top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 27, DECEMBER 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 27, DECEMBER 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 27, DECEMBER 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 478 / Bhagavad-Gita - 478 🌹

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -09 / Chapter 12 - Devotional Service - 09 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 834 / Sri Siva Maha Purana - 834 🌹

🌻. శంఖచూడుని వివాహము - 4 / The penance and marriage of Śaṅkhacūḍa - 4 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 91 / Osho Daily Meditations  - 91 🌹

🍀 91. టీవీ చూడటం / 91. WATCHING TV 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 1 🌹

🌻 520. 'సాకిన్యంబా స్వరూపిణీ' - 1 / 520. Sakinyanba Svarupini - 1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 27, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆరుద్ర దర్శనము, మండల పూజ, Arudra Darshan, Mandala Pooja 🌻*


*🍀. శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం - 03 🍀*


*03. మహాగణపతిం దేవం మహాసత్త్వం మహాబలమ్ |*

*మహావిఘ్నహరం శంభోః నమామి ఋణముక్తయే*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : అపరా భూమికల అభివ్యక్తి లక్షణం : ఆపరా భూమికల యందు అభివ్యక్తం కావడంలోనే సచ్చిదానందములు పరస్పరం వేరుపడినట్లే, చిదానంద లక్షణ శూన్యమైన సత్తు, ఆనంద లక్షణ శూన్యమైన చిత్తు మన అనుభవ గోచరమవుతున్నవి. అవి యిట్లు వేరుపడడమే లేకపోతే, అనృత జడ, దుఃఖాదు లిచట అభివ్యక్తం కావడం గాని, సమష్టి జడా జ్ఞానంలోంచి పరిచ్ఛిన్న చేతన క్రమవికాసం చెందడంగాని జరగదు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

మార్గశిర మాసం

తిథి: కృష్ణ పాడ్యమి 30:47:37

వరకు తదుపరి కృష్ణ విదియ

నక్షత్రం: ఆర్ద్ర 23:30:24 వరకు

తదుపరి పునర్వసు

యోగం: బ్రహ్మ 26:40:18 వరకు

తదుపరి ఇంద్ర

కరణం: బాలవ 18:24:41 వరకు

వర్జ్యం: 07:09:27 - 08:49:55

దుర్ముహూర్తం: 11:54:39 - 12:39:02

రాహు కాలం: 12:16:51 - 13:40:05

గుళిక కాలం: 10:53:36 - 12:16:51

యమ గండం: 08:07:08 - 09:30:22

అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:38

అమృత కాలం: 13:01:05 - 14:41:33

సూర్యోదయం: 06:43:53

సూర్యాస్తమయం: 17:49:47

చంద్రోదయం: 18:06:46

చంద్రాస్తమయం: 06:57:37

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు: ముసల యోగం - దుఃఖం

23:30:24 వరకు తదుపరి గద యోగం

- కార్య హాని , చెడు

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 478 / Bhagavad-Gita - 478 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -09 🌴*


*09. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |*

*అభ్యాసయోగేన తతో మమిచ్ఛాప్తుం ధనంజయ ||*


*🌷. తాత్పర్యం : ఓ అర్జునా! ధనంజయా! స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో, భక్తియోగమునందలి విధివిధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసికొనుము.*


*🌷. భాష్యము : ఈ శ్లోకమున రెండు విధములైన భక్తియోగావిదానములు తెలుపబడినవి. అందు మొదటిది దివ్యప్రేమ ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అనురాగమును వాస్తవముగా వృద్దిచేసికొనినవారికి సంబంధించినది. దివ్యప్రేమ ద్వారా పరమపురుషుని యెడ అనురాగమును పెంపొందించుకొనినవారికి రెండవ పధ్ధతి పేర్కొనబడినది. ఈ రెండవ తరగతికి పలు విధివిధానములు నిర్దేశింప బడియున్నవి. శ్రీకృష్ణుని యెడ అనురాగాము కలిగిన స్థితికి మనుజుడు అంత్యమున ఉద్ధరింపబడుటకు వాటిని అనుసరింపవచ్చును. భక్తియోగమనగా ఇంద్రియముల పవిత్రీకరణమని భావము. ప్రస్తుతము భౌతికస్థితిలో ఇంద్రియములు భోగతరములై యున్నందున అపవిత్రములై యుండును. కాని భక్తియోగాభ్యాసముచే ఇంద్రియములు పవిత్రములు కాగలవు.*


