top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ దేవి శరన్నవరాత్రులు 8వ రోజు 10/10/2024 "దేవీ మహాగౌరీ " గా దర్శనం 8th Day of Shri Devi Sharannavaratri 10/10/2024 Darshan as "Devi MahaGauri"

శ్రీ దేవి శరన్నవరాత్రులు 8వ రోజు 10/10/2024 "దేవీ మహాగౌరీ " గా దర్శనం


శ్రీశైలం


🌸🌸🌸🌸🌸🌸🌸🌸


శ్లో𝕝𝕝 ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||


"దేవీ మహాగౌరీ" ధ్యాన శ్లోకం


శ్లో𝕝𝕝 శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః | మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||


అష్టవర్షా భవేద్గౌరీ - "మహాగౌరి" అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును. ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము.


పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు "మహాగౌరి" యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును.


శ్రీ మహాగౌరీదేవ్యై నమః


🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑


Comments


bottom of page