🍀 కనుమ శుభాకాంక్షలు అందరికి, Magh Bihu Good Wishes to All 🍀
ప్రసాద్ భరద్వాజ
🌹🍀. కనుమ పండుగ విశిష్టత 🍀🌹
ఇది ప్రధానంగా వ్యవసాయదారులకు ప్రీతిప్రాప్తమైన పండుగ. తమకు సహకరించిన గోవులను, పశువులను, వ్యవసాయపనిముట్లను భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. ఆవులు, పాడిగేదెలు, కోడెదూడలు, పెయ్యలు, ఎడ్లకు కుంకుమ బోట్లు పెట్టి భక్తి చాటుకుంటారు. కొన్నిచోట్ల తప్పెట్లు తాళాలతో వీటిని ఊరేగిస్తారు. ఈరోజు ప్రయాణాలు పెట్టుకోరు.
కనుమ పండుగలో అంతర్లీనంగా శాస్త్ర, సామాజిక అంశాలు ఎన్నెన్నో వున్నాయి.. నువ్వులు, జొన్నలు, సజ్జలు, బియ్యం వంటి ధాన్యాలు-బీర, పొట్ల, చిక్కుడు, గుమ్మడి వంటి కూరగాయలతో ఆహార పదార్థాలను వండి తినడం ఆరోగ్యకరం.. కొంత మంది ముక్కనుమ పండుగను కూడా జరుపుకుంటారు. ఇలా ఆ మూడునాళ్లూ మురిపాలతో, ముచ్చట్లతో గడిచిపోతుంది. ప్రతి ఇల్లూ ఆనందాల లోగిలిగా మారిపోతుంది.
🌿🌼 ఈ రోజు ఇంటి కొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషధ మొక్కలు, సేకరిస్తారు .కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని, చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకారిస్తారు. కొన్ని నిర్ధుస్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి, అనగా, మద్ది మాను, నేరేడి మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచు తారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధుర మైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ల ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతటే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు. ఏడాది కొకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. అది నిజమే కావచ్చు, ఎంచేతంటే అందులో వున్నవన్ని, ఔషధాలు, వన మూలికలే గదా. 🌼🌿
🌹🌹🌹🌹🌹
Comments