🍀🌹 23, JULY 2024 TUESDAY ALL MESSAGES ముంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀
1) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 954 / Vishnu Sahasranama Contemplation - 954 🌹
🌻 954. ఊర్ధ్వగః, ऊर्ध्वगः, Ūrdhvagaḥ 🌻
3) 🌹 సిద్దేశ్వరయానం - 107🌹
🏵 యోగులు - సూక్ష్మశరీరులు -3 🏵
4) 🌹. శివ సూత్రములు - 268 / Siva Sutras - 268 🌹
🌻 3 - 43. నైసర్గికః ప్రాణసంబంధః - 3 / 3 - 43. naisargikah prānasambandhah - 3 🌻
*🌹📽ChaitanyaVijnanam Channel 📽🌹*
*Like, Subscribe and Share 👀*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹📽ChaitanyaVijnanam Channel 📽🌹*
*Like, Subscribe and Share 👀*
*Embark on "The Soul's Journey: Exploring Its Depth and Meaning" and delve into the profound aspects of spiritual growth, self-discovery, and universal connection. This video covers key elements such as discovering purpose and destiny, undergoing evolution and transformation, recognizing unity and interconnectedness, and embracing healing and integration. Learn about the mysteries and faith involved in the soul's journey, the importance of service and contribution, and the continuous growth that defines this lifelong process.*
*Discover practical steps to enhance your spiritual journey through daily practices, seeking wisdom, embracing challenges, connecting with community, and trusting your intuition. Join us in this exploration for a deeper understanding of self-awareness, spiritual evolution, and a fulfilling sense of purpose.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 954 / Vishnu Sahasranama Contemplation - 954 🌹*
*🌻 954. ఊర్ధ్వగః, ऊर्ध्वगः, Ūrdhvagaḥ 🌻*
*ఓం ఉర్ధ్వగాయ నమః | ॐ उर्ध्वगाय नमः | OM Urdhvagāya namaḥ*
*సర్వేషాముపరితిష్ఠన్నూర్థ్వగః ప్రోచ్యతే*
*హరిః అందరికంటెను, అన్నిటికంటెను పైన ఉండువాడు కనుక హరి ఊర్ధ్వగుడు అని చెప్పబడును.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 954 🌹*
*🌻 954. Ūrdhvagaḥ 🌻*
*OM Urdhvagāya namaḥ*
*सर्वेषामुपरितिष्ठन्नूर्थ्वगः प्रोच्यते हरिः / Sarveṣāmuparitiṣṭhannūrthvagaḥ procyate*
*Hariḥ Since Lord Hari is stands high above anyone and anything, He is called Ūrdhvagaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥
Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 107 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 3 🏵*
