top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 919 / Vishnu Sahasranama Contemplation - 919



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 919 / Vishnu Sahasranama Contemplation - 919 🌹


🌻 919. క్షమిణాంవరః, क्षमिणांवरः, Kṣamiṇāṃvaraḥ 🌻


ఓం క్షమిణాంవరాయ నమః | ॐ क्षमिणांवरय नमः | OM Kṣamiṇāṃvaraḥaya


క్షమావతాం యోగినాం చ పృథివ్యాదీనాం భారధారకాణాం చ శ్రేష్ఠ ఇతి క్షమిణాం వరః


క్షమ వీరికి కలదు కావున అట్టివారు క్షమిణః. అట్టి వారిలో శ్రేష్ఠుడు క్షమిణాం వరః. క్షమ కలవారిలో, యోగులలోను భారమును ధరించునవియగు పృథివి మొదలగు వానిలోను శ్రేష్ఠుడు.


'క్షమయా పృథివీసమః' ఇతి వాల్మీకివచనాత్ 'ఓర్పు విషయమున పృథివితో సమానుడు' అను వాల్మీకి వచనము ఇట ప్రమాణము.


బ్రహ్మాణ్డమఖిలం వహన్ పృతివీవ భారేణ నార్దిత ఇతి పృతివ్యా అపి వరో వా క్షమిణః శక్తః ।

అయం తు సర్వశక్తిమత్త్వాత్సకలాః క్రియాః కర్తుం క్షమత ఇతి వా క్షమిణాం వరః ॥


పృథివి సకల ప్రాణిజాతపు భారమును మోయుచున్నట్లే విష్ణువు సకల బ్రహ్మాండమును మోయుచున్నాడు. అయినను పృథివి దుష్టుల భారముచే పీడితురాలయినట్లు ఆతడు ఎంత భారము చేతను పీడితుడగుటలేదు. కావున విష్ణువు పృథివికంటెను శ్రేష్ఠుడు అగుచు భారధారణ సమర్థులలో శ్రేష్ఠుడు అగుచున్నాడు.


లేదా క్షమిణః అనగా శక్తులు. ఇతరులు కొన్ని కార్యములు నిర్వహించుటకు మాత్రము శక్తులుకాగా, విష్ణువు సర్వశక్తిమంతుడు అగుటచే సకల క్రియలను ఆచరించుటకును శక్తి కలిగియున్నాడు. కావున ఈతడు శక్తులగు వారందరిలో శ్రేష్ఠుడగుచున్నాడు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 919🌹


🌻 919. Kṣamiṇāṃvaraḥ 🌻


OM Kṣamiṇāṃvaraḥaya namaḥ


क्षमावतां योगिनां च पृथिव्यादीनां भारधारकाणां च श्रेष्ठ इति क्षमिणां वरः / Kṣamāvatāṃ yogināṃ ca pr‌thivyādīnāṃ bhāradhārakāṇāṃ ca śreṣṭha iti kṣamiṇāṃ varaḥ


The most eminent of those who forgive like yogis and carriers of burden like the earth etc vide 'Kṣamayā pr‌thivīsamaḥ' - 'the One equal to earth in forgiveness' mentioned by Vālmīki in Rāmāyaṇa.


ब्रह्माण्डमखिलं वहन् पृतिवीव भारेण नार्दित इति पृतिव्या अपि वरो वा क्षमिणः शक्तः ।

अयं तु सर्वशक्तिमत्त्वात्सकलाः क्रियाः कर्तुं क्षमत इति वा क्षमिणां वरः ॥


Brahmāṇḍamakhilaṃ vahan pr‌tivīva bhāreṇa nārdita iti pr‌tivyā api varo vā kṣamiṇaḥ śaktaḥ,

Ayaṃ tu sarvaśaktimattvātsakalāḥ kriyāḥ kartuṃ kṣamata iti vā kṣamiṇāṃ varaḥ.


Carrying the entire Brahmāṇḍa like the earth with all things on it, the Lord is not afflicted by it and so is greater than the earth in ability of carrying burden.


Kṣamiṇaḥ also stands for persons who are able. Being All powerful, the Lord is able to do all actions with superlative efficiency and hence Kṣamiṇāṃvaraḥ.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।

विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥


అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥


Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,

Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥




Continues....


🌹 🌹 🌹 🌹🌹



Comments


bottom of page