🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 960 / Vishnu Sahasranama Contemplation - 960 🌹
🌻 960. ప్రాణనిలయః, प्राणनिलयः, Prāṇanilayaḥ 🌻
ఓం ప్రాణనిలయాయ నమః | ॐ प्राणनिलयाय नमः | OM Prāṇanilayāya namaḥ
యత్ర ప్రాణా ఇన్ద్రియాణి నిలీయన్తే హరావుత ।
తత్పరతన్త్రతయా వా దేహస్యైతస్య ధారకాః ॥
ప్రాణాపానాదయస్తస్మిన్ నిలీయన్తే హరావితి ।
వా ప్రాణనిలయః ప్రోక్తో విష్ణుర్వేదవిశరదైః ॥
యః ప్రాణితీతి స జీవః పరే పుంసి నిలీయతే ।
ప్రాణోవేత్యథవా ప్రాణాన్ జీవానపి చ సంహరన్ ॥
ఇతి వా ప్రాణనిలయ ఇతి విష్ణుస్సమీర్యతే ॥
ప్రాణములు అనగా ఇంద్రియములు - ఎవనికి పరతంత్రములగుచు ఎవనియందు మిక్కిలిగా లయమును పొందుచున్నవో అట్టి జీవుడు 'ప్రాణనిలయః' అనబడును. అట్టి జీవుడు వాస్తవమున పరమాత్మునితో అభిన్నుడే! దేహమును నిలిపి పట్టు ప్రాణాపానాది ప్రాణములు ఎవనికి పరతంత్రములై ఎవనియందు మిక్కిలిగా లయమందుచున్నవో అట్టి జీవుడు ప్రాణనిలయః అనబడును.
ప్రాణధారణ చేయును కావున 'ప్రాణః' అనగా జీవుడు. అట్టి ప్రాణము లేదా జీవుడు ఎవనియందు మిక్కిలిగా లయమును, ఏకత్వమును పొందునో అట్టి పరమపురుషుడు, పరమాత్ముడు ప్రాణనిలయః అనబడును. ప్రాణములను, ఇంద్రియములను, ప్రాణాపానాదికమును, జీవులను - తనయందు ఉపసంహరించుకొనును కావున పరమాత్మునకు 'ప్రాణనిలయః' అను నామము సరిపడియున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 960🌹
🌻 960. Prāṇanilayaḥ 🌻
OM Prāṇanilayāya namaḥ
यत्र प्राणा इन्द्रियाणि निलीयन्ते हरावुत ।
तत्परतन्त्रतया वा देहस्यैतस्य धारकाः ॥
प्राणापानादयस्तस्मिन् निलीयन्ते हराविति ।
वा प्राणनिलयः प्रोक्तो विष्णुर्वेदविशरदैः ॥
यः प्राणितीति स जीवः परे पुंसि निलीयते ।
प्राणोवेत्यथवा प्राणान् जीवानपि च संहरन् ॥
इति वा प्राणनिलय इति विष्णुस्समीर्यते ॥
Yatra prāṇā indriyāṇi nilīyante harāvuta,
Tatparatantratayā vā dehasyaitasya dhārakāḥ.
Prāṇāpānādayastasmin nilīyante harāviti,
Vā prāṇanilayaḥ prokto viṣṇurvedaviśaradaiḥ.
Yaḥ prāṇitīti sa jīvaḥ pare puṃsi nilīyate,
Prāṇovetyathavā prāṇān jīvānapi ca saṃharan.
Iti vā prāṇanilaya iti viṣṇussamīryate.
Prāṇas or life forces are the senses. They are sustained in the jīva i.e., living being as they are extra-dependent. In the ultimate analysis, the jīva, hence, is identical with Brahman. So the jīva is Prāṇanilayaḥ. Prāṇa, apāna and such life forces are the supports of the body. They merge in Him; so Prāṇanilayaḥ.
Breathe stands for prāṇa, the jīva. That merges in the supreme person who is, thus, called Prāṇanilayaḥ. The Paramātma annihilates the prāṇas and jīvas. So He is aptly called Prāṇanilayaḥ - the refuge or resting place of life forces.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।
तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥
Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhrt prāṇajīvanaḥ,
Tattvaṃ tattvavidekātmā janmamrtyujarātigaḥ ॥ 103 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments