339 / Kapila Gita - 339 🌹

🌴 8. ధూమ - అర్చిరాది మార్గముల ద్వారా వెళ్ళు వారి గతి - భక్తియోగ విశిష్టత - 22 / 8. Entanglement in Fruitive Activities - 22 🌴

2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 932 / Vishnu Sahasranama Contemplation - 932 🌹

🌻 932. అనన్తరూపః, अनन्तरूपः, Anantarūpaḥ 🌻

3) 🌹 సిద్దేశ్వరయానం - 63🌹

🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵

4) 🌹 దైవమే శరణ్యం / God is Refuge 🌹

5) 🌹. శివ సూత్రములు - 246 / Siva Sutras - 246 🌹

🌻 3-38. త్రిపాదాద్య అనుప్రాణానం - 2 / 3-38. tripadādya anuprānanam - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 339 / Kapila Gita - 339 🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 8. ధూమ - అర్చిరాది మార్గములద్వారా వెళ్ళువారి గతి - భక్తియోగ విశిష్టత - 22 🌴*


*22. తస్మాత్త్వం సర్వభావేన భజస్వ పరమేష్డినమ్|*

*తద్గుణాశ్రయయా భక్త్యా భజనీయపదాంబుజమ్॥*


*తాత్పర్యము : అమ్మా! అందువలన నీవు సకల లోకములకును ఆరాధ్యములైన శ్రీమన్నారాయణుని పాదపద్మములనే నమ్ముకొనుము. త్రికరణశుద్ధిగా భక్తిశ్రద్ధలతో మనస్సు లగ్నమొనర్చి, వాటిని భజింపుము.*


*వ్యాఖ్య : పరమేష్ఠినం అనే పదాన్ని కొన్నిసార్లు బ్రహ్మకు సంబంధించి ఉపయోగిస్తారు. పరమేష్ఠి అంటే 'అత్యున్నత వ్యక్తి.' ఈ విశ్వంలో బ్రహ్మ సర్వోన్నతమైన వ్యక్తి కాబట్టి, కృష్ణుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో సర్వోన్నత వ్యక్తి. భగవంతుడు కపిలదేవుడు తన తల్లికి భగవంతుని యొక్క పరమ పురుషుడైన కృష్ణుడి పాద పద్మాలను ఆశ్రయించాలని సలహా ఇస్తాడు, ఎందుకంటే అది విలువైనది. బ్రహ్మ మరియు శివ వంటి అత్యున్నత స్థానాలలో ఉన్న దేవతలను కూడా ఆశ్రయించడం ఇక్కడ సూచించబడలేదు. పరమాత్మను ఆశ్రయించాలి.*


*సర్వ-భావేన అంటే 'సర్వ-ప్రేమ పారవశ్యంలో'. భగవంతుని యొక్క స్వచ్ఛమైన ప్రేమను పొందే ముందు ఔన్నత్యం యొక్క ప్రాథమిక దశ భవ. ఇది భగవద్గీతలో చెప్పబడింది, బుధ్ధ భావ సమన్వతః ( BG 10.8 ) భావ దశను పొందిన వ్యక్తి కృష్ణ భగవానుడి పాద పద్మాలను పూజించదగినదిగా అంగీకరించవచ్చు. కపిల భగవానుడు తన తల్లికి కూడా ఇక్కడ సలహా ఇచ్చాడు. ఈ పద్యంలో తద్-గుణాశ్రయయా భక్త్యా అనే పదబంధం కూడా ముఖ్యమైనది. దీనర్థం కృష్ణునికి భక్తితో కూడిన సేవను అందించడం అతీతమైనది; అది భౌతిక చర్య కాదు. ఇది భగవద్గీతలో ధృవీకరించబడింది: భక్తి సేవలో నిమగ్నమైన వారు ఆధ్యాత్మిక రాజ్యంలో స్థితులుగా అంగీకరించ బడతారు. బ్రహ్మ-భూయాయ కల్పతే: ( BG 14.26) వారు ఒక్కసారిగా అతీంద్రియ రాజ్యంలో ఉంటారు.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 339 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 8. Entanglement in Fruitive Activities - 22 🌴*


*22. tasmāt tvaṁ sarva-bhāvena bhajasva parameṣṭhinam*

*tad-guṇāśrayayā bhaktyā bhajanīya-padāmbujam*


*MEANING : My dear mother, I therefore advise that you take shelter of the Supreme Personality of Godhead, for His lotus feet are worth worshiping. Accept this with all devotion and love, for thus you can be situated in transcendental devotional service.*


*PURPORT : The word parameṣṭhinam is sometimes used in connection with Brahmā. Parameṣṭhī means "the supreme person." As Brahmā is the supreme person within this universe, Kṛṣṇa is the Supreme Personality in the spiritual world. Lord Kapiladeva advises His mother that she should take shelter of the lotus feet of the Supreme Personality of Godhead, Kṛṣṇa, because it is worthwhile. Taking shelter of demigods, even those in the highest positions, like Brahmā and Śiva, is not advised herein. One should take shelter of the Supreme Godhead.*


*Sarva-bhāvena means "in all-loving ecstasy." Bhāva is the preliminary stage of elevation before the attainment of pure love of Godhead. It is stated in Bhagavad-gītā, budhā bhāva-samanvitāḥ: (BG 10.8) one who has attained the stage of bhāva can accept the lotus feet of Lord Kṛṣṇa as worshipable. This is also advised here by Lord Kapila to His mother. Also significant in this verse is the phrase tad-guṇāśrayayā bhaktyā. This means that discharging devotional service unto Kṛṣṇa is transcendental; it is not material activity. This is confirmed in Bhagavad-gītā: those who engage in devotional service are accepted to be situated in the spiritual kingdom. Brahma-bhūyāya kalpate: (BG 14.26) they at once become situated in the transcendental kingdom.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 932 / Vishnu Sahasranama Contemplation - 932 🌹*


*🌻 932. అనన్తరూపః, अनन्तरूपः, Anantarūpaḥ 🌻*


*ఓం అనన్తరూపాయ నమః | ॐ अनन्तरूपाय नमः | OM Anantarūpāya namaḥ*


*అనన్తాని రూపాణ్యస్య విశ్వప్రపఞ్చరూపేణ స్థితస్యేతి అనన్తరూపః*


*సర్వ ప్రపంచ రూపమునను ఉన్న ఈతని రూపములు అనంతములు కావున ఈతడు అనంతములగు రూపములు కలవాడు.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 932 🌹*


*🌻 932. Anantarūpaḥ 🌻*


*OM Anantarūpāya namaḥ*


*अनन्तानि रूपाण्यस्य विश्वप्रपञ्चरूपेण स्थितस्येति अनन्तरूपः / Anantāni rūpāṇyasya viśvaprapañcarūpeṇa sthitasyeti anantarūpaḥ*


*Endless are His forms who is of the form of the vast universe and hence He is called Anantarūpaḥ.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 సిద్దేశ్వరయానం - 63 🌹*


*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*


*యోగేశ్వరిని కాళీయోగి చిరునవ్వుతో చెయ్యెత్తి ఆశీర్వదించి గంభీరమైన కాళీ విగ్రహం వైపు చూస్తూ హోమకుండంలోకి ప్రవేశించి పద్మాసనంలో ధ్యానముద్రలో కూర్చొన్నాడు. అగ్నిస్తంభన సిద్ధుడైన ఆ మహనీయుని దహించే శక్తి అగ్నికి లేదు. ఆయన ఇచ్ఛాశక్తి వల్ల శరీరంలో నుండే అగ్ని ఉదయించి దహించటం మొదలు పెట్టింది. ప్రజ్వలిస్తున్న ఆ జ్వాలలో ఆ సిద్ధశరీరం దహనమవుతుంటే వాతావరణమంతా దివ్యపరిమళం వ్యాపించింది, ఒకవైపు అశ్రువులు కంటివెంట జాలువారుతుంటే, ఎంత ఆపుకున్నా ఆగని దుఃఖం మనసును ఆక్రమిస్తుంటే నిలుచో లేక ఒక స్తంభాన్ని పట్టుకొని అలా కూర్చుండి పోయింది యోగేశ్వరి. స్పృహ ఉన్నదో లేదో.*


