top of page

రాజరాజేశ్వరిగా Rajarajeshwari

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Oct 11, 2024
  • 1 min read

ఇంద్రకీలాద్రిపై రేపు(11.10.24) మధ్యాహ్నం సకల లోకాలకు ఆరాధ్యదేవత రాజరాజేశ్వరిగా దుర్గమ్మ అలంకరణ


🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓


నవరాత్రి ఉత్సవాలలో అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీ దేవి. సమస్త విశ్వానికీ ఆమె మహారాజ్ఞి. లోకపాలకులైన అష్ట దిక్పాలకులను పాలించేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను పాలించే దేవతను రాజ రాజేశ్వరిగా పిలుస్తారు.


దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’ గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా , జ్ఞాన , క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత.


పొదుపు చెయ్యడం నేటితరం ఆలోచన.ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరకుగడ , ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనం ఇస్తుంది. చెరకు రసం అత్మజ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టులను , దురహంకారులను , శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వు , చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి.


సమున్నతమైన దైవికశక్తికి ఈమె ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగిఉండటం , ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవాల్సిన స్ఫూర్తి. లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ , బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా , చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ శ్లోకం పఠించాలి. నైవేద్యంగా సేమ్యా పాయసం , కొబ్బరి పాయసం , కొబ్బరన్నం , పరమాన్నం సమర్పిస్తారు.


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page