Mauni Amavasya:: దేవతలు భూవిపైకి దిగి వచ్చే రోజు.. మౌనీ అమావస్య ప్రత్యేకతలు ఇవే! (New Moon Day: The day when the gods descend on earth.. )
- Prasad Bharadwaj
- Jan 29
- 1 min read

🌹Mauni Amavasya:: దేవతలు భూవిపైకి దిగి వచ్చే రోజు.. మౌనీ అమావస్య ప్రత్యేకతలు ఇవే!🌹
మౌని అమావస్య నాడు దేవతలు స్వయంగా భూమిపైకి దిగి భక్తుల తపస్సును ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. ముఖ్యంగా గంగ, యమునా, సరస్వతీ సంగమ ప్రాంతం హిందూ దేవతలతో పవిత్రంగా ముడిపడి ఉంది.
🌻మౌని అమావస్య ఎందుకంత ప్రత్యేకం? 🌻
మౌనీ అమావాస్య హిందూ ధర్మంలోని ఓ పవిత్రమైన రోజు. ఆ రోజు మౌనంగా ఉండటం, ఆత్మచింతన చేయడం, పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముఖ్యమైన ఆచారాలు. మౌనంగా ఉండటం ద్వారా మనసు శాంతి పొందుతుందని, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని నమ్మకం. ఆ రోజు పవిత్ర గంగ, యమునా, సరస్వతీ నదుల సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆ రోజు చేసిన తపస్సు, ధ్యానం, జపం ద్వారా విశేషమైన ఫలితం పొందవచ్చని భక్తుల విశ్వాసం. ఇది ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్లేందుకు చాలా ప్రాముఖ్యమైన రోజుగా హిందూ పండితులు చెబుతుంటారు. మౌనీ అమావస్య నాడు పితృదేవతలకు తర్పణం చేయడం చాలా శుభప్రదమట. ఇక దానం చేయడం ద్వారా పుణ్యం పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు.
🍀 రాముడితో సంబంధం 🍀
మౌనీ అమావాస్య వేదకాలం నుంచే ఉన్న ఆచారం. ఈ పండుగ వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. వేదాలు, పురాణాల ప్రకారం మౌనం ఆధ్యాత్మిక శక్తి పెరుగుదలకు మార్గం. పాండవులు అరణ్యవాసంలో తపస్సు చేశారని హిందూ పురాణాల్లో రాసి ఉంది. అలాగే రాముడు తన అరణ్యవాసంలో ధ్యానం చేసినట్టు కూడా ఉంది. ఈ మౌనీ అమావస్య సంప్రదాయానికి ఈ పురాణ కథలే ప్రేరణ అని చెప్పవచ్చు.
🌏 ఆధ్యాత్మిక శక్తి కోసం 🌏
మౌనీ అమావాస్య నాడు యోగులు, రుషులు తపస్సు చేసి తమ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకున్నారని హిందూ పండితులు వివరిస్తున్నారు. ఈ రోజున సాధారణంగా విష్ణుమూర్తిని తలుచుకోని ధ్యానం చేస్తే మహత్తరమైన ఫలితం పొందవచ్చని నమ్మకం ఉంది. ఇక శివుడు తపస్సు చేసిన సందర్భాలు మౌనం ఆధ్యాత్మిక మూలాలను గుర్తుచేస్తాయి. మహాభారతంలో భీష్ముడి తపస్సు, మౌనంగా ఉండటం, ఆత్మాన్వేషణ అనేవి కీలకంగా కనిపిస్తాయి. ఇదంతా మౌనానికి మౌని అమావాస్యకు ఉన్న శక్తి.
🌹 🌹 🌹 🌹 🌹
Comments