భూలోక జీవితం ~ కామ లోక జీవితం Earthly Life ~ The Life of the World of Lust
మనం లో ప్రతి క్షణం కలిగే ఆలోచనలు, కోరికలు, స్పందబాలు, ఉద్రేకాలు మన కామ శరీరాన్ని లేదా
భువర్లోక శరీరాన్ని నిర్మిస్తూనే ఉంటాయి.
మనం ప్రతి రోజు ఒకే వ్యాసంగానికి చెందిన కోరికలు కోరుకుంటూ ఉంటే , ఆ కొరిక కి చెందిన ద్రవ్య రాసి మన లో అపారం గా పెరుగుతుంది..
ఒకే సమయం లో ప్రతి రోజు
ఒకే కోరిక కోరుకుంటూ ఉంటే, దానికి సంబంధించిన మానవేతర ప్రాణులు జీవుల ప్రభావం కూడా మన మీద తప్పకుండా పడుతుంది.
మన లోని కోరికల రూపం ఒక దృఢమైన భావ చిత్రం గా మారి సుదీర్ఘ కాలం మనతో ఉండటమే కాక, మరణానంతరం కామ లోకం. లేదా భువర్లోకం లో మనతో పాటు ఉంటుంది..
సహజం గానే ఆ కోరిక కి స్పందించే వారు భూలోకం లోను మన చుట్టూ ఉంటారు..ఆ కామ లోకం లోను మన చుట్టూ చేరతారు.
ఈ కారణం గా మనం కోరుకునే కోరికల విషయం లో మనం చాలా. జాగ్రత్తగా ఉండాలి. కోరిక ఒక భోగాన్ని సుఖాన్ని తీర్చేది అయితే, కొద్ది కాలం లో కోరిక తీరిపోవచ్చు.
కానీ, ఆ కొరిక ని రెట్టింపు చేసే వారు మనతోనే ఉన్నారు..
దీనితో మనం ఆ కోరిక నుండి, ఆ కోరిక మనలో రెచ్చ గొట్టే వారి నుండి తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది.
అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈ కోరిక చెలరేగుతూ ఉంటుంది.
మనం ఒక అధ్యాత్మిక ప్రగతి కి సంబంధించిన కోరిక కోరుకుంటే, దానికి చెందిన ఉత్తములు జ్ఞానులు
యోగులు సాధకులు మన చుట్టూ చేరి మనకెంతో సహాయం చేస్తారు.
ఇదే సహాయం మనకి కామ లోకం లో కూడా అందుతుంది. మహా ప్రస్థానం లో మన ప్రగతి. వేగవంతం అవుతుంది.
మనం ప్రతి రోజు ఉత్తమమైన ఒకే కోరిక సేవ త్యాగం ప్రేమ కరుణ కి చెందినవి కోరుకుంటే జీవితం లో అదే ఒక గొప్ప ధ్యానం గా మారుతుంది.
ఇదే మననం గా జీవితం సాగితే , దీని కి అనుగుణం గా మన శరీరాలు రూపొందుతాయి..
అప్పుడు మన భూలోక భువర్లోక జీవితాలు ఆనంద మయమే అవుతాయి..
డా. పి. ఎల్. ఎన్. ప్రసాద్
Comments