top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 25, DECEMBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 25, DECEMBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 25, DECEMBER 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 477 / Bhagavad-Gita - 477 🌹

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -08 / Chapter 12 - Devotional Service - 08 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 833 / Sri Siva Maha Purana - 833 🌹

🌻. శంఖచూడుని వివాహము - 3 / The penance and marriage of Śaṅkhacūḍa - 3 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 90 / Osho Daily Meditations  - 90 🌹

🍀 90. మరణ భయం / 90. FEAR OF DEATH 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 517 - 519 / Sri Lalitha Chaitanya Vijnanam - 517 - 519 🌹

🌻 517. 'అంకుశాది ప్రహరణా' , 518. 'వరదాది నిషేవితా', 519. 'ముద్దేదనాసత్తచిత్తా / 517. 'Ankushadi Praharana', 518. 'Varadadi Nishevita', 519. 'Muddedanasattachitta' 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 25, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : రోహిణి వ్రతం, Rohini Vrat 🌻*


*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 57 🍀*


*117. దేవాసురేశ్వరో విశ్వో దేవాసుర మహేశ్వరః |*

*సర్వదేవ మయోఽచింత్యో దేవతాత్మా ఆత్మ సంభవః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : సచ్చిదానందం - సచ్చిదానంద మనునది వస్తుతః ఒక్కటే. పరబ్రహ్మము నందు ఈ మూడును మూడు కావు, ఒకటే వస్తువు. సత్తే (ఉనికి) చిత్తు (తెలివి), చిత్తే ఆనందము. వాటిని విడదీయుటకు వీలు లేదు. విడదీయ రానంతగా ఆన్యోన్యంగా ఆవి ఏకమై వున్నవి.🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

మార్గశిర మాసము

తిథి: శుక్ల చతుర్దశి 29:48:38

వరకు తదుపరి పూర్ణిమ

నక్షత్రం: రోహిణి 21:40:34 వరకు

తదుపరి మృగశిర

యోగం: శుభ 28:22:47 వరకు

తదుపరి శుక్ల

కరణం: గార 17:51:20 వరకు

వర్జ్యం: 13:33:20 - 15:10:40

మరియు 27:25:48 - 29:04:36

దుర్ముహూర్తం: 12:38:02 - 13:22:25

మరియు 14:51:11 - 15:35:34

రాహు కాలం: 08:06:12 - 09:29:25

గుళిక కాలం: 13:39:04 - 15:02:17

యమ గండం: 10:52:38 - 12:15:51

అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:37

అమృత కాలం: 18:25:20 - 20:02:40

సూర్యోదయం: 06:43:04

సూర్యాస్తమయం: 17:48:43

చంద్రోదయం: 16:16:59

చంద్రాస్తమయం: 05:00:50

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ

ఫలం 21:40:34 వరకు తదుపరి

ఆనంద యోగం - కార్య సిధ్ధి

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 477 / Bhagavad-Gita - 477 🌹*

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -08 🌴*


*08. మయ్యేమ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |*

*నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వం న సంశయ: ||*


*🌷. తాత్పర్యం : దేవదేవుడైన నా యందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము మరియు నీ బుద్ధినంతయు నా యందే నియుక్తము గావింపుము. ఈ విధముగా సదా నా యందే నీవు నిస్సంశయముగా నివసింతువు.*


*🌷. భాష్యము : : శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవలో నియుక్తుడైనవాడు ఆ భగవానునితో ప్రత్యక్ష సంబధమున జీవించును. తత్కారణముగా తొలినుండియే అతని స్థితి ఆధ్యాత్మికమై యుండుననుటలో ఎట్టి సందేహము లేదు. వాస్తవమునకు భక్తుడెన్నడును భౌతికపరధిలో జీవింపడు. అతడు సదా కృష్ణుని యందే నిలిచియుండును. కృష్ణనామమునకు మరియు కృష్ణునకు భేదములేదు కనుక భక్తుడు కృష్ణుని నామమును ఉచ్చరించినంతనే కృష్ణుడు మరియు అతని అంతరంగశక్తి భక్తుని నాలుకపై నాట్యము చేయుదురు.*


*భక్తుడు వివిధ పదార్థములను నైవేద్యముగా అర్పించినపుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా వాటిని స్వీకరించును. పిదప భక్తుడు ఆ ప్రసాదమును గొని కృష్ణభావనలో తన్మయుడగును. భగవద్గీత యందు మరియు ఇతర వేదవాజ్మయమునందు ఈ పద్ధతి వివరింపబడియున్నను ఇట్టి భక్తియుత సేవాకార్యమున నియుక్తుడు కానివాడు అదియెట్లు సంభవమనెడి విషయమును అవగతము చేసికొనజాలడు.*

