top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 29, OCTOBER 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 29, OCTOBER 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 29, OCTOBER 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 449 / Bhagavad-Gita - 449 🌹

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 35 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 35 🌴

🌹. శ్రీ శివ మహా పురాణము - 805 / Sri Siva Maha Purana - 805 🌹

🌻. పాతివ్రత్య భంగము - 3 / Outraging the modesty of Vṛndā - 3 🌻

3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 62 / Osho Daily Meditations  - 62 🌹

🍀 62. ఏకపాత్రాభినయం / 62. MONODRAMA 🍀

4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 5 🌹

🌻 495. 'మణిపూరాబ్జ నిలయా' - 5 / 495.  Manipurabja - 5 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 29, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻*


*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 29 🍀*


*55. వ్రతచారీ వ్రతధరో లోకబంధురలంకృతః |*

*అలంకారాక్షరో వేద్యో విద్యావాన్ విదితాశయః*

*56. ఆకారో భూషణో భూష్యో భూష్ణుర్భువనపూజితః |*

*చక్రపాణిర్ధ్వజధరః సురేశో లోకవత్సలః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : సిద్ధికి తొలిమెట్టు - మనస్సు నిశ్చలమై స్థిరత నొందడం సిద్ధికి తొలిమెట్టు గాని సాధనకు 'తొలిమెట్టు' కాదు. సాధన ప్రారంభంలోనే ఈ లక్షణాలు అలవడడం ఎక్కడనో గాని జరగదు. వీటిని అనుభవానికి తెచ్చుకోడానికి సాధకుడు ఎంతో కాలం శ్రమ చేయవలసి వుంటుంది. కలిగిన అనుభవం స్థిరం కావడానికి మరి కొంతకాలం పట్టక తప్పదు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్‌ ఋతువు, దక్షిణాయణం,

ఆశ్వీయుజ మాసం

తిథి: కృష్ణ పాడ్యమి 23:54:43 వరకు

తదుపరి కృష్ణ విదియ

నక్షత్రం: భరణి 28:42:41 వరకు

తదుపరి కృత్తిక

యోగం: సిధ్ధి 20:00:02 వరకు

తదుపరి వ్యతీపాత

కరణం: బాలవ 12:53:37 వరకు

వర్జ్యం: 15:01:48 - 16:32:56

దుర్ముహూర్తం: 16:13:48 - 17:00:00

రాహు కాలం: 16:19:35 - 17:46:13

గుళిక కాలం: 14:52:57 - 16:19:35

యమ గండం: 11:59:41 - 13:26:19

అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22

అమృత కాలం: 24:08:36 - 25:39:44

మరియు 25:41:06 - 27:14:22

సూర్యోదయం: 06:13:09

సూర్యాస్తమయం: 17:46:13

చంద్రోదయం: 18:09:48

చంద్రాస్తమయం: 06:26:53

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు: కాలదండ యోగం - మృత్యు

భయం 28:42:41 వరకు తదుపరి ధూమ్ర

యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 449 / Bhagavad-Gita - 449 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 35 🌴*


*35. సంజయ ఉవాచ*

*ఏతచ్చ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన: కిరీటీ |*

*నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీత: ప్రణమ్య ||*


*🌷. తాత్పర్యం : ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను; ఓ రాజా! దేవదేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకుళిత హస్తుడై మరల మరల వందనముల నొసగెను. భీతిని కూడినవాడై అతడు డగ్గుత్తికతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను.*


*🌷. భాష్యము : పూర్వమే తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుని విశ్వరూపముచే సృష్టింపబడిన పరిస్థితి కారణముగా అర్జునుడు సంభ్రమమునకు గురియయ్యెను. తత్కారణముగా అతడు కృష్ణునకు గౌరవపూర్వక వందనములను మరల మరల అర్పించుట మొదలిడెను. అతడు స్నేహితునివలె గాక, అద్భుతరసభావితుడైన భక్తునిగా గద్గదస్వరముతో ప్రార్థింపదొడగెను.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 449 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 35 🌴*


*35. sañjaya uvāca*

*etac chrutvā vacanaṁ keśavasya kṛtāñjalir vepamānaḥ kirīṭī*

*namaskṛtvā bhūya evāha kṛṣṇaṁ sa-gadgadaṁ bhīta-bhītaḥ praṇamya*


*🌷 Translation : Sañjaya said to Dhṛtarāṣṭra: O King, after hearing these words from the Supreme Personality of Godhead, the trembling Arjuna offered obeisances with folded hands again and again. He fearfully spoke to Lord Kṛṣṇa in a faltering voice, as follows.*


*🌹 Purport : As we have already explained, because of the situation created by the universal form of the Supreme Personality of Godhead, Arjuna became bewildered in wonder; thus he began to offer his respectful obeisances to Kṛṣṇa again and again, and with faltering voice he began to pray, not as a friend, but as a devotee in wonder.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 805 / Sri Siva Maha Purana - 805 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 23 🌴*