*పవిత్రస్థితిలో అవి శ్రీకృష్ణభగవానునితో ప్రత్యక్ష సంబంధమునకు రాగలవు. ఈ జగమున నేను ఒక యజమాని సేవలో నిలిచినప్పుడు, నిజముగా ప్రేమతో అతనిని సేవింపను. కేవలము కొంత ధనమును పొందుటకే సేవను గూర్తును. అదేవిధముగా యజమాని సైతము ప్రేమను కలిగియుండడు. నా నుండి సేవను గ్రహించి, నాకు ధనమొసగుచుండును. కనుక ఇచ్చట ప్రేమ అనెడి ప్రశ్నయే ఉదయింపదు. కాని ఆధ్యాత్మికజీవితమున శుద్ధమగు ప్రేమస్థాయికి ప్రతియొక్కరు ఎదుగవలసినదే. ప్రస్తుత ఇంద్రియములచే నిర్వహింపబడెడి భక్తియోగాభ్యాసము చేతనే అట్టి ప్రేమస్థాయి ప్రాప్తించగలదు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 478 🌹

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 12 - Devotional Service - 09 🌴*


*09. atha cittaṁ samādhātuṁ na śaknoṣi mayi sthiram*

*abhyāsa-yogena tato mām icchāptuṁ dhanañ-jaya*


*🌷 Translation : My dear Arjuna, O winner of wealth, if you cannot fix your mind upon Me without deviation, then follow the regulative principles of bhakti-yoga. In this way develop a desire to attain Me.*


🌹 Purport : In this verse, two different processes of bhakti-yoga are indicated. The first applies to one who has actually developed an attachment for Kṛṣṇa, the Supreme Personality of Godhead, by transcendental love. And the other is for one who has not developed an attachment for the Supreme Person by transcendental love. For this second class there are different prescribed rules and regulations one can follow to be ultimately elevated to the stage of attachment to Kṛṣṇa. Bhakti-yoga is the purification of the senses. At the present moment in material existence the senses are always impure, being engaged in sense gratification. But by the practice of bhakti-yoga these senses can become purified, and in the purified state they come directly in contact with the Supreme Lord.*


*In this material existence, I may be engaged in some service to some master, but I don’t really lovingly serve my master. I simply serve to get some money. And the master also is not in love; he takes service from me and pays me. So there is no question of love. But for spiritual life, one must be elevated to the pure stage of love. That stage of love can be achieved by practice of devotional service, performed with the present senses. This love of God is now in a dormant state in everyone’s heart. And, there, love of God is manifested in different ways, but it is contaminated by material association. Now the heart has to be purified of the material association, and that dormant, natural love for Kṛṣṇa has to be revived. That is the whole process.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 833 / Sri Siva Maha Purana - 833 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 28 🌴*


*🌻. శంఖచూడుని వివాహము - 4 🌻*


*తులసి ఇట్లు పలికెను - సాత్త్వికమనో భావములు గల నీచే నేను ఈ నాడు జయింపబడితిని. ఏ పురుషుడు ఈ లోకములో స్త్రీచే జయింపబడడో, వాడే ధన్యుడు (26). ఏ పురుషుడు స్త్రీచే జయింపబడునో వాడు పవిత్రమగు కర్మలను చేయు వాడే అయిననూ సర్వదా శౌచవిహీనుడే. పితృదేవతలు, దేవతలు, మరియు సర్వమానవులు అట్టి వానిని నిందించెదరు (27). జాతశౌచ మృతాశౌచ ములలో బ్రాహ్మణుడు పది, క్షత్రియుడు పన్నెండు, వైశ్యుడు పదిహేను, శూద్రుడు ముప్పది రోజులలో శుద్ధిని పొందునని వేదము ఉపదేశించుచున్నది. కాని స్త్రీచే జయింపబడిన పురుషుడు చితిపై దహించుటచే తప్ప ఎక్కడైననూ శుద్ధిని పొందడు (28, 29). కావున అట్టి వాడు సమర్పించిన పిండమును, తర్పణములను పితృదేవతలు ఆనందముతో స్వీకరించరు. ఆతడు సమర్పించిన పుష్పఫలాదులను దేవతలు స్వీకరించరు (30). ఎవని మనస్సు స్త్రీలచే అపహరింపబడినదో, వానికి జ్ఞానము, మంచి తపస్సు, జపము, హోమము, పూజ విద్య, దానము అను వాటితో ఏమి ప్రయోజనము గలదు? (31) నీవిద్యను, ప్రభావమును, జ్ఞానమును తెలియుటకై నేను పరీక్ష చేసితిని. స్త్రీ వరుని పరీక్షించిన తరువాతనే భర్తగా వరించవలెను గదా! (32).*


*సనత్కుమారుడిట్లు పలికెను- తులసి ఇట్లు మాటలాడు చుండగా, అదే క్షణములో సృష్టికర్తయగు బ్రహ్మ అచటకు విచ్చేసెను. అపుడాయన ఇట్లు పలికెను (33).*


*బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ శంఖచూడా! ఈ మెతో నీవేమి సంభాషణను చేయుచున్నావు? ఈమెను నీవు గాంధర్వవిధిచే వివాహమాడుము (34). నీవు పురుషులలో శ్రేష్ఠుడవు. ఈ పతివ్రత స్త్రీలలో శ్రేష్ఠురాలు. జ్ఞానవంతురాలగు ఈమెకు జ్ఞానివగు నీతో వివాహము గొప్ప గుణకారి కాగలదు (35). విరోధము లేనిది, దుర్లభ##మైనది అగు సుఖమును ఎవడు విడిచిపెట్టును? ఓ రాజా! విరోధములేని సుఖమును పరిత్యజించు వ్యక్తి పశుప్రాయుడనుటలో సందేహము లేదు (36). ఓ పుణ్యాత్మురాలా! గుణవంతుడు, దేవతలను, అసురులను దానవులను శిక్షించువాడు అగు ఇట్టి సుందరుని నీవు ఏమి పరీక్ష చేయు చున్నావు? (37) నీవీతనితో గూడి చిరకాలము అన్ని వేళలలో సర్వలోకములయందలి ప్రదేశము లన్నింటిలో యథేచ్ఛగా విహరించుము. ఓ సుందరీ! (38) ఆతడు మరణించిన తరువాత గోలోకములో మరల శ్రీకృష్ణుని పొందగలడు. ఆతడు మరణించిన పిదప నీవు వైకుంఠములో చతుర్భుజుడగు విష్ణువును పొందగలవు (39).*


*సనత్కుమారుడిట్లు పలికెను- బ్రహ్మ ఈ విధముగా ఆశీర్వదించి తన ధామమునకు వెళ్లెను. ఆ శంఖచూడుడు ఆమెను గాంధర్వవిధితో వివాహమాడెను (40). ఆతడు ఈ తీరున తులసిని వివాహమాడి తండ్రి గృహమునకు వెళ్లి మనోహరమగు ఆ నివాసములో ఆ సుందరితో గూడి రమించెను (41).*


*శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శంఖచూడ వివాహవర్ణనమనే ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 833 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 28 🌴*


*🌻 The penance and marriage of Śaṅkhacūḍa - 4 🌻*


Tulasī said:—

26. I have now been overpowered by you who have Sāttvika thoughts. That man is blessed in the world who is not overwhelmed by a woman.


27. Even though he may be the observer of sacred rites, if he is overpowered by a woman he becomes impure and unclean, so he remains for ever. The manes, gods and human beings censure him.


28-29. A brahmin is purified from impurity arising from births or deaths in the family, after the tenth day. A Kṣatriya in twelve days, a Vaiśya in fifteen days and a Śūdra in a month. This is what the Vedas enjoin. But a henpecked man can never be purified till death.


30. The manes do not receive willingly the balls of rice or holy waters offered by him. Nor do the gods accept his offering of fruits and flowers.


31. Of what avail are words of wisdom, penance, Japas, Homas, worships, learning or charitable gifts to that wretch whose mind is deadened by his thoughts of women?


32. You have been tested by me in order to know your knowledge and power. A woman must test her bridegroom before wooing him.


Sanatkumāra said:—

33. Even as Tulasī was saying so, Brahmā the creator came there and spoke these words.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 91 / Osho Daily Meditations  - 91 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 91. టీవీ చూడటం 🍀*


*🕉. ధ్యానం యొక్క మొత్తం రహస్యం ఏమిటంటే,  అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ కాకుండా, ఆందోళన లేకుండా, ఎలాంటి ఇష్టాలు మరియు అయిష్టాలు లేకుండా, ఎలాంటి ఎంపిక లేకుండా ఉండడం. 🕉*


*ధ్యానం ఒక సాధారణ పద్ధతి. మీ మనసు టీవీ స్క్రీన్ లాంటిది. జ్ఞాపకాలు గడిచిపోతున్నాయి, చిత్రాలు గడిచిపోతున్నాయి, ఆలోచనలు, కోరికలు, వెయ్యినొక్క విషయాలు గడిచిపోతున్నాయి; ఇది ఎల్లప్పుడూ రద్దీ సమయం. మరియు రహదారి దాదాపు భారతీయ రహదారి వలె ఉంటుంది: ట్రాఫిక్ నియమాలు లేవు మరియు ప్రతి ఒక్కరూ ప్రతి దిశలో వెళుతున్నారు. ఒక వ్యక్తి మనస్సును ఎటువంటి మూల్యాంకనం లేకుండా, ఎటువంటి తీర్పు లేకుండా, ఏ ఎంపిక లేకుండా చూసుకోవాలి, దానితో మీకు సంబంధం లేనట్లు మరియు మీరు కేవలం సాక్షి మాత్రమే అన్నట్లుగా ఆందోళన చెందకుండా చూసుకోవాలి. అది ఎంపికలేని అవగాహన.*


