top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 504 / Sri Lalitha Chaitanya Vijnanam - 504


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 504 / Sri Lalitha Chaitanya Vijnanam - 504 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 104. స్వాధిష్ఠానాంబుజగతా, చతుర్వక్త్ర మనోహరా ।

శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104 ॥ 🍀


🌻 504. 'స్వాధిష్ఠానాంబుజగతా' 🌻


స్వాధిష్ఠాన మను అంబుజమున (పద్మమున) గల యోగిని శ్రీమాత అని అర్థము. స్వాధిష్ఠానము ఆరు దళముల పద్మము. ఈ పద్మము నందలి ఆరు రేకులపై బ భ మ య ర ల అను ఆరు అక్షరములు, ఆరు మాతృకలుగ యుండును. "వ" అను అక్షరము బీజము నందుండును. ఈ ఆరు దళముల పద్మము లేత గులాబి రంగులో యుండును. గులాబి రంగు సున్నితత్వమునకు, కౌమారత్వమునకు, నిర్మలత్వమునకు ప్రతీక. స్వచ్ఛమగు ప్రేమకు ప్రతీక. అరిషడ్వర్గముల ప్రభావము లేశమాత్రము కూడ మానవుని యందు లేనప్పుడు గులాబి కాంతితో ఈ పద్మము ప్రకాశించుచుండును. ఇందలి దళములు కుమారుని షణ్ముఖములకు ప్రతీకలై యుండును. ఈ పద్మమున ఆసీనుడగు జీవుడు స్వాధీనముననే యుండును గాని, ఎన్నటికి పరాధీనుడు కాడు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹






🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 504 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻104. Svadhishtananbujagata chaturvaktra manohara

shuladyayudha sanpanna pitavarna tigarvita ॥ 104 ॥ 🌻


🌻 504. Svadhishtananbujagata 🌻


It means that the yogini in the lotus called Swadhisthana is Shrimata. Swadhisthana is a six-petaled lotus. On the six petals of this lotus there are six letters as six matrukas called Ba bha Ma ya Ra la. The letter 'Va' is in the seed. This six-armed lotus is pale pink in color. Pink is a symbol of tenderness, youth and purity. It is a symbol of pure love. This lotus shines with rosy light when the influence of Arishadvargas is absolutely absent from a human being. These petals are symbolic of the six faces of Kumara. A living being sitting on this lotus is ever in control, but never a dependent.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page