🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 981 / Vishnu Sahasranama Contemplation - 981 🌹
🌻 981. యజ్ఞాన్తకృత్, यज्ञान्तकृत्, Yajñāntakrt 🌻
ఓం యజ్ఞాన్తకృతే నమః | ॐ यज्ञान्तकृते नमः | OM Yajñāntakrte namaḥ
యజ్ఞస్యాన్తం ఫలప్రాప్తం కుర్వన్ యజ్ఞాన్తకృద్ధరిః ।
వైష్ణవర్క్ఛ్య ఫలప్రాప్తిం కుర్వన్ యజ్ఞాన్తకృద్ధరిః ॥
యజ్ఞం కృత్వా స యజ్ఞ సమాప్తిం విష్ణుః కరోతి సః ।
వేతి యజ్ఞాన్తకృద్విష్ణుః ప్రోచ్యతే విబుధోత్తమైః ॥
యజ్ఞమును యథావిధిగా అంతము అనగా పరిసమాప్తమునొందినచో, దానివలన కలుగునది ఫలమే కావున, యజ్ఞాంతము అనగా యజ్ఞ ఫలము అని ఇట శ్రీ భాష్యకారులచే అర్థము చెప్పబడినది. కనుక యజ్ఞమునకు సంబంధించిన అంతమును అనగా ఫలప్రాప్తిని కలిగించువాడు శ్రీ విష్ణువు. యజ్ఞములనాచరించుటచే కలుగు ఫలమును యజమానునకు ప్రాప్తమగునట్లు చేయు యజ్ఞఫలదాత శ్రీ విష్ణువే!
లేదా వైష్ణవ ఋక్ సంశమనము అనగా ఉచ్ఛారణము చేసి పూర్ణాహుతిని ఆచరించుటతో యజ్ఞమును ఏ కొరత లేని పూర్ణముగా చేసి యజ్ఞసమాప్తి చేయు యజమానుడును 'యజ్ఞాంతకృత్' అనబడుచున్నాడు. అట్టి ఆ యజమానుడును పరమాత్మునితో అభిన్నుడే!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 981🌹
🌻981. Yajñāntakrt🌻
OM Yajñāntakrte namaḥ
यज्ञस्यान्तं फलप्राप्तं कुर्वन् यज्ञान्तकृद्धरिः ।
वैष्णवर्क्छ्य फलप्राप्तिं कुर्वन् यज्ञान्तकृद्धरिः ॥
यज्ञं कृत्वा स यज्ञ समाप्तिं विष्णुः करोति सः ।
वेति यज्ञान्तकृद्विष्णुः प्रोच्यते विबुधोत्तमैः ॥
Yajñasyāntaṃ phalaprāptaṃ kurvan yajñāntakrddhariḥ,
Vaiṣṇavarkchya phalaprāptiṃ kurvan yajñāntakrddhariḥ.
Yajñaṃ krtvā sa yajña samāptiṃ viṣṇuḥ karoti saḥ,
Veti yajñāntakrdviṣṇuḥ procyate vibudhottamaiḥ.
The anta or conclusion of a Yajña leads to fruition in the form of its result. Thus Yajña anta means the final step of realizing fruits at the end of a Yajña; this elucidation is provided by Śrī Bhāṣyakāras. Since Lord Viṣṇu gives the fruit of vedic sacrifices at the end of their complete performance, He is called Yajñāntakrt.
Or by uttering the vaiṣṇava Rk sound in the final oblation, the yajamāna i.e., performer of the vedic sacrifice, concludes the Yajña. The yajamāna, thus, is non different from paramātma Himself.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥
Yajñabhrdyajñakrdyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñāntakrdyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments