🌹 వినాయక వ్రతకల్పము - వినాయక చవితి పూజ విధానం 🌹
ప్రసాద్ భరధ్వాజ
ఓం గురుభ్యో నమః హరిః ఓం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
ఈ వీడియో లో పూజ మొదటినుండి పూజ చివర వరకు మొత్తము ఉంది .మీరు పూజకు కావాల్సిన సామానులు సిద్ధం చేసుకొని ప్రశాంతంగా కూర్చుని ఇది వింటూ పూజ చేసుకోండి.
దేవుడి గదిలో లేదా ఈశాన్యమూల స్థలాన్ని లేదా వీలుగా ఉండే తూర్పు/ఉత్తర దిశలలో శుద్ధిచేయాలి. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టి, దేవుణ్ణి ఉంచడానికి ఒక పీట వేయాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ముగ్గును వేయాలి. పాలవెల్లిని పండ్లతో అలంకరించి దానికింద ఉంచిన పీటపై గణపతి విగ్రహాన్ని ఉంచాలి.
1. ప్రార్ధన.
2. దీపారాధనము
3. పసుపు గణపతి పూజ
4. సంకల్పము
5. కలశారాధన
6. విఘ్నేశ్వర పూజ
7. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ట
8. షోడశోపచార పూజ
9. అధాంగ పూజ
10. ఏక వింశతి పత్ర పూజ
11. శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజ
12.ధూప,దీప,నైవేద్య,తాంబూల, నీరాజనం
13.మంత్ర పుష్పం
14.ప్రదక్షిణం
15.శ్రీ వినాయక వ్రత కథ
16. శమంతకోపాఖ్యానము
17. కధానంతర ప్రార్ధన
18. చిన్నపిల్లలు చెప్పవలసిన శ్లోకము
19. విఘ్నేశ్వరుని మంగళహారతి.
పూజ చేసి కథనంతయు విను అవకాశము లేనివారు…
సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః
సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగి యున్నదని చెప్పబడినది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.
సర్వేజనాః సుఖినో భవంతు.
🌹🌹🌹🌹🌹
Comments