*తరువాత కార్యక్రమం అంతా కాళీయోగి చెప్పినట్లే జరిగింది. కాళీ మందిరాన్ని యోగి సూచించిన ప్రకారం అక్కడికి వచ్చిన వృద్ధభక్తునకు అప్పగించింది. ఆయన కుమారుడు కూడా తీవ్రసాధకుని వలె కన్పించాడు. కొద్దిరోజులు అక్కడ ఉండి అక్కడ నుండి బయలుదేరి బృందావనం వెళ్ళింది. వృద్ధురాలైన తల్లి తనరాకకు ఎంతో సంతోషించింది. ఆమె అడిగితే తనసాధన గూర్చి గడచిన సంవత్సరాలలో చేసిన వాటి గురించి కొద్ది విశేషాలు చెప్పింది. వాటిని తన చెల్లెలు కూడా విన్నది. ఆమెకు వీటి మీద సదభిప్రాయం కలుగలేదు.*


*యోగేశ్వరి కూడా నచ్చజెప్పటం కోసం ప్రయత్నంచేయలేదు. ఎవరి మార్గం వారిది. తనకు స్ఫురిస్తున్నదాన్నిబట్టి తన చెల్లెలు ఒక గోపికవలే కృష్ణుని విరహంతో తపించి తపించి కృతార్ధురాలవుతుంది. ఆ తరువాత కొద్దికాలానికే వృద్ధురాలైన తల్లి మరణించింది. తమ స్వస్థలానికి వెళ్ళి అక్కడి ఆస్తి పాస్తుల వ్యవహారాలన్నీ సరిదిద్ది అన్నింటిని అమ్మివేసి ఆ ధనాన్ని తీసుకువచ్చి చెల్లెలికి అప్పగించింది. తనకు ఏవిధమైన పూర్వుల ఆర్జితము అక్కరలేదని ఇంతకు మునుపువలెనే, దేశదిమ్మరిగా తిరుగుతుంటానని చెప్పి చెల్లెలిని ఒప్పించి అక్కడినుండి కాశీ వెడుతున్నాని చెప్పింది. తల్లి మరణించిన ఇంట్లో తా నొక్కతే ఉండలేను గనుక, ఇప్పుడు ఉన్న ఇల్లు స్వగృహం కాదు కనుక తాను కూడా కాశీ వచ్చి కొన్నాళ్ళుంటానని చెల్లెలుకోరింది.*


*ఇద్దరూ కలిసి వారణాసికి చేరి కేదారేశ్వరుని దగ్గర ఒక ధర్మశాలలో ఉన్నారు. రోజూ విశ్వనాధుని దర్శనం, అన్నపూర్ణ, విశాలాక్షి మొదలైన దేవతలను పూజించటం జరిగేవి. కొన్నాళ్ళుకు అక్కడికి దగ్గరలో ఒక చిన్నభవనం అమ్మకానికి ఉన్నదని విని యోగేశ్వరి చెల్లెలు దానిని కొనాలని, కొంత కాలం కాశీవాసానికి ఉపయోగిస్తుందని భావించింది. యోగేశ్వరి కూడా మంచిఆలోచనే అనటం వల్ల ఆ ఇల్లు తీసుకొన్నారు. అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసిన తరువాత యోగేశ్వరి చెల్లెలిని విడిచి మళ్ళీ కొంతకాలానికి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. బయలు దేరిన యోగేశ్వరికి భాద్రపద శుద్ధ అష్టమి సమీపిస్తున్న సంగతి గుర్తుకు వచ్చింది. గురువుగారు చెప్పిన మాట స్మృతిలో మెదిలింది.*


*బయలుదేరిన త్రోవమార్చి బృందావనానికి చేరుకొని, రాధాష్టమినాడు ఉపవసించి ఆ రోజు రాత్రి ధ్యానంలో కూర్చున్నది. అర్ధనిశా సమయానికి కాళీయోగి ధ్యాన భూమికలోకి వచ్చి రాధామంత్రాన్ని ఉపదేశించి ఆశీర్వదించి అదృశ్యమయినాడు. ఆయనతో ఎన్నో విషయాలు మాట్లాడాలని ఏవేవో చెప్పాలని ఆశించింది. కాని ఆయన దానికి అవకాశము ఇవ్వలేదు ‘ప్రాప్తమింతే' అనుకొని 40 రోజులు ఆ పవిత్ర ధామంలో జపధ్యాన సాధన చేసింది. రాసేశ్వరి యొక్క కరుణా కటాక్షాలు తనయందు ప్రసరిస్తున్న అనుభూతి కలిగింది. సంతోషము కలిగినట్లు అనిపిస్తున్నది. హ్లాదినీ శక్తి తరంగాలు తనను ముంచెత్తడం ఆమె గమనించగలిగింది.*