*🌻. పాతివ్రత్య భంగము - 3 🌻*


*బృంద ఇట్లు పలికెను - ఓ మహర్షీ! దయాసముద్రా! ఇతరుల దుఃఖమును పోగొట్టువాడా! ఈ దుష్టులు కలిగించిన ఘోర భయమునుండి నీవు నన్ను రక్షించితివి (18). ఓ దయానిధీ! నీవు అన్ని విధములుగా సమర్థుడవు ; సర్వజ్ఞుడవు. నేను నీకు ఒక విన్నపమును చేసెదును. దయతో వినుము (19). ఓ ప్రభూ! నా భర్తయగు జలంధరుడు రుద్రునితో యుద్ధమును చేయుటకు వెళ్లినాడు. ఓ గొప్ప వ్రతము గలవాడా! ఆతడు అచట యుద్ధములో ఎట్లు ఉన్నాడో నాకు చెప్పుము (20).*


*సనత్కుమారుడిట్లు పలికెను- ఆ ముని ఆమె మాటలను విని కపట మౌనమును దాల్చెను. తన స్వార్థమును సాధించే ఉపాయములలో దిట్టయగు ఆతడు దయతో పైకి చూచెను (21). వెంటనే రెండు గొప్ప కోతులు వచ్చి ఆతనికి నమస్కరించి ఎదుట నిలబడెను. అవి ఆతని కనుబొమల కదలిక ద్వారా ఈయబడిన ఆజ్ఞను స్వీకరించి ఆకసమునకు ఎగిరినవి (22). అవి అర్ధక్షణకాలము గడిచిన తరువాత మరల వచ్చి ఆతని ఎదుట నిలబడెను. ఓ మహర్షీ! అవి జలంధరుని మొండెమును, తలను, చేతులను తీసుకొని వచ్చెను (23). సముద్రపుత్రుడగు జలంధరుని ఆ శిరస్సును, మొండెమును, చేతులను గాంచి ఆమె భర్త మరణముచే దుఃఖితురాలై మూర్ఛిల్లి నేలపై కూలబడెను (24). బృంద ఇట్లు పలికెను- ఓ ప్రభూ! పూర్వము నీవు సుఖకరమగు సల్లాపముతో నాకు వినోదమును కలిగించెడివాడవు. నిర్దోషిని, ప్రియురాలను అగు నాతో నీవు ఇపుడు ఏల మాటలాడుట లేదు? (25) దేవతలను, గంధర్వులను, విష్ణువును కూడ జయించిన, త్రిలోకవిజేతయగు ఆ జలంధరుడు ఈ నాడు ఒక తాపసిచే ఎట్లు సంహరింపబడినవాడు? (26).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 805 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 23 🌴*


*🌻 Outraging the modesty of Vṛndā - 3 🌻*


Vṛndā said:—

18. “O leader of sages, O ocean of mercy, O remover of harassment from others, I have been saved by you from this terrible danger from the wicked demons.


19. You are competent in every respect. You are omniscient. Yet I wish to submit something. Be pleased to hear it.


20. O lord, Jalandhara my husband has gone to fight Śiva. O holy one of good rites, how does he fare in the war? Please tell me.”


Sanatkumāra said:—

21. On hearing her words, the sage feigned a deceptive silence. Fully aware of the means of achieving his selfish ends he looked up sympathetically.


22. In the meantime two lordly monkeys came there and stood bowing down in front of him. At a significant gesture from his eyebrows, the monkeys rose into the sky again.


23. O great sage, within a trice, they came back taking with them his head, body and limbs and stood in front of the sage.


24. On seeing the head, body and limbs of her husband, Vṛndā fell unconscious, extremely pained at the misery of her lord.


Vṛndā said:—

25. “O lord, formerly you used to humour me with pleasant chats. How is it that you do not speak to me now, to your pious beloved?


26. How is it that you, by whom all the gods including the Gandharvas and Viṣṇu had been defeated, you who had conquered the three worlds, have now been killed by a poor sage?


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 62 / Osho Daily Meditations  - 62 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 62. ఏకపాత్రాభినయం 🍀*


*🕉. మతపరంగా ఉండటం చాలా కష్టం, ఎందుకంటే మీరు ప్రయోగాలు చేసేవారు మరియు ప్రయోగాలు చేసేవారు, శాస్త్రవేత్త మరియు ప్రయోగం రెండూ అయి ఉండాలి. లోపల వేరు లేదు. మీరు ఏకపాత్రాభినయం చేస్తున్నారు. 🕉*