🌹🌹🌹🌹🌹


*🌹 Bhagavad-Gita as It is - 477 🌹

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 12 - Devotional Service - 08 🌴*


*08. mayy eva mana ādhatsva mayi buddhiṁ niveśaya*

*nivasiṣyasi mayy eva ata ūrdhvaṁ na saṁśayaḥ*


*🌷 Translation : Just fix your mind upon Me, the Supreme Personality of Godhead, and engage all your intelligence in Me. Thus you will live in Me always, without a doubt.*


*🌹 Purport : One who is engaged in Lord Kṛṣṇa’s devotional service lives in a direct relationship with the Supreme Lord, so there is no doubt that his position is transcendental from the very beginning. A devotee does not live on the material plane – he lives in Kṛṣṇa.*


*The holy name of the Lord and the Lord are nondifferent; therefore when a devotee chants Hare Kṛṣṇa, Kṛṣṇa and His internal potency are dancing on the tongue of the devotee. When he offers Kṛṣṇa food, Kṛṣṇa directly accepts these eatables, and the devotee becomes Kṛṣṇa-ized by eating the remnants. One who does not engage in such service cannot understand how this is so, although this is a process recommended in the Bhagavad-gītā and in other Vedic literatures.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 832 / Sri Siva Maha Purana - 832 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 28 🌴*


*🌻. శంఖచూడుని వివాహము - 3 🌻*


*సనత్కుమారుడిట్లు పలికెను- తులసి ఆతనితో ప్రేమపూర్వకముగా ఇట్లు పలికి విరమించెను. ఆతడు చిరునవ్వుతో గూడియున్న ఆమెను గాంచి ఇట్లు చెప్పుటకు ఉపక్రమించెను (18).*


*శంఖచూడుడు ఇట్లు పలికెను - ఓ దేవీ! నీవు చెప్పిన సర్వము అసత్యము కాదు. కాని కొంత సత్యము, కొంత అసత్యము గలదు. నా మాటను వినుము (19). పతివ్రతాస్త్రీలలో నీవు అగ్రేసరురాలవు. నేను పాపదృష్టిగల కాముకుడును గాను. నీవు కూడ అట్టి దానవు కాదని నేను భావించుచున్నాను (20). ఇపుడు నేను బ్రహ్మ యొక్క ఆజ్ఞచే నీవద్దకు వచ్చియుంటిని. ఓ సుందరీ! నేను నిన్ను గాంధర్వివిధిలో వివాహమాడెదను (21). దేవతలు పారిపోవునట్లు చేయు శంఖచూడుడను నేను. ఓ మంగళస్వరూపురాలా! నన్ను ఎరుంగనా ! ఎప్పుడైననూ నా పేరు వినలేదా? (22). విశేషించి నేను దనువంశములో జన్మించితిని. నా తండ్రి పేరు దంభుడు. పూర్వజన్మలో నేను శ్రీకృష్ణుని అనుంగు సహచరుడైన సుదాముడనే గోపాలకుడను (23) రాధాదేవియొక్క శాపముచే ఈ జన్మలో దానవవీరుడనై జన్మించితిని. శ్రీకృష్ణుని ప్రభావముచే నేను పూర్వ జన్మ వృత్తాంతమునంతనూ ఎరుంగుదును (24).*


*సనత్కుమారుడిట్లు పలికెను - శంఖచూడుడు ఆమె ఎదుట ఇట్లు పలికి విరమించెను. ఆ రాక్షసరాజు ఇట్లు ఆదరముతో సత్యవచనమును పలుకగా, ఆ తులసి సంతసించి చిరునవ్వుతో ఇట్లు చెప్పుట మొదలిడెను (25).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 832 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 28 🌴*


*🌻 The penance and marriage of Śaṅkhacūḍa - 3 🌻*


Sanatkumāra said:—

18. Tulasī thus spoke to the passionate Dambha and stopped. On seeing her smiling he began to say.


Śaṅkhacūḍa said:—

19. O gentle lady, what you said now is not entirely false. It is partially true also. Now listen to me.


20. You are the foremost among chaste ladies. I am not a lusty person of sinful nature. I think you too are not like that.


21. I come to you now at the behest of Brahmā. O gently lady, I shall take your hand by the Gāndharva rites of marriage.


22. I am Śaṅkhacūḍa, the router of the gods. O gentle lady, don’t you know me? Have I never been heard by you?


23. I am a scion of the family of Danu. I am a Dānava, the son of Dambha. In the previous birth I was the cowherd Sudāmā, a comrade of Kṛṣṇa.


24. Due to the curse of Rādhā I have become a Dānava now. By the favour of Kṛṣṇa I remember events of previous birth. I know everything.


