top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 23, NOVEMBER 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 23, NOVEMBER 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 23, NOVEMBER 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 461 / Bhagavad-Gita - 461 🌹

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 47 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 47 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 817 / Sri Siva Maha Purana - 817 🌹

🌻. దేవతలు శివుని స్తుతించుట - 3 / Prayer by the gods - 3 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 74 / Osho Daily Meditations  - 74 🌹

🍀 74. అంతర్దృష్టి / 74. INSIGHT 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 503 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 503 - 3 🌹

🌻 503. 'లాకిన్యంబా స్వరూపిణి' - 3 / 503.  lakinyanba svarupini - 3 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 23, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రభోధన (దేవత్థాన) ఏకాదశి, Prabhodhana (Devutthana) Ekadashi.🌻*


*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 30 🍀*


*59. ప్రహసన్ప్రవదన్దత్తో దివ్యమంగలవిగ్రహః |*

*మాయాబాలశ్చ మాయావీ పూర్ణలీలో మునీశ్వరః*

*60. మాహురేశో విశుద్ధాత్మా యశస్వీ కీర్తిమాన్ యువా |*

*సవికల్పః సచ్చిదాభో గుణవాన్ సౌమ్యభావనః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : శాంతి సమతల పరీక్ష - పరిస్థితులు నీ కెంత అననుకూలంగా వున్నా, ఇతరుల నడవడి నీ కెంత సరిపడక పోయినా కలత చెందకుండా సంపూర్ణ శాంత భావంతో వాటి నెదుర్కొనడం నీవు నేర్చుకోవాలి. నీ సమతకు యివి పరీక్షలు. అన్నీ అనుకూలంగా వున్నప్పుడు శాంతి సమతలు కలిగి వుండడం సులభమే. కాని, శాంతి సమతలు పరీక్షలకు నిలిచి, బలపడి, సర్వసమగ్రం కావాలంటే, అది ప్రతికూల పరిస్థితులందే సాధ్యం. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్‌ ఋతువు, దక్షిణాయణం,

కార్తీక మాసం

తిథి: శుక్ల-ఏకాదశి 21:03:21 వరకు

తదుపరి శుక్ల ద్వాదశి

నక్షత్రం: ఉత్తరాభద్రపద 17:16:47

వరకు తదుపరి రేవతి

యోగం: వజ్ర 11:53:27 వరకు

తదుపరి సిధ్ధి

కరణం: వణిజ 10:03:19 వరకు

వర్జ్యం: 03:41:12 - 05:11:44

దుర్ముహూర్తం: 10:09:48 - 10:54:46

మరియు 14:39:36 - 15:24:34

రాహు కాలం: 13:26:32 - 14:50:51

గుళిక కాలం: 09:13:35 - 10:37:54

యమ గండం: 06:24:58 - 07:49:16

అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24

అమృత కాలం: 12:44:24 - 14:14:56

సూర్యోదయం: 06:24:58

సూర్యాస్తమయం: 17:39:28

చంద్రోదయం: 14:41:42

చంద్రాస్తమయం: 02:18:33

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: మీనం

యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం

17:16:47 వరకు తదుపరి మిత్ర

యోగం - మిత్ర లాభం

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 461 / Bhagavad-Gita - 461 🌹*

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 47 🌴*


*47. శ్రీ భగవానువాచ*

*మయా ప్రసన్నేన తవార్జుననేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ |*

*తేజోమయం విశ్వమనన్తమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ ||*


*🌷. తాత్పర్యం : శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! ప్రసన్నుడైన నేను నా అంతరంగ శక్తిచే భౌతిక జగము నందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపితిని. తేజోమయమును, అనంతమును, ఆద్యమును అగు ఈ రూపమును నీకు ముందెవ్వరును గాంచి యుండలేదు.*


