top of page

'క్రోధి నామ నూతన సంవత్సర' ఉగాది శుభాకాంక్షలు Happy Ugadi

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Apr 9, 2024
  • 2 min read

Updated: Apr 10, 2024




🌹. 'క్రోధి నామ నూతన సంవత్సర' ఉగాది శుభాకాంక్షలు అందరికి 🌹


🌻ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి యొక్క గొప్ప సంవత్సరంగా ఉండాలని కోరుకుంటూ 🌻


ప్రసాద్‌ భరధ్వాజ



🍀. ఉగాది విశిష్టత - చరిత్ర 🍀


ఉగాదిలో 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఆ శబ్దానికి ప్రతిరూపం ఉగాదిగా రూపొందింది.


ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు. ప్లవ నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృత్‌' నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



🍀. ఉగాది విశిష్టత - చరిత్ర 🍀


చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.


శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు.


🍀. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత.. 🍀


ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.


🌻. బెల్లం - తీపి - ఆనందానికి ప్రతీక


🌻. ఉప్పు - జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం


🌻. వేప పువ్వు - చేదు- బాధకలిగించే అనుభవాలు


🌻. చింతపండు - పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు


🌻. పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు


🌻. కారం - సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు


🌹 🌹 🌹 🌹 🌹




Recent Posts

See All

Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page