*ఒక సాధారణ నాటకంలో చాలా మంది నటులు ఉంటారు మరియు పాత్రలు విభజించబడతాయి. కానీ ఏకపాత్రాభినయంలో మీరు ఒంటరిగా ఉంటారు. అన్ని పాత్రలూ నువ్వే పోషించాలి. ఒక జెన్ సన్యాసి రోజూ ఉదయాన్నే ‘బొకుజు, నువ్వు ఎక్కడ ఉన్నావు?’ అని గట్టిగా పిలిచేవాడు. అది అతని స్వంత పేరు. అతను, 'అవును, సార్? నేను ఇక్కడ ఉన్నాను.' అనేవాడు. అప్పుడు అతను, 'బొకుజు, గుర్తుంచుకో, మరొక రోజు ఇవ్వబడుతుంది. తెలివిగా మరియు అప్రమత్తంగా ఉండు మరియు మూర్ఖంగా ఉండకు!' అన్నాడు. అప్పుడు అతను, 'అవును, సార్, నేను నా వంతు ప్రయత్నం చేస్తాను' అని చెప్పాడు. కానీ నిజానికి అక్కడ మరెవరూ లేరు! అతను ఒంటరిగా వున్నాడు. అతనికి పిచ్చి పట్టిందని శిష్యులు అనుకోవడం మొదలుపెట్టారు. కానీ అతను ఏకపాత్రాభినయం మాత్రమే చేస్తున్నాడు. అది అతని అంతర్గత పరిస్థితి.*


*మీరే మాట్లాడేవారు, వినేవారు మీరే, సేనాధిపతులు మీరే, ఆజ్ఞాపించేవారు మీరే. ఇది కష్టం, ఎందుకంటే పాత్రలు మిశ్రమంగా ఉంటాయి, అతివ్యాప్తి చెందుతాయి. మరొకరు నాయకత్వం వహించినప్పుడు మరియు మీరు నాయకుడిగా ఉన్నప్పుడు ఇది చాలా సులభం. పాత్రలు విభజించబడితే, విషయాలు స్పష్టంగా ఉంటాయి. ఏదీ అతివ్యాప్తి చెందదు; మీరు మీ పాత్రను పూర్తి చేయాలి, ఆమె తన పాత్రను పూర్తి చేయాలి. ఇది సులభం; పరిస్థితి ఏకపక్షంగా ఉంది. మీరు రెండు పాత్రలను పోషించినప్పుడు, పరిస్థితి సహజంగా ఉంటుంది, ఏకపక్షంగా ఉండదు మరియు వాస్తవానికి ఇది మరింత క్లిష్టంగా ఉంటుంది. అయితే మీరు నేర్చుకుంటారు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 62 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 62. MONODRAMA 🍀*


*🕉 It is very dificult to be religious, because you have to be both the experimenter and the experimented upon, both the scientist and the experiment. There is no separation inside. You are playing a monodrama. 🕉*


*In an ordinary drama there are many actors, and the roles are divided. In a monodrama you are alone. All the roles have to be played by you. A Zen monk used to call out loudly every morning, "Bokuju, where are you?" That was his own name. And he would answer, "Yes, sir? I am here." Then he would say, "Bokuju, remember, another day is given. Be aware and alert and don't be foolish!" He would then say, "Yes, sir, I will try my best." And there was nobody else there! His disciples started thinking he had gone mad. But he was only playing a monodrama. And that's the inner situation.*


*You are the talker, you are the listener, you are the commander, and you are the commanded. It is difficult, because roles tend to get mixed, to overlap. It is very easy when somebody else is the led and you are the leader. If the roles ,are divided, things are clear-cut. Nothing overlaps; you have to finish your role, she has to finish hers. It is easy; the situation is arbitrary. When you play both roles, the situation is natural, not arbitrary, and of course it is more complicated. But you will learn, by and by.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 495 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam  - 495 - 5 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।*

*వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ 🍀*


*🌻 495. 'మణిపూరాబ్జ నిలయా' - 5 🌻*


*మానవుడు క్షర విద్యతోపాటు అక్షర విద్యను కూడ అభ్యసింపవలెను.  అక్షరాభ్యాసమనగా అక్షరత్వమును అభ్యసించుట. అందులకే తన జన్మము. కేవలము వ్రాత నేర్చుటకు కాదు. తెలియని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అనాలోచితముగ పిల్లలను చిన్నతనము నుండియే అవిద్యా మార్గములు ప్రవేశింప జేయుదురు. కలియుగము కదా! ఇచ్చట వసించియుండు శ్రీమాత ఇహపర సౌఖ్యముల నీయగలదు. కనుకనే ఈ పద్మమున వసించి యుండు శ్రీమాత నారాధించుట ప్రసిద్ధి గాంచినది.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 495 - 5 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻102. Manipurabja nilaya vadanatraya sanyuta

vajradikayudhopeta dayaryadibhiravruta ॥ 102 ॥ 🌻*


*🌻 495.  Manipurabja - 5 🌻*


*A person should go through the superficial education as well as the eternal education. Aksharabhyasa means learning eternity. His birth is for that reason. Not just to learn to write. Ignorant parents and teachers unintentionally lead children into uneducated paths from an early age. Kali Yuga! Srimata who lives here can give comforts that are physical and beyond. That's why it has become famous to pray to Sri Mata who is sitting on this lotus.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Komentáře


bottom of page