🍀🌹 29, NOVEMBER 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 29, NOVEMBER 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 464 / Bhagavad-Gita - 464 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 50 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 50 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 820 / Sri Siva Maha Purana - 820 🌹
🌻. విష్ణువు యొక్క మోహమును తొలగించుట - 1 / The Vanishing of Viṣṇu’s delusion - 1🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 77 / Osho Daily Meditations - 77 🌹
🍀 77. సహచర్యం / 77. TOGETHERNESS 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 505 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 505 - 2 🌹
🌻 505. 'చతుర్వక్త్ర మనోహరా' - 2 / 505. Chaturvaktra manohara - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 29, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ గజానన స్తోత్రం - 20 🍀*
*20. గజాఖ్యబీజం ప్రవదంతి వేదాస్తదేవ చిహ్నేన చ యోగినస్త్వామ్ |*
*గచ్ఛంతి తేనైవ గజాననస్త్వం గజాననం భక్తియుతా భజామః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సత్యధర్మ పక్షావలంబనం - అసుర శక్తులతోడి ఆధ్యాత్మిక సమరంలో ఉపేక్షకు, ఔదాసీన్యానికి, రాజీకి అవకాశంలేదు. ఏలనంటే, అట్టి రాజీ ప్రవృత్తితో వాటికి చోటిచ్చేయెడల, సత్యధర్మాన్నే అవి అణచివేయజూస్తాయి. కావున, సాధకునకు ఆధ్యాత్మిక సమత ఎంత ఆవశ్యకమో, సత్యధర్మ పక్షావలంబనం కూడ అంత ఆవశ్యకమే. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: కృష్ణ విదియ 13:58:12
వరకు తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: మృగశిర 14:00:23
వరకు తదుపరి ఆర్ద్ర
యోగం: సద్య 20:54:02 వరకు
తదుపరి శుభ
కరణం: గార 14:01:13 వరకు
వర్జ్యం: 22:45:03 - 24:25:15
దుర్ముహూర్తం: 11:41:42 - 12:26:28
రాహు కాలం: 12:04:05 - 13:28:00
గుళిక కాలం: 10:40:10 - 12:04:05
యమ గండం: 07:52:20 - 09:16:15
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26
అమృత కాలం: 05:01:06 - 06:38:54
మరియు 28:35:45 - 30:15:57
సూర్యోదయం: 06:28:26
సూర్యాస్తమయం: 17:39:44
చంద్రోదయం: 19:22:05
చంద్రాస్తమయం: 08:12:43
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 14:00:23 వరకు తదుపరి
ముసల యోగం - దుఃఖం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 464 / Bhagavad-Gita - 464 🌹*
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 50 🌴*
*50. సంజయ ఉవాచ*
*ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయ: |*
*ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పున: సౌమ్యవపుర్మహాత్మా ||*
*🌷. తాత్పర్యం : ధృతరాష్ట్రునితో సంజయుడు పలేకెను : దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజరూపమును ప్రదర్శించెను. భీతుడైన అర్జునునకు ఆ విధముగా ఆశ్వాసమును గూర్చుచు అంత్యమున తన ద్విభుజ రూపమును చూపెను.*
*🌷. భాష్యము : శ్రీకృష్ణుడు దేవకీ, వసుదేవులకు పుత్రునిగా లభించినప్పుడు తొలుత చతుర్భుజ నారాయణుని రూపమున దర్శనమొసగెను. కాని తల్లిదండ్రుల కోరికపై అతడు తిరిగి సామాన్యబాలునిగా మారెను. అదేవిధముగా అర్జునుడు సైతము చతుర్భుజరూపమును గాంచుట యందు ఎక్కువ ఆసక్తిని కలిగియుండడని శ్రీకృష్ణుడు ఎరిగియుండెను. కాని అతడు కోరియున్నందున తన చతుర్భుజరూపమును చూపి పిదప తన సహజ ద్విభుజ రూపమును పొందెను.*
*ఈ శ్లోకమున “సౌమ్యవపు:” అను పదము ప్రధానమైనది. “సౌమ్యవపు:” అనగా అత్యంత సుందరమైన రూపమని భావము. శ్రీకృష్ణుడు ధరత్రిపై నిలిచినపుడు ప్రతియొక్కరు అతని అత్యంత సుందరరూపముచే ఆకర్షితులైరి. జగన్నిర్దేశకుడైనందునే ఆ భగవానుడు తన భక్తుడైన అర్జునుని భయము ను తొలగించి తన సుందరరూపమును అతనికి చూపెను. ప్రేమాంనజనమును కనులకు పూసుకొనిన మనుజుడే శ్రీకృష్ణభగవానుని దివ్యసుందరరూపమును గాంచగలడని బ్రహ్మసంహిత(5.38) యందు తెలుపబడినది. (ప్రేమాంజనచ్చురితభక్తివిలోచనేన).*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 464 🌹*
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 50 🌴*
*50. sañjaya uvāca*
*ity arjunaṁ vāsudevas tathoktvā svakaṁ rūpaṁ darśayām āsa bhūyaḥ*
