top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 501- 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 501 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 501- 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 501 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 103. రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా ।

సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥ 🍀


🌻 501. 'గుడాన్నప్రీత మానసా' - 2🌻


తగుమాత్రము తీపిని గూడ గొనని వారు రకరకములగు మనో క్లేశములకు గురి అగుచుందురు. షడ్రుచులు లేని భోజనము సమగ్రము కాదు. మనోప్రీతికి, మనోల్లాసమునకు సమగ్రముగ ఆహారము గొనుట ఎంతయూ ఆవశ్యకము. విష్ణు పురాణమున పరాశర మహర్షి మైత్రేయుని కందించు బోధనలయందు ఈ విషయము గోచరమగును. ప్రప్రథమముగ ఆహారము గొనవలసిన పదార్థము తీయని పదార్థమై యుండవలెనని పరాశరులు సూచించినారు. తీపిలేని భోజనము రససిద్ధి నీయదు. ఆయుర్వేదమునందు కూడ బెల్లమునకే ప్రాధాన్యత యున్నది. ప్రస్తుత కాలమున ఆధునికముగ తయారు చేయబడిన తెల్లని చక్కెర యందు బెల్లమందలి గుణములు లేవు. ఈ చక్కెర పదార్థములు తినుట శరీరమునకు హానికరము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 501 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻103. Rakta-varna mansanishta gudanna pritamanasa

samsta bhakta sukhada lakinyanba svarupini ॥ 103 ॥ 🌻


🌻 501. gudanna pritamanasa - 2 🌻


Those who do not take enough sweet are subject to various mental afflictions. A meal is not complete without the six tastes. It is very important to eat a complete diet for happiness and relaxation. In the Vishnu Purana, Parasara Maharshi's teachings to Maitreya have this topic. Parashara suggested that the first item to be eaten should be a sweet. A meal without sweet is not palatable. Jaggery is also preferred in Ayurveda. Modern white sugar does not have the qualities of jaggery. Eating these sugary substances is harmful to the body.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page