*🌷. భాష్యము : అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపమును గాంచగోరెను. తన భక్తుడైన అర్జునుని యెడ కరుణను కలిగిన అ భగవానుడు అంతట తేజోమయమును, విభూతిపూర్ణమును అగు తన విశ్వరూపమును అతనికి చూపెను. సూర్యుని వలె ప్రకాశించుచున్న ఆ రూపము యొక్క పలుముఖములు త్వరితముగా మార్పుచెందుచుండెను. మిత్రుడైన అర్జునుని కోరికను పూర్ణము చేయుట కొరకే శ్రీకృష్ణుడు ఆ రూపమును చూపెను. తన అంతరంగశక్తి ద్వారా శ్రీకృష్ణుడు ప్రదర్శించిన ఆ విశ్వరూపము మానవ ఊహకు అతీతమైనది. అర్జునునికి పూర్వమెవ్వరును భగవానుని ఆ రూపమును గాంచియుండలేదు. కాని భక్తుడైన అర్జునునకు అది శ్రీకృష్ణునిచే చూపబడినందున ఊర్థ్వలోకులు మరియు ఆధ్యాత్మికలోకములందు గల ఇతర భక్తులు సైతము దానిని దర్శించగలిగిరి. వారు దానిని పూర్వమెన్నడును గాంచకున్నను అర్జునుని కారణమున ఇప్పుడు గాంచగలిగిరి. అనగా పరంపరానుగత భక్తులందరును కృష్ణుని కరుణచే అర్జునుడు గాంచిన విశ్వరూపమును తామును గాంచగలిగిరి.*


*దుర్యోధనునితో సంధిరాయబారము జరుపుటకు వెడలినప్పుడును శ్రీకృష్ణుడు ఈ విశ్వరూపమును అతనికి సైతము చూపెనని కొందరు వ్యాఖ్యానించిరి. దురదృష్టవశాత్తు దుర్యోధనుడు ఆ సంధి రాయబారమును అంగీకరించలేదు. ఆ సమయనున శ్రీకృష్ణుడు ఈ విశ్వరూపమును అతనికి సైతము చూపెనని కొందరు వ్యాఖ్యానించిరి. దురదృష్టవశాత్తు దుర్యోధనుడు ఆ సంధి రాయబారమును ఆంగీకరించలేదు. ఆ సమయమున శ్రీకృష్ణుడు విశ్వరూపములో కొన్ని రూపములానే ప్రదర్శించెను. కాని ఆ రూపములు అర్జునునకు చూపిన ఈ రూపము కన్నును భిన్నమైనవి. కనుకనే ఈ రూపమును పూర్వమెవ్వరును చూడలేదని స్పష్టముగా తెలుపబడినది.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 461 🌹*

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 47 🌴*


*47. śrī-bhagavān uvāca*

*mayā prasannena tavārjunedaṁ rūpaṁ paraṁ darśitam ātma-yogāt*

*tejo-mayaṁ viśvam anantam ādyaṁ yan me tvad anyena na dṛṣṭa-pūrvam*


*🌷 Translation : The Supreme Personality of Godhead said: My dear Arjuna, happily have I shown you, by My internal potency, this supreme universal form within the material world. No one before you has ever seen this primal form, unlimited and full of glaring effulgence.*


*🌹 Purport : Arjuna wanted to see the universal form of the Supreme Lord, so Lord Kṛṣṇa, out of His mercy upon His devotee Arjuna, showed His universal form, full of effulgence and opulence. This form was glaring like the sun, and its many faces were rapidly changing. Kṛṣṇa showed this form just to satisfy the desire of His friend Arjuna. This form was manifested by Kṛṣṇa through His internal potency, which is inconceivable by human speculation. No one had seen this universal form of the Lord before Arjuna, but because the form was shown to Arjuna, other devotees in the heavenly planets and in other planets in outer space could also see it. They had not seen it before, but because of Arjuna they were also able to see it.*


*In other words, all the disciplic devotees of the Lord could see the universal form which was shown to Arjuna by the mercy of Kṛṣṇa. Someone has commented that this form was shown to Duryodhana also when Kṛṣṇa went to Duryodhana to negotiate for peace. Unfortunately, Duryodhana did not accept the peace offer, but at that time Kṛṣṇa manifested some of His universal forms. But those forms are different from this one shown to Arjuna. It is clearly said that no one had ever seen this form before.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 817 / Sri Siva Maha Purana - 817 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 25 🌴*


*🌻. దేవతలు శివుని స్తుతించుట - 3 🌻*


*ఓ మహాప్రభూ! నీ భక్తియందు స్థిరముగా నున్న శుచివ్రతుడను బ్రాహ్మణునకు ఆతని తల్లితో సహా దయతో జ్ఞానమునిచ్చి ఆతని దారిద్ర్యమును తొలగించితివి (16). చిత్రవర్మమహారాజు నీయందలి భక్తిచే ఇహలోకములో సర్వదా దేవతలకు కూడ లభింప శక్యము కాని భోగముల ననుభవించి సద్గతిని పొందెను (17). చంద్రాంగదుడనే రాజకుమారుడు తన భార్యయగు సీమంతినితో గూడి సకలదుఃఖములనుండి విముక్తుడై సుఖములను, ఉత్తమ గతిని పొందెను (18)*


*ఓ శివా! వేశ్యతో తిరుగువాడు, దుష్టుడు, అధముడు అగు మందరుడనే బ్రాహ్మణుడు కూడ నీ భక్తుడై నిన్ను చక్కగా పూజించి ఆమెతో సహా సద్గతిని పొందినాడు (19). భద్రాయుడనే రాజకుమారుడు నీ భక్తుని దయచే, మరియు నీదయచే దుఃఖవినిర్ముక్తుడై తల్లితో గూడి సుఖములను పొంది పరమపదమును చేరినాడు. హే ప్రభూ! (20).*


*మహేశ్వరా! స్త్రీలందరితో భోగమునందాసక్తి గలవాడు, సర్వదా తినకూడని పదార్థములను తినువాడు నగు దుష్టుడు కూడ నిన్ను సేవించి మోక్షమును పొందెను (21). ఓ శంభూ! శంకర భక్తుడు, సర్వదా విభూతిని దాల్చువాడు నగు శంబరుడు విభూతి ధారణ నియమమువలన తన భార్యతో గూడి నీ పురమును చేరినాడు (22).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 817 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 25 🌴*


*🌻 Prayer by the gods - 3 🌻*


16. O great lord, mercifully you made the brahmin Śucivrata strictly adhering to devotion to you gain knowledge along with his mother and made him rich too.


17. By his devotion to you the excellent king Citravarman perpetually enjoyed in this world the pleasures inaccessible even to the gods and attained salvation, the goal of the good.


18. The prince Candrāṅgada along with his wife Sīmantinī got rid of all miseries, enjoyed happiness and attained great goal.


19. The brahmin named Mandara who became a base knave indulging in lecherous association with prostitutes, O Śiva, worshipped one of your women devotees and attained salvation along with her.


20. O lord, thanks to the favour of a devotee of yours, the prince Bhadrāyu attained happiness free from pain and achieved great goal along with his mother.


21. O lord Śiva, even wicked sinners eating forbidden foodstuffs and indulging in sexual dalliance with all sorts of women, have been liberated by their service to you.


22. O Śiva, Śambara a devotee of yours, smearing himself with the ashes of the funeral pyre, attained your region along with his wife, thanks to his regular adherence to Bhasma.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 74 / Osho Daily Meditations  - 74 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 74. అంతర్దృష్టి 🍀*


*🕉. ప్రతి అంతర్దృష్టి, అది అంగీకరించడానికి చాలా కష్టంగా ఉన్నప్పటికీ, సహాయపడుతుంది. ఇది, విషయాలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ సహాయపడుతుంది. ఇది అహాన్ని విచ్ఛిన్నం చేసినప్పటికీ సహాయపడుతుంది. అంతర్దృష్టి మాత్రమే నిజమైన స్నేహితుడు. 🕉*


*ఏ విధంగానైనా హేతుబద్ధం చేయకుండా, ఏ వాస్తవాన్ని అయినా ఉన్నది ఉన్నట్లుగా చూడటానికి సిద్ధంగా ఉండాలి. ఈ అంతర్దృష్టి నుండి, చాలా విషయాలు జరుగుతాయి. కానీ మీరు ఈ విషయంలో ఈ మొట్టమొదటి అంతర్దృష్టిని కోల్పోయినట్లయితే, మీరు అయోమయం మరియు గందరగోళానికి గురవుతారు. చాలా సమస్యలు కనిపిస్తాయి కానీ పరిష్కారం కనపడదు, ఎందుకంటే మొదటి అడుగు నుండి ఒక సత్యం అంగీకరించ బడలేదు. కాబట్టి మీరు మీ స్వంత జీవిని మోసం చేసుకుంటున్నారు.*


*సమస్యలు ఉన్నవారు చాలా మంది ఉన్నారు, కానీ ఆ సమస్యలు నిజమైనవి కావు. తొంభై తొమ్మిది శాతం సమస్యలు అబద్ధాలే. కాబట్టి అవి పరిష్కరించ బడకపోతే, మీరు ఇబ్బందుల్లో పడతారు, కానీ అవి పరిష్కరించబడినా, ఏమీ జరగదు, ఎందుకంటే అవి మీ నిజమైన సమస్యలు కాదు. మీరు కొన్ని అసత్య సమస్యలను పరిష్కరించినప్పుడు, మీరు వేరే సమస్యలను సృష్టిస్తారు. కాబట్టి మొదటి విషయం ఏమిటంటే అసలు సమస్య ఏమిటో దానిలోకి చొచ్చుకుపోయి దానిని అలాగే ఉన్నది ఉన్నట్లుగా చూడటం. అసత్యాన్ని అసత్యంగా చూడటమే సత్యాన్ని సత్యంగా చూడగలగడానికి ప్రారంభం.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 74 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 74. INSIGHT 🍀*


*🕉 Every insight, even if it is very hard to accept, helps. Even if it goes against the grain, it helps. Even if it is very ego shattering, it helps. Insight is the only friend. 🕉*


*One should be ready to see into any fact, without rationalizing in any way. Out of this insight, many things happen. But if you have missed the first insight into the matter, you will be puzzled and confused. Many problems will be there, but there will be no solution in sight, because from the very first step a truth has not been accepted. So you are falsifying your own being.*


*There are many people who have so many problems, but those problems are not real. Ninety-nine percent of problems are false. So if they are not solved, you are in trouble, and even if they are solved, nothing will happen, because they are not your real problems. When you have solved some false problems, you will create others. So the first thing is to penetrate into what is the real problem and to see it as it is. To see the false as false is the beginning of being able to see truth as truth.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 503- 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 503 - 3 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  103. రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా ।*

*సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥ 🍀*


*🌻 503. 'లాకిన్యంబా స్వరూపిణి' - 3 🌻*


*మహాత్ములకు దేహమున వసించుట బురదలో వసించుట వంటిది. వారందుండుటకు సందేహింపరు. కారణము వారికి లాకిణి అనుగ్రహ ముండుటయే. దైవభక్తులు ఎచ్చట నున్ననూ దైవము యందే యుందురు గనుక, వారికి దేహాభిమాన ముండదు గనుక దేహ సౌఖ్యమునకై ప్రాకులాడరు. సిద్ధులు, అవధూతలు మట్టిలో అన్నము వడ్డించిననూ భుజింతురు. శ్రీ రామ కృష్ణులు మురుగునీటిని అవపోసన పట్టుట, తాను వూరకుక్క కలిసి రొట్టెలు తినుటకు అమ్మ అనుగ్రహమే కారణము. అట్టి కోవలోని వారందరూ మాయను దాటినవారు. “లం” అను శబ్దము పృధివీ తత్త్వమును సంకేతించును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 503 - 3 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻103. Rakta-varna mansanishta gudanna pritamanasa*

*samsta bhakta sukhada lakinyanba svarupini ॥ 103 ॥ 🌻*


*🌻 503.  lakinyanba svarupini - 3 🌻*


*For Mahatmas, living in the body is like living in mud. They don't hesitate to be there. The reason is that they have the grace of Lakini on them. Since God's devotees are always in God, they have no love of the flesh and do not strive for the comfort of the body. Siddhas and Avadhutas eat even the rice served in mud. Mother's grace was the reason why Sri Rama Krishna used to drink sewage water as avaposana and ate bread with the street dogs. All those in that path are beyond Maya. The word 'lam' signifies the earth principle.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page