*āśvāsayām āsa ca bhītam enaṁ bhūtvā punaḥ saumya-vapur mahātmā*
*🌷 Translation : Sañjaya said to Dhṛtarāṣṭra: The Supreme Personality of Godhead, Kṛṣṇa, having spoken thus to Arjuna, displayed His real four-armed form and at last showed His two-armed form, thus encouraging the fearful Arjuna.*
*🌹 Purport : When Kṛṣṇa appeared as the son of Vasudeva and Devakī, He first of all appeared as four-armed Nārāyaṇa, but when He was requested by His parents, He transformed Himself into an ordinary child in appearance. Similarly, Kṛṣṇa knew that Arjuna was not interested in seeing a four-handed form, but since Arjuna asked to see this four-handed form, Kṛṣṇa also showed him this form again and then showed Himself in His two-handed form.*
*The word saumya-vapuḥ is very significant. Saumya-vapuḥ is a very beautiful form; it is known as the most beautiful form. When He was present, everyone was attracted simply by Kṛṣṇa’s form, and because Kṛṣṇa is the director of the universe, He just banished the fear of Arjuna, His devotee, and showed him again His beautiful form of Kṛṣṇa. In the Brahma-saṁhitā (5.38) it is stated, premāñjana-cchurita-bhakti-vilocanena: only a person whose eyes are smeared with the ointment of love can see the beautiful form of Śrī Kṛṣṇa.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 819 / Sri Siva Maha Purana - 819 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 26 🌴*
*🌻. విష్ణువు యొక్క మోహమును తొలగించుట - 1 🌻*
*వ్యాసుడిట్లు పలికెను - ఓ బ్రహ్మపుత్రా! నీకు నమస్కారము. ఓ శివభక్తాగ్ర గణ్యా! నీవు ధన్యుడవు. నీవు మహాదివ్యము. శుభకరమునగు ఈ శంకరుని గాథను వినిపించి నావు (1). ఓ మునీ! ఇపుడు విష్ణుచరితమును ప్రేమతో చెప్పుము. ఆయన బృందను మోహింప జేసిన తరువాత ఏమి చేసెను? ఎచటకు వెళ్లెను? (2).*
*సనత్కుమారుడిట్లు పలికెను- ఓ వ్యాసా! వినుము. నీవు గొప్ప బుద్ధిశాలివి. శివభక్తులలో ఉత్తముడవు. శంభుని చరితముతో విరాజిల్లునది, మిక్కిలి పవిత్రమైనది అగు విష్ణు చరితమును చెప్పెదను (3) శరణాగతవత్సలుడు, మహేశ్వరుడునగు శంభుడు బ్రహ్మాది దేవతలు మిన్నకుండగా మిక్కిలి ప్రసన్నుడై ఇట్లు పలికెను (4).*
*శంభుడు ఇట్లు పలికెను- ఓ బ్రహ్మా! సర్వదేవ పుంగవులారా! జలంధరుడు నా అంశనుండి జన్మించిన వాడే అయిననూ, మీ కొరకై వానిని సంహరించితిని. నేను నిస్సందేహముగా సత్యమును పలుకుచున్నాను (5). ఓ పుత్రులారా! మీకు సుఖము కలిగినదా? లేదా ? ఓ దేవతలారా! సత్యమును పలుకుడు. సర్వదా నిర్వికారుడనగు నా లీల మీకొరకు మాత్రమే గదా! (6)*
*సనత్కుమారుడిట్లు పలికెను - అపుడు బ్రహ్మ మొదలగు దేవతలు ఆనందముతో విప్పారిన నేత్రములు గల వారై రుద్రునకు తలవంచి నమస్కరించి విష్ణువృత్తాంతమును చెప్పిరి (7).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 819 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 26 🌴*
*🌻 The Vanishing of Viṣṇu’s delusion - 1 🌻*
Viṣṇu said:—
1. O son of Brahmā, obeisance be to you. O excellent devotee of Śiva, you are blessed, since you have narrated this highly divine and auspicious story of Siva.
2. O sage, now narrate lovingly the story of Viṣṇu. After enchanting Vṛndā what did he do? Where did he go?
Sanatkumāra said:—
3. O Vyāsa, listen. O intelligent excellent devotee of Śiva, listen to the good story of Viṣṇu mingled with the story of Śiva.
4. When Brahmā and other gods became silent, lord Śiva, favourably disposed to those who seek refuge in him, was delighted and said.
Śiva said:—
5. O Brahmā, O ye excellent gods, it is for you that Jalandhara has been killed by me although he was a part of myself. Truth. It is the truth that I say.
6. O dear gods, tell me the truth. Have or have not you attained happiness? It is for you that I indulge in sports though I am always free from all aberrations.