*కర్తవ్య ప్రేరణ వల్ల వంగదేశంలోని కొన్ని నిర్దిష్ట ప్రదేశాలకు వెళ్ళి చాలామంది సాధకులకు మంత్ర సాధనలవల్ల దివ్యానుభూతులు కలగటానికి తోడ్పడింది. కాళీయోగి శరీరాన్ని విడిచి పెట్టిన తరువాత మామూలు వస్త్రములు కాక కాషాయ వస్త్రధారిణయై విభూతి, కుంకుమ రెండూ ముఖమున ధరించి కంఠమున రుద్రాక్షమాలతో ఆమె నడచి వస్తూంటే తేజస్విని యైన ఒక మహాయోగిని కదలివస్తున్నట్లుగా ఉండేది. చూడటానికి 25సం|| మాత్రమే ఆమె శరీరంపై కనబడేది. అక్కడి నుండి, భారతదేశములోని ఎన్నో దివ్యక్షేత్రములు దర్శించింది. ప్రధానంగా కాళీక్షేత్రములయిన ఉజ్జయినిలో, కామాఖ్యలో ఎక్కువ కాలం గడిపింది. అన్నిటికంటే కామాఖ్య అమెను ఎక్కువ ఆకర్షించటంవల్ల చాలాసంవత్సరాలు అక్కడే గడిపింది. హిమాలయాలకు వెళ్ళి తన గురువుగారు తపస్సు చేసిన గుహలో చాలాకాలం కాళీసాధన చేసింది. ధ్యానంలో కాళీదేవి, ఆమె సన్నిధిలో గురుదేవులు కనిపించేవారు.*


*( సశేషం )*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 దైవమే శరణ్యం / God is Refuge 🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*


*భగవంతుని సృష్టిలో ఆలోచించే శక్తి, విచక్షణా జ్ఞానం, నవ్వగలిగే అదృష్టం మనిషికే ఉన్నాయి. మనిషిగా పుట్టడమే ఒక వరం. కనుమూసి తెరిచేలోగా ముగిసే ఈ అపురూపమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సత్కర్మలతో ఉదాత్తమైన ఆలోచనతో మనుగడ సాగించడం మంచిది. అయితే తనని సృష్టించిన విధాతను విస్మరించి విడనాడి తాను విశ్వవిజేతనని, అంతా తన గొప్పేనని విర్రవీగడం మనిషకి తగదు.*


*విజ్ఞానపరంగా మనిషి ఎంత ఎదిగినా, ఒదిగి ఉంటేనే మంచిది. ఎన్ని మహత్తర విజయాలు సాధించినా మనిషి మర్యుడే! మృత్యువు తప్పదని తెలిసిని ఎగిసిపడుతున్న మనిషి అమరుడైతే ఎలా ఉంటుంది? మనిషి తను చేస్తున్న ప్రతి పని తన ఘనతే అనుకుంటాడు. కానీ భగవంత్సంకల్పం లేనిదే ఏదీ జరగదనే సత్యాన్ని గ్రహించాలి. మానవశక్తి వెనుక ఓ అదృశ్య శక్తి ఉంది. ఆ శక్తే దైవం. ఆ దైవాన్ని స్మరించడం మనిషి కర్తవ్య. అదే ఆయన పట్ల మనం చూపే విశ్వాసం. మనిషి జగత్తునే శాసించగల స్థాయికి ఎదిగాడంటే అది భగవంతుని కరుణాకటాక్షమే గదా!*


*మనిషి జీవితం అశాశ్వతమని, తాను విధి చేతిలో కీలుబొమ్మననే నిజాన్ని మరచి భ్రమలో బతుకుతూ తనకి జన్మనొసగిన దైవాన్ని కాదని ఆ పరాత్పరుని ఉనికినే ప్రశ్నిస్తూ అహంకార దర్పంతో మిడిసిపడటం గర్హనీయం. ఈ జీవితం నీటి బుడగ అని గ్రహించి కర్తవ్యాన్ని నర్విహిస్తూ లభ్యమైన అరుదైన మానవ జన్మను సార్ధకం చేసుకోవడం వివేకవంతుల లక్షణం. అయితే ఈ జన్మలో అంతర్యాన్ని అంతరార్ధాన్ని అవగతం చేసుకున్న వారు జీవితాసారాన్ని అవగాహన చేసుకున్న జ్ఞానులు జన్మరాహిత్యాన్నే కోరుకుంటారు.*

