విజయదశమి శుభాకాంక్షలు Happy Vijayadashami
- Prasad Bharadwaj
- Oct 2
- 2 min read

🌹. విజయదశమి శుభాకాంక్షలు మిత్రులందరికి , Happy Vijayadashami to All. 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹. విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు మిత్రులందరికి , Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All. 🌹
ప్రసాద్ భరద్వాజ
🍀. మహాదుర్గా దేవీ సర్వస్వ శరణాగతి 🍀
దేవి ప్రసీద, పరిపాలయ, నోరి భీతేః నిత్యం, యదా సుర వధా దధునైవ , సద్యః
పాపాని సర్వ జగతాం ప్రశమం నయాశు – ఉత్పాతపాక జనితారిశ్చ,మహోప సర్గాన్
ఓ దేవి ! రాక్షసులను చంపి నువ్వు మమ్మల్ని ఎలా కాపాడావో, అలాగే మమ్మల్ని ఎప్పుడూ శత్రు భయం నుంచి కాపాడు. అన్ని కాలాల్లోని పాపాలను, ఉత్పాతాల ద్వారా సూచింపబడి, అతి ఘోరంగా మారే ఉత్పాతాల విపత్తులను త్వరగా శమింప జేయి.
🍀. దసరా అంటే ఏమిటి ? మనలో ఉన్న పంచ జ్ఞాన, పంచ కర్మేన్ద్రియాలైన దశ ఇంద్రియాలు- దోపిడీ, హింస, స్త్రీ వ్యామోహం, లోభం, వంచన, పరుష వాక్కు, అసత్యం, పరనింద, చాడీ చెప్పటం, అధికార దుర్వినియోగం అనే దశ అంటే పది పాపపు పనులు చేస్తాయి. ఈ పది రకాల పాపాలు హరి౦చటానికి జగన్మాతను కొలిచే పండగనే ’’దశ హర‘’ అంటారు. అదే దసరా గా మారింది. బాల్య, యవ్వన, కౌమార వార్ధక్య౦ 4 దశలు దాటి పోవాలంటే జన్మ రాహిత్య స్థితి పొందాలి. ఈ జన్మ రాహిత్య స్థితిని పొందటానికి , మానవ జన్మల దశలను హరి౦చ మని శ్రీ దేవిని నవరాత్రులు ఆరాధించటమే దశహరా – దసరా . 🍀
🌻 చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ఈ రోజును దశపాప హర దశమి అని కూడా అంటారు. అవి పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు. ఈ పది పాపాల నుండి విముక్తిని ప్రసాదించి, మనందరి జీవితాలు సుఖసంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండేలా చేయమని దుర్గామాతను వేడుకుంటూ అందరికి దసరా – దశపాప హర దశమి శుభాకాంక్షలు. 🌻
'శమీపూజ' చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది. శమీ వృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి , రావణుని సహరించి విజయము పొందినాడు.
తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట' ను చూచే ఆచారం కూడా ఉన్నది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి , ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.
🍀. శమీ వృక్ష ప్రార్థన
శమీ శమయతే పాపం శమీ నాశయతే రిపూన్
శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సతి సంపదమ్
పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.
🌷. శ్రీ విజయ దుర్గా స్తోత్రము 🌷
దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ |
దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ 1
దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా |
దుర్గమజ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా 2
దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణి |
దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా 3
దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ |
దుర్గమోహ దుర్గమతా దుర్గమార్ధ స్వరూపిణి 4
దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ |
దుర్గమార్గీ దుర్గమతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ ౫
దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గధారిణీ
నామావళిమిమాం యస్తు దుర్గాయా మమ మానవః ౬
పఠెేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః
🌹 🌹 🌹 🌹 🌹
Comments