top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 502- 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 502 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 502- 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 502 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 103. రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా ।

సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥ 🍀


🌻 502. 'సమస్తభక్త సుఖదా’- 1 🌻


సమస్త భక్తులకు సుఖము నిచ్చునది శ్రీమాత అని అర్థము. సుఖమను పదము సుస్థ అను పదమూలము నుండి పుట్టినది. సుస్థ అనగా సుస్థిరత్వము. ప్రజ్ఞ హృదయమందున్నప్పుడు సుఖముగను సౌకర్యముగను వుండును. మానవ ప్రజ్ఞ ఆనందముకొఱకై వెదకుచూ అనేకానేక అవస్థితులను చెందుచుండును. సుఖదుఃఖములు, రాగద్వేషములు, జయాపజయములు యిత్యాది ద్వంద్వములందు తిరుగు చుండును. అపుడు సుఖముండదు. ఆనంద ముండదు. దుఃఖము, దిగులు కలుగుచుండును. మనో నిబ్బరము కోల్పోవుటచే నిర్మలత్వము తగ్గును. ఇవన్నియూ అవస్థితులే. సుస్థితులు కావు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 502 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻103. Rakta-varna mansanishta gudanna pritamanasa

samsta bhakta sukhada lakinyanba svarupini ॥ 103 ॥ 🌻


🌻 502. samsta bhakta sukhada - 1 🌻


It means that Sri Mata is the giver of happiness to all the devotees. The word Sukhamu is derived from the root Sustha. Sustha means stability. When Prajna is in the heart, there is happiness and comfort. Human intelligence seeks happiness and takes many forms. It keeps moving between Happiness, sadness, anger, joy, etc of dualities. Then there is no happiness. There is no bliss. There will be sadness and grief. Purity decreases due to loss of mental composure. These are all bad conditions, not good.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Komentar


bottom of page