top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 5


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 5 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।

వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ 🍀


🌻 495. 'మణిపూరాబ్జ నిలయా' - 5 🌻


మానవుడు క్షర విద్యతోపాటు అక్షర విద్యను కూడ అభ్యసింపవలెను. అక్షరాభ్యాసమనగా అక్షరత్వమును అభ్యసించుట. అందులకే తన జన్మము. కేవలము వ్రాత నేర్చుటకు కాదు. తెలియని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అనాలోచితముగ పిల్లలను చిన్నతనము నుండియే అవిద్యా మార్గములు ప్రవేశింప జేయుదురు. కలియుగము కదా! ఇచ్చట వసించియుండు శ్రీమాత ఇహపర సౌఖ్యముల నీయగలదు. కనుకనే ఈ పద్మమున వసించి యుండు శ్రీమాత నారాధించుట ప్రసిద్ధి గాంచినది.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 5 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻102. Manipurabja nilaya vadanatraya sanyuta

vajradikayudhopeta dayaryadibhiravruta ॥ 102 ॥ 🌻


🌻 495. Manipurabja - 5 🌻


A person should go through the superficial education as well as the eternal education. Aksharabhyasa means learning eternity. His birth is for that reason. Not just to learn to write. Ignorant parents and teachers unintentionally lead children into uneducated paths from an early age. Kali Yuga! Srimata who lives here can give comforts that are physical and beyond. That's why it has become famous to pray to Sri Mata who is sitting on this lotus.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹





Comments


bottom of page