🍀🌹 29, MAY 2024 MONDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 535 / Bhagavad-Gita - 535 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 46 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 46 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 889 / Sri Siva Maha Purana - 889 🌹
🌻. శంఖచూడుని వధ - 4 / The annihilation of Śaṅkhacūḍa - 4 🌻
3) 🌹 సిద్దేశ్వరయానం - 68 🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 546 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 2 🌹
🌻 546. 'బంధమోచనీ’ - 2 / 546. 'Bandhamochani' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 535 / Bhagavad-Gita - 535 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 11 🌴*
*11. సర్వద్వారేషు దేహే(స్మిన్ ప్రకాశ ఉపజాయతే |*
*జ్ఞానం యదా తదా విద్యాద్ వివృద్ధం సత్త్వమిత్యుత ||*
*🌷. తాత్పర్యం : దేహ ద్వారములన్నియును జ్ఞానముచే ప్రకాశమానమైనప్పుడు సత్త్వగుణము యొక్క వ్యక్తీకరణము అనుభవమునకు వచ్చును.*
*🌷. భాష్యము : దేహమునకు రెండు కన్నులు, రెండు చెవులు, రెండు నాసికారంధ్రములు, నోరు, జననావయము, పృష్టమను తొమ్మిది ద్వారములు గలవు. ఈ తొమ్మిది ద్వారములలో ప్రతిదియు సత్త్వగుణ లక్షణములచే ప్రకాశమానమైనప్పుడు మనుజుడు సత్త్వగుణమును వృద్ధిచేసికొనిననాడని అవగాహన చేసికొనవచ్చును.*
*అట్టి సత్త్వగుణమున మనుజుడు విషయములను వాస్తవదృక్పథమున గాంచునట్లు, వినుటయు, స్వీకరించుటయు చేయగలడు. ఆ విధముగా అతడు అంతర్భాహ్యములందు శుద్ధుడు కాగలడు. అనగా ప్రతిద్వారముమందును ఆనందము మరియు సౌఖ్యలక్షణములు వృద్ధి కాగలవు. అదియే సత్త్వగుణపు వాస్తవస్థితి.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 535 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 11 🌴*
*11. sarva-dvāreṣu dehe ’smin prakāśa upajāyate*
*jñānaṁ yadā tadā vidyād vivṛddhaṁ sattvam ity uta*
*🌷 Translation : The manifestation of the mode of goodness can be experienced when all the gates of the body are illuminated by knowledge.*
*🌹 Purport : There are nine gates in the body: two eyes, two ears, two nostrils, the mouth, the genitals and the anus. When every gate is illuminated by the symptoms of goodness, it should be understood that one has developed the mode of goodness. In the mode of goodness, one can see things in the right position, one can hear things in the right position, and one can taste things in the right position. One becomes cleansed inside and outside. In every gate there is development of the symptoms of happiness, and that is the position of goodness.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 889 / Sri Siva Maha Purana - 889 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 40 🌴*
*🌻. శంఖచూడ వధ - 4 🌻*
*శంఖచూడుని పైన ఆకాశము నందు క్షణకాలము తిరిగిన ఆ శూలము శివశాసనముచే ఆతనిపై పడి క్షణములో ఆతనిని భస్మము చేసెను (28). ఓ బ్రాహ్మణా! అపుడా మహేశ్వరుని శూలము తన పనిని పూర్తిచేసి మనో వేగముతో వెంటనే వెనుదిరిగి ఆకాశమార్గములో వెళ్లి శివుని చేరెను (29). స్వర్గములో దుందుభులు మ్రోగెను. గంధర్వులు, కిన్నరులు గానము చేసిరి. మునులు, దేవతలు శివుని స్తుతించిరి. అప్సరసల గణములు నాట్యమును చేసినవి (30).*
*శివునిపై ఎడతెరిపి లేని పూలవాన కురిసెను. విష్ణువు, బ్రహ్మ ఇంద్రుడు మొదలగు వారు మరియు మునులు ఆయనను ప్రశంసించిరి (31). దానవచక్రవర్తి యగు శంఖచూడుడు అపుడు శివుని కృపచే శాపమునుండి విముక్తుడై పూర్వరూపముపును పొందెను (32). శంఖచూడుని ఎముకలనుండి శంఖము పుట్టినది. శంకరుడు తక్క సర్వులకు శంఖమునందలి జలము ప్రశస్తమైనది (33). ఓ మహర్షీ! విష్ణువునకు , లక్ష్మికి మరియు వారి సహచరులకు శంఖజలము మిక్కిలి ప్రియమైనది. కాని శంకరునకు కాదు (34). శంకరుడీ తీరున వానిని సంహరించి వృషభము నధిష్ఠించి పార్వతి, కుమారస్వామి, గణములు వెంటరాగా మహానందముతో శివలోకమునకు వెళ్లెను (35).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 889 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj *
*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 40 🌴*
*🌻 Śaṅkhacūḍa is slain - 4 🌻*
28. That trident whirling round over the head of Śaṅkhacūḍa for a while fell on the head of the Dānava at the behest of Śiva and reduced him to ashes.