Sanatkumāra said:—

25. After saying thus to her, Śaṅkhacūḍa stopped. Tulasī who was thus addressed truthfully and respectfully by the king of Dānavas, was delighted and she spoke smilingly.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 90 / Osho Daily Meditations  - 90 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 90. మరణ భయం 🍀*


*🕉. మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. మరణం రాబోతుంది: జీవితంలో అది ఒక్కటే నిశ్చయమైనది. మిగతావన్నీ అనిశ్చితంగా ఉంటాయి, కాబట్టి నిశ్చయత గురించి ఎందుకు ఆందోళన చెందాలి? 🕉*


*మరణం ఒక సంపూర్ణ నిశ్చయం. వంద శాతం మంది చనిపోతారు - తొంభై తొమ్మిది శాతం కాదు, వంద శాతం. ప్రజల మరణాలకు సంబంధించినంత వరకు అన్ని శాస్త్రీయ అభివృద్ధి మరియు వైద్య శాస్త్రంలో అన్ని పురోగతులు ఎటువంటి తేడా తేలేవు: వంద శాతం మంది ప్రజలు పదివేల సంవత్సరాల క్రితం మరణించినట్లే ఇప్పటికీ మరణిస్తారు. ఎవరు పుట్టినా, మరణిస్తారు; మినహాయింపు లేదు. కాబట్టి మరణం గురించి మనం పూర్తిగా విస్మరించవచ్చు. అది జరగబోతోంది కాబట్టి ఎప్పుడు జరిగినా సరే.*


*మీరు ప్రమాదంలో పడగొట్టబడినా లేదా మీరు ఆసుపత్రి మంచంలో మరణించినా అది ఎలా జరుగుతుందో దానిలో తేడా ఏమిటి? పర్వాలేదు. ఒకసారి మీరు మరణం నిశ్చయం అనే పాయింట్‌ని చూస్తే, ఇవి కేవలం మర్యాద మాత్రమే-ఎలా మరణిస్తాడు, ఎక్కడ మరణిస్తాడు అన్నవి. అసలు విషయం ఏమిటంటే మీరు చనిపోతారు. క్రమంగా మీరు వాస్తవాన్ని అంగీకరిస్తారు. మరణాన్ని అంగీకరించాలి. దానిని తిరస్కరించడంలో అర్థం లేదు; మరియు ఎవరూ దానిని నిరోధించలేకపోయారు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి! మీరు జీవించి ఉండగా, పూర్తిగా ఆనందించండి; మరియు మరణం వచ్చినప్పుడు, దాన్ని కూడా ఆనందించండి.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 90 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 90. FEAR OF DEATH 🍀*


*🕉. There is no need to be afraid if death. Death is going to come: that is the only certain thing in life. Everything else is uncertain, so why be worried about the  certainty?  🕉*


*Death is an absolute certainty. One hundred percent of people die-not ninety-nine percent, but one hundred. All the scientific growth and all the advances in medical science make no difference as far as people's deaths are concerned: one hundred percent of people still die, just as they used to die ten thousand years ago. Whoever is born, dies; there is no exception. So about death we can be completely oblivious. It is going to happen, so whenever it happens it is okay.*


*What difference does it make how it happens-whether you are knocked out in an accident or you just die in a hospital bed? It doesn't matter. Once you see the point that death is certain, these are only formalities-how one dies, where one dies. The only real thing is that one dies. By and by you will accept the fact. Death has to be accepted. There is no point in denying it; and nobody has ever been able to prevent it. So relax! While you  are alive, enjoy it totally; and when death comes, enjoy that too.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 517 - 519 / Sri Lalitha Chaitanya Vijnanam  - 517 - 519 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  106. మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా, అస్థి సంస్థితా ।*

*అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా ॥ 106 ॥ 🍀*


*🌻 517 నుండి 519🌻*


*517. 'అంకుశాది ప్రహరణా' - అంకుశము మొదలగు ఆయుధములను బాహువునందు ధరించునది శ్రీమాత అని అర్థము.*

*518. 'వరదాది నిషేవితా' - వరద మొదలగు దేవతలచే పూజింపబడునది శ్రీమాత అని అర్థము.*

*519. 'ముద్దేదనాసత్తచిత్తా - మీనుప పప్పుతో కలిపిన అన్నమునందు ఆసక్తి కలది శ్రీమాత అని అర్థము.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 517 - 519 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻106. Muladharanbujarudha panchavaktrasdhi sanpdhita*

*ankushadi praharana varadadi nishevita ॥ 106 ॥ 🌻*


*🌻 517  to 519 🌻*


*517. 'Ankushadi Praharana' - The wearer  of Ankusha (spike) and other weapons in arms is Srimata.*

*518. 'Varadadi Nishevita' - Srimata means the one who is worshiped by Varada and other deities.*

*519. 'Muddedanasattachitta - Srimata is interested in rice mixed with black gram.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page