*ఒకసారి కర్నూలులో మరొకసారి తెనాలిలో బౌద్ధ ధ్యానయోగ సంప్రదాయానికి చెందిన సాధకులు తమ ధ్యాన సమావేశానికి నన్ను ఆహ్వానించి బుద్ధుని ఆవాహన చేయవలసినదిగా నన్నర్థించారు. "ఆప్తులారా ! నామీది గౌరవంతో ఈ సమావేశానికి నన్ను పిలిచారు. మీది నిర్గుణ ధ్యానయోగ పద్ధతి. మంత్ర మార్గం మీద మీకు నమ్మకం లేదు. నేను దేవతలను పిలవడానికి మంత్ర పద్దతిని ఉపయోగిస్తాను. ఉన్న విషయం ఇది. మీ ఇష్టం” అన్నాను. “మీరు ఏమి చేసినాసరే, బుద్ధుని ఆవాహన చేయటం మాకు కావాలి” అన్నారు వారు. "బుద్ధుడు వచ్చినది, లేనిది తెలుసుకోగలవారు మీలో ఎవరైనా ఉన్నారా ?” అన్నాను. 'మేము గుర్తించగలము" అన్నారు. ఇద్దరు ధ్యానయోగులు. రెండు చోట్ల బుద్ధుడు అవతరించాడు. ఒక చోట ఎదురుగా వాయు మండలంలో నిల్చున్నాడు. మరొక చోట నా శరీరంలోకి ప్రవేశించాడు. అక్కడి సాధకులు ఈ విషయాన్ని గుర్తించటం జరిగింది. అయోధ్యలో కూడా అదే విధంగా భద్రకాళి దిగివచ్చి అనుగ్రహాన్ని చూపించింది.*
*కాశీ దగ్గర సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చునార్ కొండలమీది కాళీ ఆలయానికి వెళ్ళాము. కాళీ దర్శనం చేసి, ఇవతల అందరమూ మాట్లాడుతూ ఉండగా వృద్ధుడైన ఒక యోగి అక్కడకు వచ్చిన నా వైపు చూచి ఇలా అన్నాడు. "నేను ఇక్కడకు కొద్ది మైళ్ళదూరంలో ఒక అడవిలో ఉంటూ ముప్పై ఏండ్ల నుంచి తపస్సు చేసుకొంటున్నాను. నిన్న రాత్రి కాళీదేవి నాకు ధ్యానంలో కనిపించి 'దక్షిణాపథం నుండి నా భక్తుడొకడు వస్తున్నాడు. ఆ సిద్ధేశ్వరుని దర్శనం చేసుకో' అని ఆదేశించింది, ఆమె అనుగ్రహం వల్ల మిమ్ము గుర్తుపట్టగలిగాను. అమ్మ దయకు పాత్రులైన మహాత్ములు మీరు” అని ప్రేమ గౌరవములతో తన సాధన గురించి చెప్పాడు. ఎక్కడి గుంటూరు! ఎక్కడి చునార్ కొండలు ! ఎక్కడెక్కడి వ్యక్తులు వీరంతా !*
*ఆ కొండల దగ్గర క్రింద భాగంలో వల్లభాచార్యుడు స్థాపించిన రాధాకృష్ణ మందిరం ఉంది. ఆ మందిరం చూద్దామని నాతో వచ్చిన వారంతా అంటే సరే ! అని వెళ్ళాము. గర్భగుడి తలుపు పూజానంతరం తెరిచినపుడు సింహాసనం మీద అందమైన రాధాకృష్ణ విగ్రహాలను చూచి నమస్కరించి, " విగ్రహాలు చాలా అందంగా ఉన్నవి, శిల్ప నిర్మాణం అద్భుతమైనది" అన్నాను. అక్కడ వారు ఆశ్చర్యంతో “స్వామీజీ! ఇక్కడ విగ్రహాలు ఏమీ లేవు. ఆ సింహాసనమును 'రాధాకృష్ణుల గద్దె' అంటాము. ఇక్కడి సంప్రదాయంలో విగ్రహాలు పెట్టరు. రాధాకృష్ణులు అక్కడ ఉన్నారని భావించి పూజ చేస్తాము. మీకు విగ్రహాలు ఎలా కనిపించినవో మాకు అర్థం కావటం లేదు" అన్నారు. ఇవతలకు వచ్చిన వాణ్ణి మళ్ళీ వెళ్ళి చూశాను. నిజమే ! అక్కడ విగ్రహాలు ఏమీ లేవు. కానీ ఇంతకు ముందు నాకు కనిపించటం కూడా నిజమే. అది రాధాకృష్ణుల దయ.*
*కాశీలో కీనారామ్ అఘోరీ ఆశ్రమం ఉన్నది. షాజహాన్, ఔరంగజేబుల కాలంలో జీవించిన కాళీసిద్ధుడు అతడు. బెలూచిస్థాన్ లోని హింగుళాకాళీని శ్మశాన సాధనలతో ఆరాధించి సిద్ధుడై ఆమెను కాశీకి తీసుకు వచ్చాడు. పుర్రెల తోరణాల మాలతో ఉన్న ముఖద్వారం ఇప్పుడు కూడా అందరికి స్వాగతం చెపుతుంది. ఆనాడు అతడు 170 సంవత్సరాలు జీవించి సజీవసమాధిలోకి ప్రవేశించాడు. మణికర్ణికా ఘట్టం నుండి శ్మశాన అగ్నిని తెచ్చి అతడు వెలిగించిన హోమకుండం ఇప్పటికీ ఆరకుండా కొనసాగుతూనే ఉంది. ఆ ఆశ్రమంలో ప్రవేశించినపుడు పురా స్మృతులెన్నో మనసులో మెదిలినవి. అతని సంప్రదాయంలో సాధన చేసిన ఒక యోగి తన సాధన పరిపూర్ణత కోసం నూట యాభై సంవత్సరాల క్రింద కాశీలో నా దగ్గరకు వచ్చి నా శిష్యుడైనాడు.