🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 107 / Osho Daily Meditations - 107 🌹
✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 107. విపరీతమైన ప్రేమ 🍀
🕉 ప్రేమంటే ఏమిటో మూర్ఖులకు మాత్రమే తెలుసు, ఎందుకంటే ప్రేమ ఒక రకమైన పిచ్చి. 🕉
బహుశా మీరు ప్రేమ యొక్క శిఖరాలను చేరుకోలేదు అందుకని దాని కోసం మీకు చాలా కోరిక ఉండవచ్చు. మీరు ప్రేమలో ఉన్నారు, కానీ అది విపరీతమైనదీ లేక అద్భుతమైనదీ కాదు. ఇది ఓ మోస్తరుగా ఉంది. అది దహించే అగ్నిలా ఉండేది కాదు. మీరు దానిలో ఉన్నారు, కానీ మీరు దాని ద్వారా నాశనం కాలేదు; మీకు మీరే నిలదొక్కుక్కున్నారు. మీరు దానిలో తెలివిగా ఉన్నారు, మూర్ఖులు కాలేదు. మరియు ప్రేమ అంటే ఏమిటో మూర్ఖులకు మాత్రమే తెలుసు, ఎందుకంటే ప్రేమ ఒక రకమైన పిచ్చి.
మీరు మరీ తెలివిగా ఉంటే, మీరు కొంతవరకే అనుమతించగలరు, ఆ తర్వాత మీరు ఆపివేస్తారు. మీ మనసు ఇలా చెబుతుంది 'ఇది చాలా ఎక్కువ అయ్యింది. ఇంతకు మించి వెళ్లడం ప్రమాదకరం.' ప్రేమకు తృప్తికరమైన ఒక అనుభవం మాత్రమే తెలుసు, అది ఒక్కసారి అయినా శిఖరానికి, అంతిమ శిఖరానికి వెళ్లడం. అప్పుడు శక్తిలో గొప్ప మార్పు వస్తుంది. శిఖరంలో ఒక్కసారి ప్రేమను తెలుసుకోవడం చాలు; అప్పుడు మళ్లీ మళ్లీ అందులోకి వెళ్లాల్సిన అవసరం లేదు. అనుభవం మీ మొత్తం జీవిని మారుస్తుంది. కాబట్టి తక్కువ తెలివిగా ఉండండి. తెలివి గురించి మర్చిపోండి; మరింత అయోమయంగా ఉండండి!
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 107 🌹
📚. Prasad Bharadwaj
🍀 107. OUTLANDISH LOVE 🍀
🕉 Only fools know what love is, because love is a kind if madness 🕉
Perhaps you have never reached the peaks of love, and you have a great longing for it. You have been in love, but it has never been outlandish, it has never been fantastic, it has never been far out. It has been Iukewarm. It was not like a fire that consumes. You were in it, but you were not destroyed by it; you managed yourself. You have been clever in it, you have not been a fool. And only fools know what love is, because love is a kind of madness.
If you are too clever, you can allow only so far and then you stop. Your whole mind says, "Now this is too much. Going beyond this point is dangerous." Love knows only one experience that is satisfying, and that is to go to the very peak, to the ultimate peak, even once. Then there is a great change in energy. To know love once at the climax is enough; then there is no need to go into it again and again. The experience simply changes your whole being. So be less clever. Forget about cleverness; be more muddle-headed!
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments