top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 503- 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 503 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 503- 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 503 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 103. రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా ।

సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥ 🍀


🌻 503. 'లాకిన్యంబా స్వరూపిణి' - 1 🌻


లాకిణీ స్వరూపముగల శ్రీమాత అని అర్ధము. మూడు ముఖములు కలది, వజ్రము మొదలగు నాలుగు ఆయుధములు కలది, పది శక్తులచే ఆవరింపబడినది, రక్తము వంటి ఎర్రని రంగు గలది, మాంసమందు అభిమానము కలది, బెల్లమన్నము యిష్టమైనది అగు శ్రీమాతను లాకిణి అని పిలుతురు. మణిపూరక చక్రము జీవప్రజ్ఞకు బహిద్వారము. అనాహతము అంతరంగ ద్వారము. మణిపూరకమును చేరిన ప్రజ్ఞను పాలించు మాత లాకిణి. ఈమె కారణముగ జీవప్రజ్ఞకు దేహప్రజ్ఞకు సంబంధ మేర్పడును. రక్త మాంసమయమైన శరీరమున జీవుడుండుట కిష్టపడును. అట్టి శరీరమునకు సుఖముండునట్లుగ ఆకలి జీవుని ఆకర్షించి యుంచును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 503 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻103. Rakta-varna mansanishta gudanna pritamanasa

samsta bhakta sukhada lakinyanba svarupini ॥ 103 ॥ 🌻


🌻 503. lakinyanba svarupini - 1 🌻


It means Srimata in the form of Lakini. Having three faces, having four weapons such as Vajra, surrounded by ten powers, red in color like blood, fond of flesh, fond of rice with jaggery, is the Shrimata called Lakini. Manipuraka Chakra is the gateway to life consciousness. Anahata is the inner door. Mata Lakini rules the consciousness that reaches Manipuraka. She is the reason why a relation is formed between life consciousness and body consciousness. Jeeva or soul likes to be in flesh and blood body. Hunger attracts the soul to keep the body happy.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page