ఈనాడు అతడు జన్మమారి గుంటూరు హిందూకాలేజీలో లెక్చరర్గా ఉంటూ మళ్ళీ నా శిష్యుడై తీవ్రసాధన చేస్తున్నాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 268 / Siva Sutras - 268 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 3 - 43. నైసర్గికః ప్రాణసంబంధః - 3 🌻*
*🌴. స్వీయ-సాక్షాత్కార స్థితిలో, జీవ పరిమితుల నుండి విముక్తి పొందినప్పటికీ, నాడుల యొక్క ప్రకాశం కారణంగా ప్రాణంతో సంబంధం సహజంగా మరియు సున్నితంగా ప్రవహిస్తుంది.🌴*
*ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు కూడా, యోగి పరమాత్మ చైతన్యానికి అనుసంధానమై ఉంటాడు. అటువంటి యంత్రాంగాలు శివుని యొక్క సంపూర్ణ స్వయంప్రతిపత్తి యొక్క శక్తి కేంద్రమైన శక్తిచే నియంత్రించ బడతాయి. ప్రాణం యొక్క స్వయంచాలక ప్రవాహం కొనసాగుతున్నంత కాలం యోగి తన భౌతిక శరీరంలో ఉనికిలో ఉంటాడు. తన శరీరానికి మరియు ప్రాణానికి మధ్య సంబంధం ఉన్నంత వరకు, తన శరీరాన్ని పరిపూర్ణ స్థితిలో ఉంచుకోవడం యోగి యొక్క విధి. అతని శరీరానికి ప్రాణం ఆగిపోవడం ముందుగా నిర్ణయించిన సమయంలోనే జరుగుతుంది. ఆ తదుపరి అతని ఆత్మ శాశ్వతత్వంలో కరిగిపోతుంది, మళ్లీ పుట్టదు. ఎల్లవేళలా భగవంతునితో అనుసంధానమై నిలబడాలనే సందేశం ఈ సూత్రం ద్వారా అందించబడిన సందేశం. ఇక్కడ అన్ని సమయాలలో అనేది ప్రపంచ ప్రాణశక్తి అనే పదం ద్వారా సూచించబడుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 268 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 3 - 43. naisargikah prānasambandhah - 3 🌻*
*🌴. In the self-realized state, although freed from the limitations of jiva, the connection with prana remains natural, smooth and flowing due to the illumination of nadis. 🌴*
*Even while breathing, the yogi stands connected to the Supreme consciousness. Such mechanisms are controlled by Śaktī, the power centre of the absolute autonomy of the Lord Śiva. The yogi continues to exist in his physical body as long as automated flow of prāṇa continues. Till the connection between his body and prāṇa exist, it is the duty of the yogi to keep his body in a perfect condition. The stoppage of prāṇa to his body happens at the predetermined time and his soul dissolves into the eternity, not to be born again. The message that one should stand connected to the Lord at all times, is the message conveyed through this aphorism. At all times is indicated by the world prāṇa.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
Comments