top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీ అన్నపూర్ణ జయంతి శుభాకాంక్షలు Good Wishes on Sri Dattatreya Jayanti and on Sri Annapurna Jayanti



🌹. శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీ అన్నపూర్ణ జయంతి శుభాకాంక్షలు అందరికి, Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Good Wishes to All 🌹


📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌻. శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి విశిష్టత / Specialty of Sri Dattatreya Swami's Jayanti 🌻


🍀. శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.🍀


🌿🌼🙏. దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్లినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి, అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. ‘దత్తుడు + ఆత్రేయుడు ‘దత్తాత్రేయుడు’ అని మనం వ్యవహరించు చున్నాము.🙏🌼🌿


🌿🌼🙏. ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలయిన తాపాలను తన తపో మహిమతో తొలగించుకొన్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక.🙏🌼🌿


🌿🌼🙏. సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన గురుదేవులు దత్తాత్రేయుల వారు పుట్టిన రోజు మార్గశీర్షమాసంలో పూర్ణిమనాడు వస్తుంది. మృగశిరా నక్షత్రం వృషభరాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభరాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు మార్గశీర్ష పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటున్నారు. పౌర్ణమినాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు. శ్రీ దత్తావారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీదత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజు దగ్గర నుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది. కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం!🙏🌼🌿


🙏🌼🌿. ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం.


🌿🌼🙏. ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.🙏🌼🌿


🌿🌼🙏1.శ్రీ పాద శ్రీ వల్లభ త్వం సదైవ శ్రీ దత్తా స్మాన్ పాహి దేవాధిదేవ|,

భవగ్రహ క్లేశ హరిన్ సుకీర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿


🌿🌼🙏2.త్వం నో మాతా త్వం నో పితాప్తో ధి పస్త్వం త్రాతాయోగ క్షేమకృత్ సద్గురు స్త్వమ్

త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿


🌿🌼🙏3.పాపం తాపం వ్యాధిదీం చ దైన్యమ్ భీతిం క్లేశం త్వం హ రాశు త్వ దైన్యమ్|

త్రాతారం నో వీక్ష ఇషాస్త జూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿


🌿🌼🙏4.నాన్య స్త్రాతా న పీడాన్ న భర్తా త్వత్తో దేవ త్వం శరణ్యో శోకహర్తా|

కుర్వత్రేయ అనుగ్రహం పూర్ణరతే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿


🌿🌼🙏5.ధర్మే ప్రీతీం సన్మతం దేవభక్తిమ్ సత్స్ జ్ఞప్తి దేహి భుక్తిమ్ చ ముక్తిం |

భవ శక్తీమ్ చ అఖిలానంద మూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿


🌿🌼🙏. శలోక పంచక మతద్యో లోక మంగళ |వర్ధనం ప్రపటేన్యతో భక్త్యా స శ్రీ దత్తాత్రేయ ప్రియో భవేత్ 🙏🌼🌿


🌿🌼🙏దగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా🙏



🌹 🌹 🌹 🌹 🌹





🌹. Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Good Wishes to All 🌹


✍️. Prasad Bharadwaj


🌻. Specialty of Sri Dattatreya Swami's Jayanti 🌻


🍀. Sri Dattatreya is Gnanayoganidhi, Vishwaguru and Siddhasevita. Shruti says that just remembering 'Sridatta' fulfills the desires of our mind. Dattamurthy's incarnation is to teach all living beings knowledge, knowledge, love, truth, happiness and righteousness. Dattatreya is a sage who has transcended Vedic knowledge.🍀


🌿🌼🙏. Dattatreya was the son of sage Atri and Anasuya Devi. Sage Atri did severe penance to have a son and wanted a son with divine powers. As a result of his penance, Chandra was born in the Brahma aspect, Datta in the Vishnu aspect, and Durvasa in the Shiva aspect. Those three who were born in different times are known by the name Sridatta. Chandra and Durvasu showered their energies on Dattu. Adoption means one who willingly goes to adopt another person. He became an Atreya because Srihari left his birthplace Vaikuntha and became the son of Atri. 'Dattatreya + Athreya' we have treated as 'Dattatreya'.🙏🌼🌿


🌿🌼🙏. Atri Maharshi, who removed the three types of tapa, namely, material, spiritual and spiritual, with his tapo glory. He was also called 'Athreya' as he was the son of Atri. Datta did penance on the banks of the river Gomati for the acquisition of knowledge and became a sage. Dattatreya has six arms and three heads and the head is Vishnu. On the right is Shiva's head and on the left is Brahma's head. The right part is Sadguru's form, the left part is Parabrahma's form, and in the middle part Sridatta removes ignorance and protects the worlds. He appears with three faces, six arms, four dogs and a cow. The four dogs are the four Vedas, the cow's mind is the magic power, and the three faces are the trinity. Creation, status, rhythms. The trident is a ritual, the wheel is the destroyer of ignorance, the conch shell is the treasure of all things, and all the Vedas are derived from it. Kamandala is a symbol of removing all suffering and bringing good luck.🙏🌼🌿


🌿🌼🙏. Purnimanada falls in the month of Margashirsham on the birth day of Gurudev Dattatreya, who cut off all ties and chose his devotees to lead them to the supreme path. Dattatreya Jayanti is celebrated on Margashirsha Purnima, the day when the power of the moon is at full strength, as Taurus is the home of the Moon. If you anoint the Dattu with milk on the full moon day and tell him the desires of your mind, he will bring you success. If we think about Sri Datta get long life health, and Bhogabhagya, Bbeautiful change will happen from the day we think about it. So let's worship and get blessings of Datta on his birth anniversary!🙏🌼🌿


🙏🌼🌿. Ghora Khatshodharana Strotram of the Great Glorified Sri Dattatreya Swami, the Remover of Grievous Sufferings.


🌿🌼🙏. Those who recite these Pancha Shlokas with devotion will get rid of all their troubles and sufferings due to the grace of Sri Dattatreya Swami and will be filled with happiness and joy. Recite with complete devotion, attention and faith.🙏🌼🌿


🌿🌼🙏 1. Sri Pada Sri Vallabha Tvam Sadaiva Sri Datta Sman Pahi Devadhideva|,

Bhavgraha klesha harin sukirte ghorakashtaduddharasman namaste.🙏🌼🌿


🌿🌼🙏 2.Tvam no mata tvam no pitapto dhi pastvam tratayoga kshemakrit sadguru stvam

Tvam Sarvasvam No Prabho Vishwamurte Ghorakashtaduddharasman Namaste.🙏🌼🌿


🌿🌼🙏 3. Papam, Tapam Vyaddidhim cha, Dainyam Bhithim Klesham tham Harasuthva dainyam

Trataram no veeksha ishasta juorte ghorakashtaduddharasman namaste.🙏🌼🌿


🌿🌼🙏 4. Nanya strata na peedan na bhartra tvatto deva tvam saranyo sokaharta|

Kurvatreya Anugraham Purnarate Ghorakashtaduddharasman Namaste.🙏🌼🌿


🌿🌼🙏 5.Dharme Pritim Sanmatam Devbhaktim Sats Jnapti Dehi Bhuktim Cha Muktim |

Bhava Shaktim cha Akhilananda Murte Ghorakashtaduddharasman Namaste.🙏🌼🌿


🌿🌼🙏. Saloka panchaka matadyo loka mangala


🌿🌼🙏Dagambara Digambara Shri Pada Vallabha Digambara Digambara Digambara Avadhuta Chintana Digambara🙏



🌹 🌹 🌹 🌹 🌹




Bình luận


bottom of page