top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 593: 16వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 593: Chap. 16, Ver. 22



🌹. శ్రీమద్భగవద్గీత - 593 / Bhagavad-Gita - 593 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 22 🌴


22. ఏతైర్విముక్త: కొన్తేయ తమోద్వారైస్త్రిభిర్నర: |

ఆచరత్యాత్మన: శ్రేయస్తతో యాతి పరాం గతిమ్ ||


🌷. తాత్పర్యం : ఓ కుంతీపుత్రా! ఈ మూడు నరకద్వారముల నుండి తప్పించుకొనినవాడు ఆత్మానుభూతికి అనుకూలములైన కార్యముల నొనరించి క్రమముగా పరమగతిని పొందగలడు.


🌷. భాష్యము : కామము, క్రోధము, లోభము అనెడి ఈ మువ్వురు మానవశత్రువుల యెడ ప్రతివారును జాగరూకులై యుండవలెను. ఈ మూడింటి నుండి ఎంతగా బయటపడినచో మనుజుని అస్తిత్వము అంతగా పవిత్రము కాగలదు. పిదప అతడు వేదములందు నిర్దేశింపబడిన విధినియమములను పాటించుటచే అతడు క్రమముగా ఆత్మానుభవస్థాయిని చేరగలడు. అతడు మిగుల అదృష్టవంతుడైనచో అట్టి సాధనచే కృష్ణభక్తిరసభావనకు చేరగలడు. అంతట జయము అతనికి నిశ్చయము కాగలదు. మనుజుడు పవిత్రుడగుటకు చేయవలసిన క్రియ, ప్రతిక్రియ మార్గములు వేదవాజ్మయమున విశదముగా వివరింపబడినవి.


కామము, క్రోధము, లోభము అనువానిని త్యజించుట పైననే సమస్తవిధానము ఆధారపడియున్నది. కామాది త్రిగుణములను త్యజించుటనెడి ఈ పధ్ధతిని అనుసరించుట ద్వారా మనుజుడు ఆత్మానుభవపు అత్యున్నతస్థాయికి ఎదగగలడు.


🌹 🌹 🌹 🌹 🌹






🌹 Bhagavad-Gita as It is - 593 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 22 🌴


22. etair vimuktaḥ kaunteya tamo-dvārais tribhir naraḥ

ācaraty ātmanaḥ śreyas tato yāti parāṁ gatim


🌷 Translation : The man who has escaped these three gates of hell, O son of Kuntī, performs acts conducive to self-realization and thus gradually attains the supreme destination.


🌹 Purport : One should be very careful of these three enemies to human life: lust, anger and greed. The more a person is freed from lust, anger and greed, the more his existence becomes pure. Then he can follow the rules and regulations enjoined in the Vedic literature. By following the regulative principles of human life, one gradually raises himself to the platform of spiritual realization. If one is so fortunate, by such practice, to rise to the platform of Kṛṣṇa consciousness, then success is guaranteed for him. In the Vedic literature, the ways of action and reaction are prescribed to enable one to come to the stage of purification. The whole method is based on giving up lust, greed and anger.


By cultivating knowledge of this process, one can be elevated to the highest position of self-realization; this self-realization is perfected in devotional service. In that devotional service, the liberation of the conditioned soul is guaranteed. Therefore, according to the Vedic system, there are instituted the four orders of life and the four statuses of life, called the caste system and the spiritual order system. There are different rules and regulations for different castes or divisions of society, and if a person is able to follow them, he will be automatically raised to the highest platform of spiritual realization. Then he can have liberation without a doubt.


🌹 🌹 🌹 🌹 🌹


0 views0 comments

Comments


bottom of page