🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 958 / Vishnu Sahasranama Contemplation - 958 🌹
🌻 958. పణః, पणः, Paṇaḥ 🌻
ఓం పణాయ నమః | ॐ पणाय नमः | OM Paṇāya namaḥ
ప్రణతిర్వ్యవహారార్థస్తం కుర్వన్ పణ ఉచ్యతే ।
పుణ్యాని సర్వకర్మాణి పణం సఙ్గృహ్య యచ్ఛతి ॥
తత్ఫలమధికారిభ్య ఇతి లక్షణయా హరిః ।
పణ ఇత్యుచ్యతే సద్భిర్విద్వద్భిః శ్రుతిపారగైః ॥
'పణ' ధాతువునకు 'వ్యవహారము', 'వ్యవహరించుట' అను అర్థములు కలవు. పరమాత్ముడు వ్యవహరించు చున్నాడు.
'సర్వాణి రూపాణి విచిత్య ధీరో - నామాని కృత్వాఽభివదన్ యదాస్తే' (తైత్తిరీయ ఆరణ్యకము 3.12)
- 'విచారణశీలుడగు పరమ పురుషుడు దృశ్య ప్రపంచము నందలి సకల రూపములను విచారణ చేసి, వానికి నామములను అనగా ఆయా అర్థములను చెప్పదగు శబ్దములను ఏర్పరచి వానితో లోకమున వ్యవహరించుచు ఉన్నాడు - అనునది ఏది కలదో!' అను శ్రుతి ఇందు ప్రమాణము.
పుణ్య కర్మములను అన్నిటిని పణముగా అనగా వెలగా తీసికొని వారి వారి అధికారమునకు తగిన ఫలములను ప్రదానము చేయును అను అర్థమున లక్షణావృత్తిచే పరమాత్ముని 'పణః' అనవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 958🌹
🌻958. Paṇaḥ🌻
OM Paṇāya namaḥ
प्रणतिर्व्यवहारार्थस्तं कुर्वन् पण उच्यते ।
पुण्यानि सर्वकर्माणि पणं सङ्गृह्य यच्छति ॥
तत्फलमधिकारिभ्य इति लक्षणया हरिः ।
पण इत्युच्यते सद्भिर्विद्वद्भिः श्रुतिपारगैः ॥
Praṇatirvyavahārārthastaṃ kurvan paṇa ucyate,
Puṇyāni sarvakarmāṇi paṇaṃ saṅgrhya yacchati.
Tatphalamadhikāribhya iti lakṣaṇayā hariḥ,
Paṇa ityucyate sadbhirvidvadbhiḥ śrutipāragaiḥ.
Paṇati is used in the sense of worldly dealings. He does them; He causes the worldly activities to take place - so Paṇaḥ
vide the śruti 'Sarvāṇi rūpāṇi vicitya dhīro - nāmāni krtvā’bhivadan yadāste' (Taittirīya āraṇyaka 3.12) -
'He, the wise One remains creating the various forms and giving names to them.'
All meritorious activities are paṇam. He who collectively confers the fruits to their adhikāris or the ones who are entitled - is, by a figure of speech, called Paṇaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥
Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments