top of page

మోపిదేవి దర్శనం.... సర్వశుభకరం! (Mopi Devi)

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Jan 5
  • 2 min read

🌹 మోపిదేవి దర్శనం.... సర్వశుభకరం! 🌹


మోపిదేవి... కృష్ణాజిల్లాలోని మోపిదేవి గ్రామంలో కనిపించే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం.


సంతానమూర్తిగా శివుడి రూపంలో కొలువుదీరిన ఏకైక శివక్షేత్రం ఇదే కావడం విశేష పుట్టలో స్వరూపంలో స్వయంభువుగా వెలసిన కార్తికేయుడు. భక్తుల పాలిట కొంగుబంగారమని చెబుతారు. సంతానం లేనివారూ, వివాహం కానివారూ, కంటి వినికిడి సమస్యలు ఉన్నవారూ, శత్రుభయంతో బాధపడేవారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే... అవన్నీ పోతాయని అంటారు. నాగుల చవితి రోజున లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడున్న పుట్టకు విశేష పూజల్ని నిర్వహించే వేడుకను చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు.



స్థలపురాణం


ఓసారి సనకసనందులు పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారట. అదే సమయంలో శచీ, స్వాహా మొదలైన దేవతా స్త్రీలూ లక్ష్మీ, సరస్వతులూ కూడా పార్వతీదేవి దర్శనానికి వచ్చారట. ఇటు రుషులూ, అటు రంగురంగుల వస్త్రాలూ. ఆభరణాలు ధరించిన దేవతా స్త్రీలను చూసిన కుమారస్వామి నవ్వడం మొదలు పెట్టాడట. అది చూసిన పార్వతీదేవి కుమారుడిని సున్నితంగా మందలించడంతో కుమారస్వామి తల్లిని క్షమించమని కోరడంతోపాటు పాప పరిహారార్ధం తపస్సు. చేసేందుకు సిద్ధమయ్యాడట. అలా ఈ ప్రాంతానికి వచ్చిన కుమారస్వామి పాము రూపంలోకి మారి ఓ పుట్టను ఏర్పరచుకుని తపస్సు ప్రారంభించాడట. ఇది జరిగిన కొన్నాళ్లకు వింధ్యపర్వతం విజృంభించి ఆకాశంలోకి చొచ్చుకుని పోయి సూర్యగమనాన్ని సైతం నిరోధించడంతో ప్రకృతి స్తంభించిందట. ఈ ఉపద్రవాన్ని ఆగస్త్య మహర్షి మాత్రమే నివారించగలడని భావించిన బ్రహ్మాది దేవతలు ఆ మహర్షికి విషయాన్ని వివరించారట. దాంతో ఆగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రతో కలిసి బయలుదేరాడు. కొంతదూరం వెళ్లేసరికి వింధ్యపర్వతం మహర్షి రాకను గుర్తించి సాష్టాంగ నమస్కారం చేసిందట. తాను తిరిగొచ్చేవరకూ అలాగే ఉండమని శాసించడంతో ఆ పర్వతం వంగిపోయిందట. ఆ తరువాత అగస్త్యుడు మోపిదేవి చేరుకున్నాడట. అక్కడ ప్రార్ధిస్తున్న సమయంలో ఓ పుట్టనుంచి దివ్యతేజస్సు గమనించి కుమారస్వామే పుట్టలో ఉన్నట్లుగా తెలుసుకుని ఆ స్వామికి సుబ్రహ్మణ్యుడనే నామకరణం చేసి పడగ ఆకృతిలో ఉన్న శివలింగాన్ని పుట్టమీద ప్రతిష్టించి పూజలు చేశాడ మోపిదేవి క్షేత్రం ఏర్పడిందనీ, ప్రారంభంలో ఈ పుణ్యక్షేత్రాన్ని మోసేపురం అని పిలిచేవారనీ, క్రమంగా అదే మోపిదేవిగా మారిందనీ అంటారు.


దోషాలకు విశేష పూజలు.. చల్లపల్లి రాజ వంశస్థులు ట్రస్టీలుగా వ్యవహరిస్తున్న ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. ఈ గర్భగుడిలో పాము పుట్టమీద శివలింగం ఉంటుంది. దాన్నే పానవట్టంగా భావిస్తారు. ఈ పానవట్టం కింద అందరికీ కనపడే విధంగా లోపలికి


సుబ్రహ్మణ్యేశ్వరస్వామి... వల్లీదేవసేన సమేతంగా స్వయంభువుగా కొలువై... కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తుల పూజల్ని అందుకుంటున్న క్షేత్రం మోపిదేవి. ఈ స్వామి దర్శనం, ఆరాధన సర్వదోషాలను పోగొట్టి శుభాలను కలిగిస్తుందని భక్తుల నమ్మకం, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో భక్తులు పాలాభిషేకం, ప్రాధాన్యం ఇస్తారు.


ఒక రంద్రం అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలోనే పాలు పోస్తారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుంచి గర్భగుడిలోకి దారి దేవతాసర్పం పయనిస్తుందనీ అంటారు. నాగదోషం ఉన్నవారు ఇక్కడకు వచ్చి ఈ పుట్టలో పాలుపోయడంతోపాటూ నాగప్రతిష్ఠ చేయడం, ఇక్కడున్న నాగమల్లి చెట్టు దగ్గర ముడుపులు కట్టడం వంటివి చేస్తారు. అదేవిధంగా నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్టి రథసప్తమి రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ పూజలు నిర్వహిస్తే మనోవ్యాధులు దూరమవుతాయని భక్తుల నమ్మకం,



ఎలా చేరుకోవచ్చు.


మోపిదేవి ఆలయం. విజయవాడకు 70 కిలోమీటర్ల మచిలీపట్నానికి 35 కిలోమీటర్లు, గుంటూరు జిల్లా రేపల్లెకు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానంలో రావాలనుకునేవారు విజయవాడ. విమానాశ్రయంలో దిగి... అక్కడి నుంచి బస్సులూ, ప్రైవేటు వాహనాల ద్వారా 'ఆలయానికి చేరుకోవచ్చు. రైల్లో వచ్చేవారు. మచిలీపట్నం, రేపల్లె రైల్వేస్టేషన్లలో దిగొచ్చు.


🌹 🌹 🌹 🌹 🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page