Sanatkumāra said:—
7. Then Brahmā and other gods, with eyes blooming with delight, bowed to Śiva with bent heads and mentioned to him the activities of Viṣṇu.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 77 / Osho Daily Meditations - 77 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 77. సహచర్యం 🍀*
*🕉. ప్రజలు కలిసి పనులు చేయడం లేదా ఏమీ చేయకుండా కలిసి ఉండటం అనే భాషను పూర్తిగా మర్చిపోయారు. 🕉*
*ప్రజలు ఏమీ చేయకుండా ఎలా ఉండాలో మరిచి పోయారు. చేసేదేమీ లేకుంటే ప్రేమించుకుంటారు. అప్పుడు ఏమీ జరగదు, మరియు వారు ప్రేమ అంటే విసుగు చెందుతారు. స్త్రీ మరియు పురుషుడు వేర్వేరు-వేరు మాత్రమే కాదు, వ్యతిరేకం; వారు ఒకరితో ఒకరు సరిపోరు. కానీ అదే అందం - వారు ఒకరితో ఒకరు కలిసినపుడు అది ఒక అద్భుతం, ఒక మాయా క్షణం. లేకుంటే గొడవపడి కొట్లాడుకుంటారు. ఇది సహజమైనది. అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వారు వేర్వేరు మనస్సులను కలిగి ఉంటారు. వారి దృక్కోణాలు వ్యతిరేక ధ్రువాలు. వారు దేనితోనూ ఏకీభవించలేరు, ఎందుకంటే వారి మార్గాలు వేరు, వారి తర్కం వేరు.*
*లోతైన సామరస్యానికి సరిపోయేలా చేయడం, లోతైన సామరస్యంతో ఉండటం దాదాపు అద్భుతం. ఇది కోహినూర్ వంటిది, ఒక గొప్ప వజ్రం, మరియు దానిని ప్రతిరోజూ అడగకూడదు. నిత్యంలో భాగంగా అడగకూడదు. దాని కోసం వేచి ఉండాలి. నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు గడిచిపోతాయి, ఆప్పుడు అది అకస్మాత్తుగా వస్తుంది. హఠాత్తుగా, కారణం లేకుండా వస్తుంది. చింతించకండి - అది స్వయంగా చూసుకుంటుంది. మరియు ప్రేమను కోరుకునేవారిగా మారకండి, లేకుంటే మీరు దానిని పూర్తిగా కోల్పోతారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 77 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 77. TOGETHERNESS 🍀*
*🕉 People have completely forgotten the language of doing things together or not doing anything but just being together. 🕉*
*People have forgotten how to just be. If they have nothing to do, they make love. Then nothing happens, and by and by they are frustrated by love itself. Man and woman are different-not only different, they are opposite; they cannot fit together. And that's the beauty-when they fit together it is a miracle, a magic moment. Otherwise they conflict and fight. That's natural and can be understood, because they have different minds. Their outlooks are polar opposites. They cannot agree on anything, because their ways are different, their logic is different.*
*To fit in a deep attunement, to fall in deep harmony, is almost miraculous. It is like a Kohinoor, a great diamond, and one should not ask for it every day. One should not ask for it as part of a routine. One should wait for it. Months, sometimes years, pass, and then suddenly it is there. And it is always out of the blue, uncaused. Don't be worried-it will take care of itself. And don't become a seeker of love, or else you will miss it completely.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 505 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 505 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 104. స్వాధిష్ఠానాంబుజగతా, చతుర్వక్త్ర మనోహరా ।*
*శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104 ॥ 🍀*
*🌻 505. 'చతుర్వక్త్ర మనోహరా' - 2 🌻*
*ఆకాశము నందు నాలుగు భూతములు యిమిడి యున్నవి. వాయువు నందు మిగిలిన మూడును. అట్లే యితర భూతములను అవగాహన చేసుకొనవలెను. స్వాధిష్ఠానము విశుద్ధి నుండి నాలుగవ చక్రము. అనగా యిందు ఆకాశము, వాయువు, అగ్ని, జలము వ్యక్తమై పృథివి అవ్యక్తముగ యుండును. కనుక నాలుగు ముఖములు. నాలుగు ముఖముల తల్లి మనోజ్ఞముగ నుండుటకు కారణము ఘనీభవింపక యుండుట చేతనే. రూపము కరుడు గట్టిన తరువాత అందము కోల్పోవును. లేతగా యున్నప్పుడు అందముండును. పృథివీ తత్త్వము లేశమాత్రమే యున్నప్పుడు అంద మెక్కువగా గోచరించును. లేతదనమునకు ముదురుతనమునకు గల తేడా సులభముగనే యుండును కదా!*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 505 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻104. Svadhishtananbujagata chaturvaktra manohara*
*shuladyayudha sanpanna pitavarna tigarvita ॥ 104 ॥ 🌻*
*🌻 505. Chaturvaktra manohara - 2 🌻*
*There are four elements in the sky. The other three in the air. Similarly other elements should be understood. Swadhisthana is the fourth chakra from Vishuddhi. That is, the sky, air, fire, and water are manifested and the earth is invisible. So four faces. The reason for the four-faced mother's beauty is because of the liquidity. The beauty loses after the appearance becomes solidified. It's beautiful when it's tender. Beauty is most visible when the earthy spirit is barely present. The difference between tender and tough is easy!*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments