top of page

నాగుల చవితి శుభాకాంక్షలు - Good Wihses on Nagula Chavithi

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹🍀. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికి, Nagula Chavithi Good Wihses to All 🍀🌹


ప్రసాద్ భరద్వాజ


🌹. నాగులచవితి విశిష్టత 🌹


కాలనాగము మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే 'శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలో గల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.



🍀. నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం 🍀


పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.


”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.



🐍. నాగులచవితి రోజు పుట్ట వద్ద పఠించ వలసిన శ్లోకం 🐍


పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ

సత్సంతాన సంపత్తిం దేహియే శంకర ప్రియ

అనంతాది మహానాగ రూపాయ వరదాయచ

తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!



నాగులచవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.



"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |

ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||



పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగుల చవితి పూజా సమయంలో కొలుస్తారు.


చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.


దేవతా సర్పాలుగా పేర్కొనబడే - అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటకం, ఆశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియా, తక్షక, పింగళ అనే 12 దేవతా సర్పాలను ఈ రోజు పూజించి ఆశీర్వాదాలు పొందుతారు. ఈ విశ్వంలో పాములు - ఆకాశంలో , స్వర్గంలో, సూర్యకిరణాలో , సరస్సులలో , బావులు చెరువులలో నివసిస్తున్నాయి.


పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .


నడుము తొక్కితే నావాడు అనుకో

పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో

తోక తొక్కితే తోటి వాడు అనుకో

నా కంట నువ్వు పడకు నీ కంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.


ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము, అని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము.


నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట, ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు, ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.


🌹 🌹 🌹 🌹 🌹




Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page