*మీరు ఎంచుకుంటే, 'ఈ ఆలోచన మంచిదే-నాకు ఇది ఉండనివ్వండి' లేదా 'ఇది ఒక అందమైన కల, దాన్ని మరికొంత ఆనందించాలి' అని మీరు ఎంచుకుంటే, మీరు సాక్షీతత్త్వాన్ని కోల్పోతారు. మీరు, 'ఇది చెడ్డది, అనైతికం, పాపం, నేను దీన్ని విసిరివేయాలి' అని చెప్పి, మీరు కష్టపడటం మొదలుపెడితే, మళ్లీ మీరు మీ సాక్షీతత్త్వాన్ని కోల్పోతారు. మీరు మీ సాక్షీతత్త్వాన్ని రెండు విధాలుగా కోల్పోవచ్చు: అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉండడం ద్వారా. ధ్యానం యొక్క మొత్తం రహస్యం ఏమిటంటే, ఏ విధమైన ఇష్టాలు మరియు అయిష్టాలు లేకుండా, ఎటువంటి ఎంపిక లేకుండా, అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉండకుండా, ఆందోళన చెందకుండా, నిదానంగా ఉండాలి. మీరు సాక్షిగా కొన్ని క్షణాలు అయినా ఉండగలిగితే, మీరు ఎంత ఆనందాన్ని పొందుతారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 91 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 91. WATCHING TV 🍀*


*🕉 The whole secret if meditation is to be neither for nor against, but unconcerned, cool, without any likes and dislikes, without any choice.  🕉*


*Meditation is a simple method. Your mind is like a TV screen. Memories are passing, images are passing, thoughts, desires, a thousand and one things are passing; it is always rush hour. And the road is almost like an Indian road: There are no traffic rules, and everybody is going in every direction. One has to watch the mind without any evaluation, without any judgment, without any choice, simply watching unconcerned as if it has nothing to do with you and you are just a witness. That is choiceless awareness.*


*If you choose, if you say, "This thought is good-let me have it," or "It is a beautiful dream, should enjoy it a little more," if you choose, you lose your witnessing. If you say, "This is bad, immoral, a sin, I should throw it out," and you start struggling, again you lose your witnessing. You can lose your witnessing in two ways: either being for or against. And the whole secret of meditation is to be neither for nor against, but unconcerned, cool, without any likes and dislikes, without any choice. If you can manage even a few moments of that witnessing, you will be surprised how ecstatic you become.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 520 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 520 - 1 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  107. ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ ।*

*ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥ 🍀*


*🌻 520. 'సాకిన్యంబా స్వరూపిణీ' - 1 🌻*


*సాకినీ అను పేరుగల మాతగ మూలాధార పద్మము నందున్నది. 514 నుండి 520వ నామము వరకు మూలాధార దేవత స్థితి యున్నది. మూలాధార పద్మము నాలుగు దళములతో నుండును. అందు శం, సం, షం, హం అను నాలుగు బీజాక్షరము లుండును. కేంద్రమున 'లం' అను బీజాక్షర ముండును. ఈ పద్మము ఎర్రని రంగులో నుండునని తెలుపుదురు. ఇందలి శ్రీమాత పంచముఖి. అనగా ఐదు భూతములు వ్యక్తమైన స్థితి. ఈ స్థితియందు సృష్టి, జీవ రూపముల సృష్టి భౌతికమునకు చేరును. జీవులయందు అత్యధిక భౌతిక స్థితి అస్థికలకు (ఎముకల) ఉండును. దేహ ధాతువులలో ఎముక ఏడవది. ఎముకలు ఆధారముగనే మిగిలిన ఆరు ధాతువులకు రూప మేర్పడును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 520 - 1 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻107. Mudgaodanasaktachitta sakinyanba svarupini*

*aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥ 🌻*


*🌻 520. Sakinyanba Svarupini - 1 🌻*


*Mata is residing in the  Mooladhara Padma in the name of Sakini. From 514th to 520th name there is the status of Muladhara deity. Muladhara Padma has four petals. And there are four bijaksharas namely Shum, Sam, Sham, Ham. In the center is the letter 'lum'. It is said that this lotus is red in color. Here Shrimata is with five faces as a Panchmukhi. That is, the state in which the five elements are manifested. In this state creation, creation of living forms reaches physicality. Bones have the highest physical status in living things. Bone is the seventh of the body minerals. Bones form the basis of the remaining six minerals.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page