29. O brahmin, then it rapidly returned to Śiva and having finished its work went away by the aerial path with the speed of the mind.
30. The Dundubhis were sounded in the heaven. Gandharvas and Kinnaras sang. The sages and the gods eulogised and the celestial damsels danced.
31. A continuous shower of flowers fell over Śiva. Viṣṇu, Brahmā, Indra, other gods and sages praised him.
32. Saṅkhacūḍa the king of Dānavas was released from his curse by the favour of Śiva. He regained his original form.
33. All the conches in the world are formed of the bones of Śaṅkhacūḍa. Except for Śiva, the holy water from the conch is sacred for every one.
34. O great sage, particularly to Viṣṇu and Lakṣmī the water from the conch is pleasant. To all persons connected with Viṣṇu it is so but not to Siva.
35. After slaying him thus, Śiva went to Śivaloka seated on his bull, joyously, accompanied by Pārvatī, Kārttikeya and the Gaṇas.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 68 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 అపర కుబేరుడు తిప్పయ శెట్టి 🏵*
*తిప్పయ్య శెట్టి, శ్రీనాధ కవి ఆరోజు సాయంకాలం ఇద్దరూ కలిసి ఏకామ్రనాధుని ఆలయం దగ్గర ఒక ధర్మశాలలో విడిది చేసిన కాళీ సిద్ధుని దగ్గరకు ఇద్దరూ వెళ్ళారు. శ్రీనాథుడు ముందు లోపలికి వెళ్ళి కాళీసిద్ధునకు అవచితిప్పయ్యశెట్టి గురించి చెప్పాడు. "స్వామివారు ! ఈ కంచిలో అవచివారి కుటుంబం వ్యాపారరంగంలో సుప్రసిద్ధులు. వివేకనిరంజన రామనాధ యోగీశ్వరుని పాదసేవకుడయిన అవచిదేవయ్యశెట్టికి ముగ్గురు కుమారులు. వారు ద్వీపాంతరములతో ఎగుమతి దిగుమతులు చేసి అపార సంపదనార్జించినవారు. ఆ సంపదలకేమి గాని నిరంతర మహేశ్వరభక్తి పరాయణులు. ఎన్ని వందల వేలమంది వచ్చినా నిరంతరం పంచ భక్ష్య పరమాన్నములతో సమారాధనలు చేస్తుంటారు. దానధర్మములలో వారిని మించిన వారు లేరు. కొండవీటి ప్రభువైన కుమారగిరిరెడ్డి చేసే వసంతోత్సవాలను మొత్తం ఖర్చుపెట్టి వీరే నిర్వహిస్తుంటారు.*
*సీ|| పంజార కర్పూర పాదపంబులు తెచ్చె జలనోంగి బంగారు మొలక దెచ్చె
సింహళంబున గంధసింధురంబులు దెచ్చె హురుమంజిమలు తేజిహరులు దెచ్చె గోవసంశుద్ధ సంకుమద ద్రవము తెచ్చె యాంప గట్టాణి ముత్యాలు దెచ్చె
భోట గస్తూరికాపుటంకములు దెచ్చె జీని చీనాంబర శ్రేణి దెచ్చె*
*తే॥ జగదగోపాలరాయ వేశ్యాభుజంగ పల్లవాదిత్య భూదాన పరశురామ కొమరగిరిరాజ దేవేంద్రు కూర్మిహితుడు జాణ జగజెట్టి దేవయచామిశెట్టి.*
*అటువంటి ఆ సోదరత్రయంలో అగ్రజుడైన తిప్పయశెట్టి శైవ ప్రబంధ మొకటి రచించి తన కంకితమీయమని తాంబూలం ఇచ్చాడు. నిన్న మీరు చెప్పింది అక్షరాలా నిజమయింది. ఆ తిప్పయశెట్టి మీ దర్శనానికి వచ్చాడు. మీ రనుమతిస్తే వారిని లోపలికి తీసుకువస్తాను” అన్నాడు. కాళీసిద్ధుడు అంగీకార సూచనగా తల ఊపాడు. తిప్పయశెట్టి లోపలకు వచ్చి విలువైన బంగారునాణెములు సుగంధ ద్రవ్యములు పాదకానుకగా సమర్పించి 'ఆశీర్వదించమ'ని ప్రార్థించాడు.*
