🍀🌹 24, FEBRUARY 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹 24, FEBRUARY 2024 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 506 / Bhagavad-Gita - 506 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 17 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 17 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 861 / Sri Siva Maha Purana - 861 🌹
🌻. శంఖచూడుని యుద్ధయాత్ర - 1 / The March of Śaṅkhacūḍa - 1 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 119 / Osho Daily Meditations - 119 🌹
🍀 119. కుంచించుకు పోయిన హృదయం / 119. SHRUNKEN HEART 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 537-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 537-1 🌹
🌻 537. 'అమతి' - 1 / 537. 'Amati' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 24, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాఘ పూర్ణిమ, మహా మాఘి, పూర్ణిమ ఉపవాసం, Magha Purnima, Maha Maghi, Purnima Upavas, 🌻*
*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 60 🍀*
*60. కాలనేమిఖలద్వేషీ ముచుకుందవరప్రదః |*
*సాల్వసేవితదుర్ధర్షరాజస్మయనివారణః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సగుణ నిర్గుణ భేదపు సత్యత్వ అసత్యత్వాలు : సగుణ నిర్గుణ భేధము అధిమనోభూమిక యందలి సత్యము. విజ్ఞాన భూమిక యందు ఈ భేదమునకు సత్యత్వం, లేదు. అచట అవి రెండునూ అవిభాజ్యంగా ఏకమై వున్నవి. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: పూర్ణిమ 18:01:24 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: మఘ 22:21:24
వరకు తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: అతిగంధ్ 13:34:39
వరకు తదుపరి సుకర్మ
కరణం: బవ 18:01:24 వరకు
అశుభఘడియలు
వర్జ్యం: 08:53:30 - 10:41:10
దుర్ముహూర్తం: 08:11:45 - 08:58:36
రాహు కాలం: 09:33:44 - 11:01:35
గుళిక కాలం: 06:38:02 - 08:05:53
యమ గండం: 13:57:16 - 15:25:07
శుభ సమయం :
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 19:39:30 - 21:27:10
సూర్య చంద్ర కాలాలు :
సూర్యోదయం: 06:38:02
సూర్యాస్తమయం: 18:20:48
చంద్రోదయం: 18:19:09
చంద్రాస్తమయం: 06:34:04
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య
ప్రాప్తి 22:21:24 వరకు తదుపరి
లంబ యోగం - చికాకులు, అపశకునం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 506 / Bhagavad-Gita - 506 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 17 🌴*
*17. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ |*
*భూతభర్తృ చ తత్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ||*
*🌷. తాత్పర్యం : పరమాత్ముడు జీవుల యందు విభజింపబడినట్లు కనిపించినను అతడెన్నడును విభజింపబడక ఏకమై నిలిచియుండును. సర్వ జీవులను పోషించు వాడైనను, సర్వులను కబళించునది మరియు వృద్ధి నొందించునది అతడే యని అవగాహనము చేసికొనవలెను.*
*🌷. భాష్యము : శ్రీకృష్ణభగవానుడు ప్రతివారి హృదయమునందు పరమాత్మ రూపమున వసించియున్నాడు. దీని భావము అతడు విభజింపబడినాడనియా? అట్లెన్నడును కాబోదు. వాస్తవమునకు అతడు సదా ఏకమై యుండును. దీనికి సూర్యుని ఉపమానమును ఒసగవచ్చును. మధ్యాహ్న సమయమున సూర్యుడు తన స్థానమున నిలిచి నడినెత్తిమీద నిలిచియున్నట్లు తోచును. మనుజుడు ఒక ఐదువేల మైళ్ళు ఏ దిక్కునందైనను ప్రయాణించి పిదప సూర్యుడెక్కడున్నాడని ప్రశ్నించినచో తిరిగి ఆ సమయమున తన శిరముపైననే ఉన్నాడనెడి సమాధానమును పొందగలడు.*
*శ్రీకృష్ణభగవానుడు అవిభక్తుడైనను విభక్తుడైనట్లుగా కన్పించుచున్న ఈ విషయమును తెలుపుటకే వేదవాజ్మయమునందు ఈ ఉదాహరణము ఒసగబడినది. సూర్యుడు ఒక్కడేయైనను బహుప్రదేశములలో జనులకు ఏకకాలమున గోచరించురీతి, విష్ణువొక్కడేయైనను తన సర్వశక్తిమత్వముచే సర్వత్రా వసించియున్నాడనియు వేదవాజ్మయము నందు తెలుపబడినది. ఆ భగవానుడే సర్వజీవుల పోషకుడైనను ప్రళయ సమయమున సమస్తమును కబళించివేయును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 506 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 17 🌴*
*17. avibhaktaṁ ca bhūteṣu vibhaktam iva ca sthitam*
*bhūta-bhartṛ ca taj jñeyaṁ grasiṣṇu prabhaviṣṇu ca*
*🌷 Translation : Although the Supersoul appears to be divided among all beings, He is never divided. He is situated as one. Although He is the maintainer of every living entity, it is to be understood that He devours and develops all.*
*🌹 Purport : The Lord is situated in everyone’s heart as the Supersoul. Does this mean that He has become divided? No. Actually, He is one. The example is given of the sun: The sun, at the meridian, is situated in its place.*
*But if one goes for five thousand miles in all directions and asks, “Where is the sun?” everyone will say that it is shining on his head. In the Vedic literature this example is given to show that although He is undivided, He is situated as if divided. Also it is said in Vedic literature that one Viṣṇu is present everywhere by His omnipotence, just as the sun appears in many places to many persons. And the Supreme Lord, although the maintainer of every living entity, devours everything at the time of annihilation.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 861 / Sri Siva Maha Purana - 861 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 34 🌴*
*🌻. శంఖచూడుని యుద్ధయాత్ర - 1 🌻*
*వ్యాసుడిట్లు పలికెను - ఓ బ్రహ్మపుత్రా! నీవు మహాబుద్ధిశాలివి. ఓ మునీ ! చిరకాలము జీవించుము. చిత్రమైనది, చాల గొప్పదియగు చంద్రశేఖరుని చరితమును చెప్పితివి (1). శివుని దూత మరలి పోగానే ప్రతాపవంతుడగు శంఖచూడాసురుడు ఏమి చేసినాడు? నీవా గాథను విస్తారముగా చెప్పుము (2).*
సనత్కుమారుడిట్లు పలికెను - దూత* నిర్గమించిన తరువాత ప్రతాపవంతుడగు శంఖచూడుడు సభ నుండి అంతఃపురము లోపలికి వెళ్లి ఆ వార్తను తులసికి చెప్పెను (3).*
*శంఖచూడుడిట్లు పలికెను - ఓ దేవీ! శంభుని దూత పలికిన పలుకులు నన్ను యుద్ధమునకు ప్రేరపించినవి. కావున నేను యుద్ధము కొరకు వెళ్లుచున్నాను. నీవు నా ఆజ్ఞను నిశ్చయముగా పాలించుము (4). జ్ఞానియగు ఆ శంఖచూడుడు ప్రియురాలితో నిట్లు పలికి ఆ శంకరుని అనాదరము చేసి ఆమెకు ఆనందముతో అనేకవిషయములను బోధిస్తూ ఆమెతో గూడి క్రీడించెను (5). ఆ దంపతులు రాత్రియందు సుఖసముద్రములో తేలియాడుతూ అనేక నర్మోక్తులను పలుకుతూ ఆనందముగా గడిపిరి (6). ఆతడు బ్రాహ్మ ముహూర్తమునందు నిద్ర లేచి, కాలకృత్యములను దీర్చుకొని ప్రాతఃకాల కర్మలననుష్ఠించి ముందుగా అంతులేని దానములను చేసెను (7). ఆతడు తన పుత్రిని సర్వదానవులకు చక్రవర్తిని చేసి రాజ్యమును, సర్వసంపదలను మరియు భార్యను ఆతనికి అప్పజెప్పను (8). ఆ రాజు తన యాత్రను ప్రతిఘటిస్తూ ఏడ్చుచున్న ప్రియురాలికి మరల అనేక వచనములను బోధించి ఓదార్చెను (9). అపుడాతడతు వీరుడగు తన సేనాపతిని పిలిపించెను. సాదరముగా నిలబడిన సేనానాయకుని సైన్యసన్నాహమును చేయుమని ఆదేశించి తాను స్వయముగా సంగ్రామమునకు సన్నద్ధుడాయెను (10).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 861 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 34 🌴*
*🌻 The March of Śaṅkhacūḍa - 1 🌻*
Vyāsa said:—
1. O dear son of Brahmā, O sage of great intellect, live long for many years. You have narrated the great story of the mooncrested lord.
2. When Śiva’s emissary had departed, what did the valorous Dānava, Śaṅkhacūḍa do? Please mention that in detail.
Sanatkumāra said:—
3. When the messenger returned, the valorous Śaṅkhacūḍa went in and told his wife Tulasī all the details.
Śaṅkhacūḍa said:—
4. O dear lady, infuriated by the words of Śiva’s messenger I have prepared for a war. Hence I am going to fight. You carry out my directions.
Sanatkumāra said:—
5. After saying this and slighting Śiva, that demon professing to be wise advised his wife in various ways and sported with her with delight.
6. Throughout that night, the couple indulged in sexual dalliance. Uttering coaxing and cajoling words, practising various erotic arts, they immersed themselves in the ocean of happiness.
7. He got up in the Brāhma Muhūrta,[1] and finished his daily routine in the morning. He then performed the offering of charitable gifts.
8-9. He crowned his son as the lord of Dānavas. He entrusted his wife, his kingdom and his riches to the care of his son. When his wife cried and dissuaded him from going to the war he consoled her by various words of appeasement.