🌹🌹🌹🌹🌹


*🌹 God is Refuge 🌹*

*✍️ Prasad Bharadwaj*


*In God's creation, man has the power to think, discernment and the ability to laugh. Being born as a human being is a blessing. Make the most of this incredible life that ends in the blink of an eye. It is better to survive with good deeds and noble thinking. But it is not proper for a man to ignore the manner in which he was created and boast that he is the conqueror of the universe and that everything is his greatness.*


*Scientifically, no matter how much a man grows up, it is good. No matter how many great achievements, a man is noble! What if a man who is flying knowing that death is inevitable is immortal? A man thinks that everything he does is his own merit. But one must realize the truth that nothing happens without God's will. There is an invisible force behind human power. That power is divine. It is man's duty to remember that God. That is the faith we show in Him. It is God's mercy that man can rise to rule the world!*


*Man's life is impermanent, forgetting the fact that he is a puppet in the hands of fate and living in illusion, questioning the existence of that god who gave birth to him and not the existence of that paratha, it is heartening to blink with the mirror of pride. Realizing that this life is a bubble of water, fulfilling one's duty and making use of the rare human birth available is the characteristic of the wise. But those who have understood the inner meaning of this birth, the wise who have understood the essence of life, seek birthlessness.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 246 / Siva Sutras - 246 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*3వ భాగం - ఆణవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 3-38. త్రిపాదాద్య అనుప్రాణానం ​​- 2 🌻*


*🌴. యోగి స్పృహ యొక్క మూడు స్థితులను (జాగృత, స్వప్న మరియు గాఢనిద్ర) మరియు మూడు కార్యాచరణ స్థితులను (ప్రారంభ, మధ్య మరియు ముగింపు) మొదటిది అయిన తుర్య యొక్క ఆనందం లేదా దాని జ్ఞాపకంతో శక్తివంతం చేస్తూనే ఉంటాడు. 🌴*


*భగవంతునితో శాశ్వతంగా అనుసంధానించబడిన యోగి ఇలాగే కొనసాగుతాడు. ఏది వాస్తవమో, ఏది అసలైనదో వేరుగా గుర్తించగలడు. తన శరీరం నశించి పోతుందని అతనికి బాగా తెలుసు కాబట్టి, అతను తన స్థూల శరీరానికి ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వకూడదని ఎంచుకుంటాడు. మరో వైపు, సత్య వాస్తవం అంటే అత్యున్నత స్థాయి స్పృహ అని కూడా అతనికి తెలుస్తుంది. స్వయంగా ప్రకాశించే భగవంతుని గురించి తప్ప మనస్సుకు ఇతర ఆలోచనలు లేని దశ ఇది. స్వయంగా ప్రకాశించేది పరమాత్మ అని మరియు ఆ తేజస్సు సహాయంతో ప్రకాశించే మిగిలినవన్నీ ఏదో ఒక సమయంలో అంతరించి పోయే అవకాశం ఉందని అతను అర్థం చేసుకుంటాడు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras  - 246 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

*Part 3 - āṇavopāya*

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 3-38. tripadādya anuprānanam - 2 🌻*


*🌴. He also keeps energizing the three states of consciousness (wakeful, dream and deep sleep) and the three states of activity (beginning, middle and end) with the first, the bliss of turya or the memory of it. 🌴*


*This is how a yogi continues to exist, eternally connected to the Lord. He is able to distinguish between what is real and what is not real. He knows well that his body is perishable and therefore, he chooses not to attach any importance to his gross body. On the other hand, he also knows that Reality means the highest level of consciousness. This is the stage where the mind is devoid of any other thoughts except the Self-illuminating Lord. He understands that what is Self-illuminating is the Supreme and all the rest that shines with the aid of that Effulgence are susceptible to extinction at some point of time.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page