🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 238 / DAILY WISDOM - 238 🌹
🍀 📖 ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 25. మీరు సర్వత్రా ఉన్న దాని వైపు ఆకర్షితులయ్యారు 🌻
ప్రారంభంలో మీరు పరమాత్మ గురించి ఆలోచించినప్పుడు, మీరు ఆ జీవిని దేశ కాలాలకు లోబడి ఊహించుకుంటారు. దేవుడు చాలా పెద్దవాడు, చాలా దూరంగా ఉన్నాడు, చాలా గొప్పవాడు, ఆరాధ్యుడు; మీరు ఆ సర్వశక్తిమంతుడికి మీ సాష్టాంగ ప్రణామాలను ప్రీతికరమైనదిగా అర్పిస్తారు. ఉపనిషత్తులు కూడా కొన్నిసార్లు సర్వోత్కృష్టమైన పరమాత్మను అత్యంత ప్రీతిపాత్రుడిగా సూచిస్తాయి. వనం అంటే ఆరాధ్యమైనది అని అర్థం; భగవంతుడు అత్యంత ఆరాధనీయమైనవాడు. మీచే భగవంతుడు అని పిలవబడేది, మీ దృష్టిని దాని స్వంత దిశలో ఆకర్షించేది, విషయాల యొక్క అంతిమ వాస్తవికత అయినది, తన స్వయమే విశ్వమైనది, అయిన ఈ ఉనికి అత్యంత అద్భుతమైనది, ప్రియమైనది, ప్రేమగలది, అందమైనది, అన్నీ జీవులకంటే అత్యంత ముఖ్యమైనది.
మరియు ఈ అత్యుత్తమ జీవిని అత్యంత ప్రీతిపాత్రుడిగా ప్రేమించే వ్యక్తిని ప్రపంచం మొత్తం ప్రేమిస్తుంది. మీరు సర్వం వ్యాపించి ఉన్న దాని వైపు ఆకర్షితులవుతారు కాబట్టి మీరు మీ వైపుకు వస్తువులను ఆకర్షిస్తారు. ఈ ప్రపంచంలో స్నేహితులను సంపాదించుకోవడానికి ఇదే అత్యుత్తమ మార్గం. మీరు దాని కోసం ఏవేవో పుస్తకాలు మొదలైనవాటిని చదవనవసరం లేదు. మీరు ప్రతిచోటా, సంపూర్ణంగా ఉన్న దాని వైపు ఆకర్షితులైతే, ఆ అంతిమ వాస్తవికత పట్ల మీకు కలిగే ఆకర్షణ యొక్క సహజ పర్యవసానంగా ప్రపంచం మొత్తం మీ వైపు ఆకర్షితులవుతుంది. మీరు ఇతరులచే ప్రేమించబడాలంటే ఇలా నిజాయితీగా ప్రేమించవచ్చు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 238 🌹
🍀 📖 from Lessons on the Upanishads 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 25. You are Attracted towards That Which is Everywhere 🌻
In the beginning when you conceive of the Supreme Being, you have a spatio-temporal imagination of that Being. God is very big, very large, very far away, very great, adorable; you offer your prostrations to that Almighty as something lovable. Even the Upanishads sometimes refer to the Supreme Absolute as the most lovable. Vanam means adorable; that Being is the most adorable. That thing which you call God, that thing which pulls your attention in its own direction, that which is the Ultimate Reality of things, that which is the Self of the cosmos, is the most magnificent, beloved, lovable, beautiful, most essential of all beings.
And one who loves this Ultimate Being as the most lovable is loved by the whole world. You attract things towards yourself because you are attracted towards that which is everywhere. This is the best way of making friends in this world. You need not read Dale Carnegie, etc. If you are attracted towards that which is everywhere, wholly and solely, the entire world will be attracted towards you as a natural consequence of the attraction that you feel towards that Ultimate Reality. This is how you can honestly love it, if you want to be loved by others.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Commentaires