10. He called his general and ordered him to be ready for the war.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 119 / Osho Daily Meditations - 119 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 119. కుంచించుకు పోయిన హృదయం 🍀*
*🕉 మీరు ఒక సందేహాన్ని అనుమతించినప్పుడల్లా, మీరు హృదయంలో ఉద్విగ్నత చెందుతారు -- ఎందుకంటే హృదయం నమ్మకంతో శాoతిస్తుంది మరియు సందేహంతో కుంచించుకు పోతుంది. 🕉*
*సాధారణంగా ప్రజలకు ఈ ప్రక్రియ గురించి తెలియదు. నిజానికి, వారు నిరంతరం గుండె వద్ద కుంచించుకు పోయి,విశ్రాంతిగా ఉండటం వారు మర్చిపోయారు. మరో విధానం తెలియక, అంతా బాగానే ఉందని వారు అనుకుంటారు, కానీ వంద మందిలో తొంభైతొమ్మిది కుంచించుకుపోయిన హృదయంతో జీవిస్తున్నారు. మీరు తలలో ఎంత ఎక్కువగా ఉంటే, గుండె మరింత సంకోచిస్తుంది. మీరు తలలో లేనప్పుడు, హృదయం తామర పువ్వులా తెరుచుకుంటుంది ... మరియు అది వికసిస్తే చాలా అందంగా ఉంటుంది.*
*అప్పుడు మీరు నిజంగా సజీవంగా ఉన్నారు, మరియు మీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది. కానీ హృదయం నమ్మకంలో, ప్రేమలో మాత్రమే ప్రశాంతంగా ఉంటుంది. అనుమానంతో, సందేహంతో, మనస్సు ప్రవేశిస్తుంది. సందేహం మనస్సు యొక్క ద్వారం; సందేహం మనస్సుకు ఎర. ఒకసారి మీరు సందేహంలో చిక్కుకుంటే, మీరు మనస్సుతో చిక్కుకుంటారు. కాబట్టి సందేహం వచ్చినప్పుడు, అది అంత విలువైనది కాదు. మీ సందేహం ఎప్పుడూ తప్పని నేను అనడం లేదు. మీ సందేహం ఖచ్చితంగా సరైనదే కావచ్చు, కానీ అది కూడా తప్పు, ఎందుకంటే అది మీ హృదయాన్ని నాశనం చేస్తుంది. ఇది అంత విలువైనది కాదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 119 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 119. SHRUNKEN HEART 🍀*
*🕉 Whenever you allow any doubt, you will become tense in the heart -- because the heart relaxes with trust and shrinks with doubt. 🕉*
*Ordinarily people are not aware of this dynamic. In fact, they continuously remain shrunken and contracted at the heart, so they have forgotten how it feels to be relaxed there. Knowing no opposite, they think that everything is okay, but out of one hundred people, ninetynine live with a contracted heart. The more you are in the head, the more the heart contracts. When you are not in the head, the heart opens like a lotus flower ... and it is tremendously beautiful when it opens.*
*Then you are really alive, and the heart is relaxed. But the heart can only be relaxed in trust, in love. With suspicion, with doubt, the mind enters. Doubt is the door of the mind; doubt is the bait for the mind. Once you are caught in doubt, you are caught with the mind. So when doubt comes, it is not worth it. I'm not saying that your doubt is always wrong. Your doubt may be perfectly right, but then too it is wrong, because it destroys your heart. It is not worth it.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 537 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 537 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*
*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*
*🌻 537. 'అమతి' - 1 🌻*
*మతి లేనిది శ్రీమాత అని అర్థము. మతికి అతీతమైనది శ్రీమాత అని విశేష అర్థము. శ్రీమాత నుండియే మతి పుట్టును. సృష్టి యందు మతి పుట్టుటకు ముందు చాల సృష్టి కథ జరిగినది. ఎన్నియో ధర్మములు, తత్త్వములు, శబ్దములు, రంగులు, అంకెలు మతికన్న ముందు పుట్టినవి. కాలము, ఛందస్సు యివి అన్నియూ కూడ మతికి ముందున్నవే. ఇవి అన్నియూ శ్రీమాత నుండి ఉద్భవించినవి. వీటి అల్లిక నుండి అహంకారము, బుద్ధి, మనస్సు యిత్యాదివి పుట్టినవి. కావున శ్రీమాత ప్రాథమికముగ అమతియే! మనస్సునకు ఆవలి తత్త్వమంతయూ శ్రీమాతచే పరిపాలింప బడుచున్నది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 537 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*
*svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻*
*🌻 537. 'Amati' - 1 🌻*
*It means Srimata has no mind. The special meaning is that Srimata is beyond the mind. Mind is born from Srimata. There was a long saga before mind was born in the creation. Many dharmas, philosophies, sounds, colors and numbers were born before mind. Time and rhythm were all existent before the mind. All these were born from Srimata. Ego, intellect, mind, etc. were born from the interweaving of these. So Srimata is primarily Amati or one without mind! All the philosophy beyond the mind is ruled by Sri Mata.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
コメント