ఇంద్రకీలాద్రిపై "శ్రీ రాజరాజేశ్వరీ దేవి" గా దర్శనం - 10వ రోజు 12/10/2024 (Darshan as "Shri Rajarajeshwari Devi" on Indrakiladri)
- Prasad Bharadwaj
- Oct 12, 2024
- 1 min read

శ్రీ దేవి శరన్నవరాత్రులు 10వ రోజు 12/10/2024 ఇంద్రకీలాద్రిపై "శ్రీ రాజరాజేశ్వరీ దేవి" గా దర్శనం
🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒
శ్లో𝕝𝕝 అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ, బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా, చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ.
శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. "అపరాజితాదేవి" గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా మాయా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి.
నైవేద్యం:
ఈ రోజున నైవేద్యంగా కొబ్బరి పాయసం, కొబ్బరన్నం, పరమాన్నం సమర్పిస్తారు.
శ్రీ రాజరాజేశ్వరీదేవ్యై నమః
🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗
Comments