top of page
Writer's picturePrasad Bharadwaj

అవగాహన మరియు పారవశ్యం ఒకటిగా మారుతుంది. / Awareness and Ecstasy Become One

🌹 అవగాహన మరియు పారవశ్యం ఒకటిగా మారుతుంది. / Awareness and Ecstasy Become One 🌹


ప్రసాద్‌ భరధ్వాజ


'మీరు ఆనందంతో, పారవశ్యంతో ప్రవహిస్తున్నప్పుడు, అది నిజంగా ఎక్కువగా ఎరుకగా ఉండ వలసిన, మరియు అవగాహన చేసుకోవలసిన క్షణం. కానీ ప్రజలు సరిగ్గా వ్యతిరేకం చేస్తారు. సంతోషంగా ఉన్నప్పుడు అవగాహన గురించి ఎవరూ పట్టించుకోరు. అదే వారు వేదనలో ఉన్నప్పుడు, వారు ఖచ్చితంగా తెలుసుకోవడం మరియు వేదన నుండి బయట పడవలసిన సమయం అని ఆలోచించడం ప్రారంభిస్తారు. కానీ ఆ బాధ నుంచి ఎవరూ నేరుగా బయటపడలేక పోయారు.


“మొదట, పారవశ్యత నుండి బయటపడి అవగాహన వైపు మీ దృష్టి పెట్టాలి. మీరు మీ ఆనందకరమైన క్షణాల గురించి లోతుగా తెలుసుకో గలిగితే, నిరాశ, పతనాలు మీ జీవితంలోకి రావు. అదే వేదన నుండి బయటపడటానికి తలుపు. కాబట్టి ఇది సరళమైన మార్గం:


'సంతోషంగా ఉన్నప్పడు, గమనింపుగా ఉండండి.'


'ఆనందంగా ఉన్నప్పుడు, అవగాహనతో ఉండండి.'


'ప్రేమిస్తున్నప్పుడు, ఎరుకతో ఉండండి.'


'అవగాహనను ఒక రకమైన భంగం' అని చెప్పి పక్కన పెట్టవద్దు; నేను గొప్ప పారవశ్యంలో ఉన్నాను.’ అనే ఎరుక కలవరంలా మారుతుంది అనిపిస్తుంది; కానీ అలా జరగదు. ఇది ప్రారంభంలో అలా కనిపించ వచ్చు, కానీ త్వరలో ఇది మీ పారవశ్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని మీరు చూస్తారు. అంతిమంగా అవగాహన మరియు పారవశ్యం ఒకటిగా మారతాయి. అప్పుడు పతనాలు, నిస్పృహ క్షణాలు, వేదనలు అన్నీ మాయమవుతాయి.


🌹🌹🌹🌹🌹





🌹 Awareness and Ecstasy Become One 🌹


“When you are flowing with joy, blissfulness, that is the moment to be aware, but people do exactly the opposite. When they are happy who cares about awareness? And when they are in anguish, then certainly they start thinking it is time to be aware and get out of anguish. But nobody has ever been able to get out from anguish directly.


“First, one has to get into awareness from ecstasy. If you can be aware of your joyful moments in the first place, the depression, the downs will not come. The door to awareness is in ecstacy. So this is the simplest way:


“Be happy and be aware."


" “Rejoice and be aware."


“Love and be aware."


“Don’t put awareness aside saying, ‘This is a kind of disturbance; I am in such a great ecstasy.’ Awareness becomes like a disturbance; it is not. It may appear like this in the beginning, but soon you will see it will take your ecstasy to higher peaks. Ultimately awareness and ecstasy become one. Then those downs, depressive moments, agonies disappear.”


🌹🌹🌹🌹🌹



Comments


bottom of page