top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 905 / Vishnu Sahasranama Contemplation - 905




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 905 / Vishnu Sahasranama Contemplation - 905 🌹


🌻 905. స్వస్తిదక్షిణః, स्वस्तिदक्षिणः, Svastidakṣiṇaḥ 🌻


ఓం స్వస్తిదక్షిణాయ నమః | ॐ स्वस्तिदक्षिणाय नमः | OM Svastidakṣiṇāya namaḥ


స్వస్తిరూపేణ దక్షతే వర్ధతే, స్వమ్తి దాన్తుం సమర్థ ఇతి వా స్వస్తిదక్షిణః । అథవా దక్షిణశబ్ద ఆశుకారిణి వర్తతే; శీఘ్రం స్వస్తి దాతుమ్ అయమేవ సమర్థ ఇతి, యస్య స్మరణాదేవ సిధ్యన్తి సర్వసిద్దయః ॥


1. శుభకర రూపముతో వర్ధిల్లుచు నిరంతరము కొనసాగుచు ఉండువాడు.


2. శుభములను ఇచ్చుటకు శక్తి కలవాడు.


3. 'దక్షిణ' శబ్దమునకు 'శీఘ్రకారీ' అనగా శీఘ్రముగా పనిని చేయువాడు అను అర్థమును కలదు. ఏ భగవానుని స్మరించినంత మాత్రముననే సర్వసిద్ధులు సిద్ధించునో అట్టివాడు శ్రీ మహా విష్ణువు కావున 'స్వస్తి దక్షిణః' అనగా శీఘ్రముగా శుభములను ఇచ్చుటకు సమర్థుడు అను అర్థమును చెప్పవచ్చును.


:: శ్రీ విష్ణు పురాణే పఞ్చమాంశే సప్తదశోఽధ్యాయః ::


స్మృతే సకల కల్యాణ భాజనం యత్ర జాయతే ।

పురుష స్త మజం నిత్యం వ్రజామి శరణం హరిమ్ ॥ 18 ॥


ఎవరు స్మరించబడినంతనే జీవుడు సకల శుభములకును పాత్రము అగునో, అట్టి జన్మరహితుడును, నిత్యుడును, స్వయం సిద్ధుడును, శాశ్వతుడును అగు హరిని రక్షకునిగా శరణమును పొందుచున్నాను.


స్మరణా దేవ కృష్ణస్య పాపసఙ్ఘాతపఞ్జరం ।

శతధా భేద మాయాతి గిరిర్వ్రజహతోయథా ॥


కృష్ణుని స్మరణ మాత్రము వలననే పాపముల రాశి అను పంజరము వజ్రపు దెబ్బ తినిన పర్వతమువలె నూరు చెక్కలుగా బ్రద్దలగుచున్నది.



ఈ మొదలగు వచనములను బట్టి పై అర్థము సమర్థింప బడుచున్నది.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 905 🌹


🌻 905. Svastidakṣiṇaḥ 🌻


OM Svastidakṣiṇāya namaḥ


स्वस्तिरूपेण दक्षते वर्धते, स्वम्ति दान्तुं समर्थ इति वा स्वस्तिदक्षिणः । अथवा, दक्षिणशब्द आशुकारिणि वर्तते; शीघ्रं स्वस्ति दातुम् अयमेव समर्थ इति, यस्य स्मरणादेव सिध्यन्ति सर्वसिद्दयः ॥


Svastirūpeṇa dakṣate vardhate, svamti dāntuṃ samartha iti vā svastidakṣiṇaḥ, athavā, dakṣiṇaśabda āśukāriṇi vartate; śīghraṃ svasti dātum ayameva samartha iti.



1. He who grows in the form of svasti i.e., auspiciousness.


2. He who is efficient in conferring svasti i.e., auspiciousness.


3. The word dakṣiṇaḥ is applied to one who does action quickly. Lord Śrī Mahā Viṣṇu alone is able to confer svasti quickly; for by mere devout thought of Him are realized all siddhis vide the below.



:: श्री विष्णु पुराणे पञ्चमांशे सप्तदशोऽध्यायः ::


स्मृते सकल कल्याण भाजनं यत्र जायते ।

पुरुष स्त मजं नित्यं व्रजामि शरणं हरिम् ॥ १८ ॥



Śrī Viṣṇu Purāṇa Section 5, Chapter 17


Smr‌te sakala kalyāṇa bhājanaṃ yatra jāyate,

Puruṣa sta majaṃ nityaṃ vrajāmi śaraṇaṃ harim. 18.



I always seek refuge in Hari the unborn - who when remembered, becomes the source from which all auspiciousness flows.



स्मरणा देव कृष्णस्य पापसङ्घातपञ्जरं ।

शतधा भेद मायाति गिरिर्व्रजहतोयथा ॥


Smaraṇā deva kr‌ṣṇasya pāpasaṅghātapañjaraṃ,

Śatadhā bheda māyāti girirvrajahatoyathā.


By remembrance alone of Kr‌ṣṇa, the totality of sins is split into hundredfold like a mountain struck by vajra (Indra's thunderbolt weapon).



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।

स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥


సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।

స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥


Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,

Svastidassvastikr‌t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥




Continues....


🌹 🌹 🌹 🌹🌹






Comentários


bottom of page