top of page

దైవీసంపదలు (Divine Wealth - 26 qualities that are divine wealth)

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹 దైవీసంపదలు 🌹


26 గుణములు దైవీసంపదలు అని చెప్పాడు పరమాత్మ. ఎవరైతే క్రితం జన్మలో జ్ఞానమును సంపాదిస్తారో, వారు మరుజన్మలో దైవీసంపదలతో పుడతారు. వారికి పైన చెప్పబడిన దైవీ సంబంధమైన గుణాలు ఉంటాయి. వాటిని మననం చేసుకుందాము.


1. భయం లేకపోవడం.


2. సత్వగుణం కలిగి ఉండటం, మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం.


3. జ్ఞానమును సంపాదించడం.


4. విద్యాదానము, జ్ఞానదానము, భూదానము, అన్నదానము మొదలగు దానములు శక్తికొద్దీ చేయడం.


5. ఇంద్రియనిగ్రహము.


6. జ్ఞాన యజ్ఞము చేయడం.


7. పురాణములు శాస్త్రములు చదవడం.


8. ప్రతిపనీ ఒక తపస్సులాగా చేయడం.


9. మంచి ప్రవర్తన.


10. అహింస వ్రతమును పాటించడం. అహింసా పరమోధర్మః.


11. సత్యము పలకడం. సత్యమేవ జయతే.


12. కోపము విడిచిపెట్టడం.


13. దుర్గుణములను త్యాగము చేయడం.


14. ప్రశాంతంగా ఉండటం.


15. ఇతరులను విమర్శించకుండా ఉండటం.


16. భూతదయ కలిగిఉండటం.


17. ఇంద్రియలోలత్వము స్త్రీలోలత్వము లేకుండా ఉండటం.


18. మృదువుగా మాట్లాడటం.


19. చెడ్డ పనులు చేసినపుడు సిగ్గుపడటం.


20. చిత్తచాంచల్యము వదిలిపెట్టడం.


21. ముఖంలో మనస్సులో తేజస్సు కలిగి ఉండటం.


22. ఓర్పుకలిగి ఉండటం.


23. అన్ని వేళలలో ధైర్యంగా ఉండటం.


24. శరీరము మనస్సు శుచిగా ఉంచుకోవడం.


25. ద్రోహబుద్ధి లేకుండా ఉండటం.


26. స్వాభిమానము వదిలిపెట్టడం.



ఈ గుణములను దైవీసంపదగా పరిగణించారు.


🌹🌹🌹🌹🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page