🌹 మీలో చైతన్యం తెచ్చుకోవడమే సరైన మార్గం 🌹
✍️. ప్రసాద్ భరధ్వాజ
మొత్తం ప్రపంచంలోని స్పృహ లేని ప్రతి ఒక్కరూ బిచ్చగాళ్లు. అందరూ కొంత ప్రేమను, కొంత శ్రద్ధను, కొంత సానుభూతిని లాక్కోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు - ఎందుకంటే ప్రేమ అనేది ఎంతో అవసరమైన పోషణ. ప్రేమ లేకుండా, మీరు జీవించ లేరు; శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆత్మకు ప్రేమ కూడా అంతే అవసరం. ప్రతి ఒక్కరూ ప్రేమ లేకుండా బాధ పడుతున్నారు, ఎందుకంటే ప్రేమ లేకపోతే మీ ఆత్మలు నిస్తేజం అయిపోతాయి. కానీ దాని కోసం మనం చేస్తున్నది సరైనది కాదు. మీలోకి దివ్య చైతన్యం తెచ్చుకోవడమే సరైన మార్గం.
ఉన్నత చైతన్యం నుండి వివిధ స్పృహలు అనేక కోణాలలో వస్తూ ఉంటాయి. వీటిలో ప్రేమ అనేది చాలా ముఖ్యమైన పరిణాత్మక కోణం. దీని ద్వారా మొత్తం ఉనికి నుండి ప్రేమను ఎలా పొందాలి అనే బంగారు తాళం చెవిని మీరు కనుగొంటారు.
దీని రహస్యం ఏమిటంటే, మీ వద్ద ఉన్నదంతా ఇవ్వడం, పంచుకోవడం. మీరు తనతో భాగస్వామ్యులుగా మారారని విశ్వం తెలుసుకున్న తర్వాత, విశ్వంలోని అన్ని మూల వనరులు మీకు అందుబాటులోకి వస్తాయి. అవి ఎప్పటికీ తరగనివి.
🌹 The right way is to bring consciousness to yourself. 🌹
Everybody in this whole world of unconsciousness is a beggar, trying in every possible way to snatch some love, some attention, some sympathy -- because love is a necessary nourishment. Without love, you cannot live; just as food is necessary for the body, love is necessary for the soul. And everybody is suffering without love, because without love your souls become Inactive. But what we are doing is not right. The right way is to bring consciousness to yourself.
From higher consciousness there will be many revolutions in many dimensions. Love will be one of the most important dimensions, and you will find the golden key of how to get love from the whole existence.
The secret is: whatever you have, give it, share it. Once the universe knows that you have become a sharer, then all the sources of the universe become available to you. They are inexhaustible.
🌹🌹🌹🌹🌹
Comments