top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 502- 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 502 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 502- 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 502 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 103. రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా ।

సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥ 🍀


🌻 502. 'సమస్తభక్త సుఖదా’- 2 🌻


సుస్థితి కలుగ వలెనన్నచో సద్గుణముల నాశ్రయించి సత్వమున చేరి 'స్వస్థత పొంద వలెను. ఇది అంతయూ భక్తులకు క్రమముగ అమ్మ ఆరాధన ద్వారా లభ్యమగును. ఆమె సుఖప్రదాత! భక్తులకు సుఖము నిచ్చున దామెయే. గుణములు, ఇంద్రియములు ఆమె వశమై యుండును గనుక ఆమె ఆరాధకులకు అవి వశమై సుఖము కలిగించును. 'ఖ' అను పదమునకు ఆకాశము అను అర్థము కలదు. సుఖ అనగా నిర్మలమగు ఆకాశమని కూడ వివరించుకొన వచ్చును. హృదయాకాశమే నిర్మలాకాశము. ఈ నిర్మలాకాశమును అమ్మ అనుగ్రహమున చేరుట సులభము. శ్రద్ధా భక్తులతో శ్రీమాత నారాధించు వారికిది విదితము. చక్రభ్రమణ మను జీవితము నుంచి వికాసము కలిగించి సుఖము నిచ్చునది శ్రీమాత.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 502 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻103. Rakta-varna mansanishta gudanna pritamanasa

samsta bhakta sukhada lakinyanba svarupini ॥ 103 ॥ 🌻


🌻 502. samsta bhakta sukhada - 2 🌻


To attain good condition, one should imbibe good characteristics, be at harmony and get a well being. All this is attained by the devotees through regular worship of Amma. She is a pleasure giver! She is the one who gives happiness to the devotees. As the attributes(gunas) and senses are under her control, her worshippers have them under their control and are happy. The word 'kha' means sky. Sukha can also mean an immaculate sky. The sky of the heart is an immaculate sky. It is easy to reach this immaculate sky by Amma's grace. It is known to those who worship Sri Mata with faith and devotion. It is Sri Mata who gives us happiness by elevating us from the cycle of life.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page