top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 501- 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 501 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 501- 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 501 - 3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 103. రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా ।

సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥ 🍀


🌻 501. 'గుడాన్నప్రీత మానసా' - 3 🌻


అన్నమందు, కూరగాయల యందు కూడ ఆమ్ల మున్నది గనుక ఆహారము సమతుల్య మగుటకు బెల్లము వాడి తీరవలెను. కేవలము ఆరోగ్యమునకేగాక మనస్సు ప్రీతిగ నుండుటకు శరీర ధర్మముల సహకార మెంతయూ అవసరము. అట్లున్నప్పుడే రస సిద్ధికి అవకాశ ముండును. లేనిచో ఆవేశ కావేశములతో, రోషము పట్టుదల లతో శ్రీమాత పూజలు చేసిననూ ఫలించవు. అంతియేగాక సుదీర్ఘమగు పూజలు చేయువారు ఉపవాసము లను కూడ ఆచరించుటచేత ఆమ్లములు మెండుగ చేరును. అట్టి ఆమ్లములకు విరుగుడే గుడాన్నము, పాయసాన్నము. ఆహారమున పై తెలిపిన శ్రద్ధను చూపువారు మనో ప్రీతితో పూజలు చేయగలరు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 501 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻103. Rakta-varna mansanishta gudanna pritamanasa

samsta bhakta sukhada lakinyanba svarupini ॥ 103 ॥ 🌻


🌻 501. gudanna pritamanasa - 3 🌻


As rice and vegetables are also acidic, jaggery should be used to balance the diet. In addition to health, the mind also needs the cooperation of the body to be pleasant. Only then is there a chance for Rasa Siddhi. If not, worship of Sri Mata with passion, ego and being strong willed will not be fruitful. Moreover, those who perform long pujas also observe fasts, so the acids accumulate. Gudanna and Payasanna are the antidote to such acids. Those who show the above-mentioned attention to food can perform pujas with pleasure.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Commentaires


bottom of page