top of page

దుర్గాష్టమి శుభాకాంక్షలు Happy Durga Ashtami దుర్గా ధ్యాన శ్లోకము Durga Dhyana Shloka

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Sep 30
  • 2 min read
ree



🌹 శ్రీ దుర్గా దేవి మాత ఆశీస్సులతో మీ ఇంట సిరి సంపదలు, మీకు ఆత్మ విశ్వాసం, సకల కార్యాలలో విజయాలు, లభించాలని కోరుకుంటూ దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికి 🌹


ప్రసాద్‌ భరధ్వాజ



నవరాత్రుల్లో ఎనిమిదో రోజున దుర్గాష్టమిని జరుపుకుంటాం. దుర్గాష్టమి నాడు దుర్గాదేవిని పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.



🌻 దుర్గా ధ్యాన శ్లోకము 🌻


శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం


మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |


సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥


నైవేద్యం : పులిహోర, గారెలు, క్షీరాన్నం




🍀 శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా స్తోత్రం 🍀



దుర్గా దుర్గారి శమనీ దుర్గాపద్వి నివారిణీ ।


దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ ॥ 1 ॥


దుర్గతోద్ధారిణీ దుర్గనిహన్త్రీ దుర్గమాపహా ।


దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోక దవానలా ॥ 2 ॥


దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ ।


దుర్గమార్గప్రదా దుర్గమ విద్యా దుర్గమాశ్రితా ॥ 3 ॥


దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ ।


దుర్గమోహా దుర్గమగా దుర్గమారర్థ స్వరూపిణీ ॥ 4 ॥


దుర్గమాసుర సంహన్త్రీ దుర్గమాయుధ ధారిణీ ।


దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ ॥ 5 ॥


దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ ధారిణీ ।


నామావళీ మిమాం యస్తు దుర్గాయా మమ మానవః ॥ 6 ॥


పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి న సంశయః ।


శత్రుభిః పీడ్యమానో వా దుర్గబన్ధగతోపి వా ।


ద్వాత్రింశన్నామ పాఠేన ముచ్యతే నాత్ర సంశయః ॥ 7 ॥



ఫలశ్రుతి: ఈ ముప్పై రెండు (ద్వాత్రింశత్) నామాల మాలికను ఏ మానవుడైతే పఠిస్తాడో, అతడు అన్ని భయాల నుండి విముక్తుడవుతాడు, సందేహం లేదు. శత్రువులచే పీడించబడుతున్నా లేదా కష్టాలలో చిక్కుకున్నా, ఈ 32 నామాల పారాయణం ద్వారా నిస్సందేహంగా విముక్తి పొందుతాడు.


దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గా దేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.


పంచ ప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవే మొదటిది. బవబంధాలో చిక్కుకున్న మానవుడని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాధిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయనం చెయ్యాలి. '' ఓం దుం దుర్గాయైనమ:'' అనే మంత్రాన్ని పఠించాలి. దుర్గ, లలిత అష్టోత్తరాలు పఠించాలి.


మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు.


ఈ సృష్టినంతా నడిపించే శక్తినే దుర్గ అంటారు. అంతులేని కష్టాలు చుట్టుముట్టినప్పుడు... దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయినప్పుడు ఆర్తితో పిలిచినవెంటనే ఎదుట నిలిచి కాపాడుతుంది. రాక్షసులను సంహరించి, మంచివాళ్లను రక్షించందని కథలాగా చెప్పుకున్నా... నిజానికి ఆమె మనలో దుష్టగుణాల రూపంలో ఉండే రాక్షసులను నిర్మూలించి, పరిశుద్ధులను చేస్తుంది. విజయావకాశాలు మెరుగు పరుస్తుంది. శరన్నవరాత్రుల్లో దేవి పరాక్రమ స్వరూపాన్ని సంభావిస్తారు. మహిషాసురుని వంటి దుష్టశక్తుల్ని దునుమాడిన దుర్గగా అమ్మను అర్చిస్తారు. నిజానికి దుర్గ అనే నామమే ఒక మహామంత్రం. దుర్గను మించిన పరతత్త్వం లేదు అని వైదిక నిర్వచనం. దుర్మార్గం, దురాచారం, దుఃఖం, దుస్థితి ఇవన్నీ దు శబ్దంతో కూడిన పదాలు. వీటన్నింటినీ సమూలంగా తొలగించే ఆనందశక్తి దుర్గ. రాగం, మదం, మోహం, చింత, అహంకారం, మమత, పాపం, క్రోధం, లోభం, పరిగ్రహం మొదలైన దోషాలను హరించే దేవియే దుర్గ అని శాస్త్రం వివరించింది. వేదధర్మానికి విఘాతం కలిగించి, దేవతలకు సైతం లొంగని దుర్గుడు అనే రాక్షసుని సంహరించడం వల్ల దుర్గా అనే నామం వచ్చినట్లు దేవీభాగవతం చెబుతోంది. దుర్గం అంటే కోట అని కూడా అర్థం ఉంది. పరుల బాధ లేకుండా, మనల్ని రక్షించే ఆశ్రయం దుర్గ. అదే విధంగా ఆశ్రయించిన భక్తులను అన్ని విధాలుగా ఆదుకునే తల్లి ఆమె.



అఖిలాండేశ్వరి శ్రీ మాతా


ఆది పరాశక్తి శ్రీ మాతా


నమస్తే శరణ్యే శివే సానుకంభే !


నమస్తే జగద్య్వాపికే విశ్వరూపే !


నమస్తే జగ ద్వంద్య పాదారవిందే !


నమస్తే జగత్తారిణి త్రాహిదుర్గే !!


నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే !


నమస్తే మహాయోగినిజ్ఞానరూపే !


నమస్తే నమస్తే సదానందరూపే !


నమస్తే జగత్తారిణి త్రాహిదుర్గే !!🙏



🌹 🌹 🌹 🌹 🌹




Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page