*కాళీసిద్ధుడు అతనిని చూచి ఇలా పలికాడు" తిప్పయశెట్టీ ! నీ కులగురువైన రామనాధ యోగీశ్వరులు నాకు బాగా ఆప్తుడు. పిల్లలమట్టి మహాప్రధాని పెద్దన్న బుధేంద్రుని దగ్గర శైవమార్గ సంపన్నతను పొందిన యోగ్యుడవు. ఇవ్వాళ ఈ దేశంలో అందరూ నిన్ను అపరకుబేరునిగా భావిస్తున్నారు. త్రిపురాంతక దేవుని సేవించడం వల్ల మీ వంశం శుభములతో వర్థిల్లుతున్నది. శ్రీమద్దక్షిణ కాశికాపుర మహాశ్రీ కాళహస్తీశ్వర ప్రేమాత్మోద్భవ కాలభైరవ కృపావర్ధితైశ్వర్యుడవు. కాలభైరవుని కృప నీయందు బాగా ఉన్నది. నీవు పూర్వజన్మలో కాశీలో చాలాకాలము ఉన్నావు. విశ్వేశ్వరుని గుడి ప్రక్కనే ఉన్న కుబేరేశ్వరాలయం దగ్గర నీ వసతి. రోజూ ఆ కుబేరేశ్వరుని సేవించేవాడవు. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న కాశీక్షేత్రపాలకు డయిన కాలభైరవ ఆలయానికి ప్రతిరోజు హారతి సమయానికి వెళ్ళేవాడవు. ఒక సిద్ధగురుడు నీకు కాలభైరవ మంత్రాన్ని ఉపదేశించాడు. నిష్ఠతో ఆ మంత్రజపం చేశావు. కాలభైరవుని అనుగ్రహము, కుబేరేశ్వరుని అనుగ్రహము నీకు లభించినవి. వాటి ఫలితంగా ఈ జన్మలో అనన్యమైన శివభక్తి కాళహస్తి లోని కాలభైరవ అనుగ్రహము, కుబేరుని కరుణ అనుగ్రహంతో నీవీ స్థితికి ఎదిగావు. ఇలా వేదధర్మరక్షకుడవై, కవిపోషకుడవై, దానధర్మములతో శివార్చనలతో జీవితాన్ని చరితార్థం చేసుకో. నిన్ను శ్రీనాధుడు 'త్రిపురారి యక్షరాజు' అన్నాడు గదా !*
*తిప్పయ్యశెట్టి : అవును స్వామి, ఆపద ప్రయోగం శ్రీనాధుని నోట నేను ప్రొద్దుననే విన్నాను. మీరు ఇలా చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉంది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 546 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀*
*🌻 546. 'బంధమోచనీ’ - 2 🌻*
*ఒంటరి తనమున బలహీనత, బంధము కలుగును. పంచేంద్రియముల చేతను, త్రిగుణముల చేతను శరీరమున బంధింపబడి అనేకానేక బాధలను చెందును. ఇట్టి వానికి తరణోపాయము కలుగవలె నన్నచో శ్రీమాతయే శరణ్యము. సర్వ సంకల్పములు ఆమె నుండియే జనించును. తాను ప్రత్యేకముగ నున్నానను సంకల్పము తన కెచ్చటి నుండి కలిగినది? తనలోని చైతన్యము నుండి కలిగినది. అట్టి వానికి తాను చైతన్యమే. చైతన్యమే తానుగ నున్నాడు. అట్లే సర్వజీవరాశులును అని తెలిపినపుడు అవిద్య తొలగును. ఈ భావము కూడ చైతన్యము నుండి కలుగవలసినదే కదా! అట్టి భావము కలుగుటకు శ్రీమాత అనుగ్రహము కావలెను.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*
*🌻 546. 'Bandhamochani' - 2 🌻*
*A lonely person will feel weak and bound. He is bound in the body by the five senses and the trigunas, and suffers many pains.Srimata is the only refuge for this person. All intentions are born from her. Where s the will derived from its virtue that one is special? For him he is consciousness itself. He himself is consciousness. Ignorance will be removed when he is told that it's the same for all living beings. This feeling should also arise from consciousness! Srimata's grace is needed to get such a feeling.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments