08.10.24 శ్రీశైలంలో కాత్యాయని దేవి అలంకరణ
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
కాళరాత్రీ దుర్గాదేవి
నవదుర్గల్లో ఏడవ అవతారం. కాళీ, మహాకాళీ, భధ్రకాళీ, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండా, చండీ, దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రీదేవి కూడా ఒకరు. నవరాత్రుల
ఏడవ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ సప్తమినాడు ఈ అమ్మవారిని పూజిస్తారు.
కాళరాత్రి స్వరూపం
ॐॐॐॐॐॐॐॐॐॐॐ
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ వామపాదోల్లసల్లో లతాకంటక భూషణా వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రి ర్భయంకరీ!!
దుర్గామాత ఏడవ శక్తి కాళరాత్రి అను పేర ఖ్యాతివహించినది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై యుండును.
మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమెకు గల త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరించుచుండును.
నవరాత్రి తొమ్మిది రోజులలో దుర్గా దేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు. క్రమంగా ఆదిశక్తి ఆమె భక్తుల జీవితాల నుండి అన్ని సమస్యలను తొలగిస్తుంది. ఈ తొమ్మిది రూపాలలో , ఒక వ్యక్తి యొక్క జీవితంలో వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగించే దేవత కూడా ఉంది. మంగళ దోషాలను సైతం ఆమె తొలగిస్తుందని చెప్పబడింది.
ఆమే కాత్యాయయుని కుమార్తె , కాత్యాయనీ. కాత్యాయనీ దేవి నాలుగు చేతులతో చిత్రీకరించబడి ఉంటుంది. ఇందులో ఆమె తన ఎడమ వైపు పై చేతిలో కమలాన్ని , మరో చేతిలో కత్తిని కలిగి ఉంటుంది. అదేవిధంగా , కుడి చేతులు అభయ మరియు వరద ముద్రలతో కూడుకుని ఉంటాయి. పసుపు రంగు చీర ధరించిన ఆమె సింహం మీద అధిరోహించి దర్శనమిస్తుంది.
కాత్యాయనీ దేవిని పూజించబడే ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు కలుగుతుందని చెప్పబడింది. వివాహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా కాత్యాయనీ దేవిని పూజించడం ద్వారా ఫలితాలను పొందగలరని సలహా ఇవ్వబడింది. వివాహ విషయాలలో ఆలస్యం , భార్యా భర్తల మధ్య తరచుగా విభేదాలు , సరైన భాగస్వామిని కనుగొనలేక పోవడం , వంటి సమస్యలు నవరాత్రి వేళల్లో ఆమెకై ఉపవాసం పాటించడం ద్వారా తొలగించబడుతుందని చెప్పబడింది. ఆమె వర్ణనలు కాళిక పురాణాలలో కూడా కనిపిస్తాయి. కాత్యాయనీ దేవి కూడా ఆదిశక్తి అంశగా పరిగణించబడుతుంది. కావున భయాన్ని త్యజించడం కోసం కూడా కాత్యాయనీ దేవిని పూజించడం జరుగుతుంది.
పన్నెండవ గృహంతో సంబంధం ఉన్న దేవతగా కాత్యాయనీ దేవిని కొలవడం జరుగుతుంది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం , కాత్యాయనీ దేవి జన్మ కుండలి చార్ట్లో బృహస్పతి గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆమెను 'బ్రహ్మ మండల ఆదిశక్తి దేవి' అని కూడా పిలుస్తారు. గోకులంలోని గోపికలు , కృష్ణుని ప్రేమను పొందుటకై ఈ దేవతకు ప్రార్ధనలు చేశారని చెప్పబడింది. భగవత్ పురాణంలో వారు యమునా నదిలో స్నానం చేసి , ధూప దీపాలతో , పువ్వులు మరియు నైవేద్యాలను సమర్పించి ఉపవాసం చేసేవారని చెప్పబడింది. ఈ ఉపవాసాలు చేయడం ద్వారా , క్రమంగా దోషాలు తొలగిపోయి వివాహ మార్గాన్ని సుగమం చేస్తుందని చెప్పబడింది. దేవీ నవ రాత్రులలో కాత్యాయని దేవీని పూజ చేయడం వివాహాది సమస్యలతో భాదపడేవారికి అత్యంత ముఖ్యమైన రోజుగా చెప్పబడు తుంది.వివాహానికి సంబంధించిన సమస్యల నివారణ కొరకు సూచించబడిన కాత్యాయని దేవీ మంత్రాలను కొన్ని క్రింద
ఇవ్వబడ్డాయి :
1.ముందస్తు వివాహానికి సూచించబడిన
కాత్యాయనీ మంత్రం :
ఓం కాత్యాయనీ మహామయే, మహాయోగిన్యాధీశ్వరీ !
నాంద్ గోప్సూతత్ దేవి పాటిమ్ మే కురు తే నమః !!
2.వివాహ ఆలస్యానికి సూచించదగిన
కాత్యాయని మంత్రం :
హే గౌరీ శంకర్ అర్ధాంగి యధా త్వాం శంకర్ ప్రియా !
తథా మమ్ కురు కల్యాణి కంటకం సుదుర్లభం !!
3.వివాహ సమస్యల నుండి బయట పడేందుకు :
హే గౌరీ శంకర్ అర్ధంగిని యథా త్వం శంకర ప్రియ !
తథా కమ్ కురు కల్యాణి కంత్ కాంత్ సుదుర్లభమ్ !!
4.ఆలస్యమైన వివాహాలకు కాత్యాయనీ సూర్య మంత్రం :
ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని !
వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!
5.కోరుకున్న భాగస్వామి కోసం సూచించదగిన కాత్యాయనీ మంత్రం :
ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని !
వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!
6.మంచి వివాహ జీవితానికి ఉద్దేశించిన కాత్యాయనీ మంత్రం :
ఓం షంగ్ శంకరాయ సకల్ జన్మర్జీత్ పాప్ విధ్వామ్స్ నాయ్ !
పురుషార్ద్ చౌతుస్టాయ్ లాభయ్ చ పాటిమ్ మే దేహి కురు కురు స్వాహ !!
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
08.10.24 ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
ఈ రోజు శ్రీ మహా లక్ష్మిదేవి అలంకరణ (శనేశ్వరుడు , కుజుడు , రాహువు , కేతువు , పూర్ణ చంద్రుడు)
చిలుక పచ్చ చీర (బుధుడు)
బెల్లం నైవేద్యం (శనేశ్వరుడు + బృహస్పతి)
పాయసం (శుక్రుడు , చంద్రుడు)
పటించవలసిన మంత్రము
‘ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజనమ్యే వశమానయస్వాహా’
అనే మంత్రాన్ని 1108 సార్లు పటించాలి
మహాలక్ష్మ్యష్టకం
ఇంద్ర ఉవాచ –
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౧ ||
నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౨ ||
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౩ ||
సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని |
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౪ ||
ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |
యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౫ ||
స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౬ ||
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |
పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౭ ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౮ ||
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః |
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ౯ ||
ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః || ౧౦ ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా || ౧౧ ||
(పదకొండు సార్లు పటించవలెను)
ఈ రోజు అమ్మవారికి మహా లక్ష్మిదేవి అమ్మవారి అలంకరణ చేసి చిలుక పచ్చ రంగు చీరను అలంకరించి బెల్లమును , పాయసమును నైవేద్యముగా సమర్పించి పై మంత్రాలను జపించవలెను.
ఈ అమ్మవారిని ఈ రోజు పూజించే సమయములో ఇంటిలో కిన్చెత్తు కూడా బూజు కానీ చెత్త బుట్టలలో చెత్త కాని ఉండకూడదు. అలాగే నీటిని ఉంచుకునే పాత్రలలో నీరు సమృద్ధిగా (నిండుగా) ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎట్టిపరిస్థితుల్లోను ఈ రోజు వివాదాలలో పాల్గొనడం కాని అనవసర ఆవేశానికి గురి కావడం కాని చెయ్యకూడదు. ఈ విధంగా ఇంట్లో పరిసరాలు అపరిశుబ్రంగా ఉండటంవలన శనేశ్వరుడి యొక్క ప్రభావం పెరిగి చేస్తున్న పనులలో ఆలస్యం అవ్వడము లేదా వృత్తి విషయములో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేకించి ఈ పూజ చేసే సమయములో ఇంట్లో నీరు సమృద్ధిగా లేకపోవడం వలన చంద్రుడి యొక్క దుష్పరిణామాలు ఎదురవడం వలన అనవసర ప్రయాణాలు ఏర్పడి ధన వ్యయం జరగడం , లేదా మోసపోవడం జరిగే అవకాశం ఉంటుంది.
ఈ రోజు అనవసర వివాదాలలో పాల్గొనడం వల్ల కుజుడి యొక్క ప్రభావం పెరిగి రుణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
విద్యా పరమైన విషయాలలో ఆటంకం ఎదుర్కునేవారు ఈ రోజు మేనమామల యొక్క ఆశీర్వాదము తీసుకోవడము లేదా విఘ్నేశ్వరుడి గుడిలో ఈ రోజు గరిక తో అర్చన చేయించుకోవడం ద్వార శుభం జరుగుతుంది.
ఉద్యోగ సమస్యలతో బాధ పడేవారు ఈ రోజు నువ్వులు బెల్లము కలిపి ఉండలు తాయారు చేసి గోమాతకు తినిపించడం ద్వారా ఆయా విషయాలలో మేలు జరుగుతుంది.
ఆర్ధిక పరమైన సమస్యలతో బాధ పడేవారు ఈ రోజు సన్యాసులకు లేదా వృద్దాశ్రమంలో ఉన్నటువంటివారికి ఉల్లిపాయ ముక్కలు కలిపినటువంటి దద్దోజనాన్ని సమర్పించడం ద్వారా ధన వ్యయం తగ్గుతుంది.
అలాగే అవకాశం ఉన్నవారు ప్రత్యేకించి వివాహం అయ్యిన స్త్రీలు ఈ రోజు పుట్టింటి వారి ఊరు కనుక దగ్గేరలో ఉంటె అక్కడకు వెళ్లి ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు మసాలా తో కుడినటువంటి ఆహారమును కాని లేదా ఉల్లిపాయ ముక్కలు కలిపినటు వంటి పెరుగన్నము కాని వారి స్వహస్తాలతో తాయారు చేసి వడ్డించి తినిపించడం ద్వారా జాతకములోని శని , చంద్ర దోషము పోయి అనవసర ధన వ్యయము తగ్గి ధన యోగం (అవసరమైన మేర) కలుగుతుంది అని మన పురాతనమైన జ్యోతిష్య నాడి , తాంత్రిక సిద్ధాంతములు చెబుతున్నాయి.
గమనిక: ఈ రోజు పూజలో పాల్గొన్నవారు ఎట్టి పరిస్థితులలో కూడా స్త్రీల యొక్క మనసు నొప్పించారాడు అలాగే స్త్రీలు ఎంత క్లిష్టమైన పరిస్థితి ఏర్పడినా కూడా గట్టిగ అరవడం కాని ఆవేశంగా మాట్లాడటం కాని ఖచ్చితంగా చెయ్యకూడదు.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
08.10.24 బతుకమ్మ పండుగలో వేపకాయల బతుకమ్మ
🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑
రేపు ఏడో రోజు సందర్భంగా... వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు. బియ్యం పిండితో వేపకాయల ఆకృతిలో పిండివంటలు చేసి... అమ్మవారికి నివేదిస్తారు. వేపకాయల బతుకమ్మ..తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో విధంగా బతుకమ్మను పేరుస్తూ... ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఎంతో ఉత్సాహంగా కొనసాగే బతుకమ్మ ఆటలో ఏడో రోజున అమ్మవారిని 'వేపకాయల బతుకమ్మ'గా అభివర్ణిస్తుంటారు. ఈ రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మకు నివేదన చేస్తారు. తంగేడు , గునుగు , బంతి , చామంతి , పట్టుకుచ్చు వంటి తీరొక్క పూలతో ఏడంతరాల బతుకమ్మను పేరుస్తారు.
రోజుకో తీరుగా..
తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ... రెండో రోజు అటుకుల బతుకమ్మ.. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదోనాడు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అర్రెం అనగా బతుకమ్మను ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మను పేరుస్తారు. ఇలా ఒక్కో రోజు ఒక్కో పేరుతో కొలుస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకమైన ప్రసాదాలను నివేదిస్తారు.
గంగమ్మ చెంతకు బతుకమ్మ
సాయంత్రం వేళ విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ..., పసుపుల పుట్టింది గౌరమ్మా... పసుపుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు , బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. చివరగా ఆ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చుతారు.
బతుకు తల్లికి పూజ !
అచ్చమైన పల్లెసంస్కృతికి అద్దం పట్టే మట్టిమనుషుల పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలతో తెలంగాణ లోగిళ్లు కళకళలాడుతున్నాయి. పల్లెలు , పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఓ పక్కన పెద్దలు బతుకమ్మ ఆడుకుంటుంటే.. మరోపక్కన పిల్లలు కేరింతలు కొడుతుంటారు. తొమ్మిది రోజుల పాటు పిల్లాపెద్దా తేడాలేకుండా ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ సంబురాలను జరుపుకుంటున్నారు. ప్రాణధారణకు ఆధారమైన నేలలో , నీటిలో ప్రభవించే బతుకు పువ్వే బతుకమ్మ. మానవ జీవనంలోని సుఖదుఃఖాలకు , స్నేహానురాగాలకు , ఆప్యాయతాదరణలకు ప్రతీకలైన రంగురంగుల పూలతోనే బతుకు తల్లికి పూజ !
🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎
Comments