🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 505 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 505 - 1🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 104. స్వాధిష్ఠానాంబుజగతా, చతుర్వక్త్ర మనోహరా ।
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104 ॥ 🍀
🌻 505. 'చతుర్వక్త్ర మనోహరా' - 1 🌻
నాలుగు ముఖములతో మనోజ్ఞముగ నుండునది శ్రీమాత అని అర్ధము. నాలుగు ముఖములనగా నాలుగు భూతములు అస్థిత్వముగా కలది అని అర్థము. అవి వరుసగా 1. ఆకాశము (విశుద్ధి), 2. వాయువు (అనాహతము), 3. అగ్ని (మణిపూరకము), 4. జలము (స్వాధిష్ఠానము). పంచభూతాత్మకమగు సృష్టిలో స్వాధిష్టానము చేరుసరికి నాలుగు భూతముల సృష్టి ఏర్పడును. ఐదవది అయిన పృథివి మూలాధారమున ఏర్పడును. అందువలన మూలాధార దేవత పంచవక్త్ర. స్వాధిష్ఠాన దేవత చతుర్వక్త్ర. మణిపూరక దేవత త్రివక్త్ర. అనాహత దేవత ద్వివక్త్ర (వదనద్వయ). విశుద్ధి దేవత ఏకవక్త్ర (ఏకవదన). ఇట్లు తెలియ నగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 505 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻104. Svadhishtananbujagata chaturvaktra manohara
shuladyayudha sanpanna pitavarna tigarvita ॥ 104 ॥ 🌻
🌻 505. Chaturvaktra manohara - 1 🌻
It means the beautiful one with four faces is Srimata. By four faces it means that she is identified by the four elements. They are respectively 1. Sky (Vishuddhi), 2. Vayu (Anahata), 3. Fire (Manipuraka), 4. Water (Svadhishthana). When Swadhishthana joins the creation that has five elements the creation of four elements takes place. The fifth element Prithivi is formed in the Mooladhara. Thus the diety at Mooladhara is Panchavaktra. Swadhishthana deity is Chaturvaktra. Manipuraka Goddess Trivaktra. Anahata Goddess Dvivaktra (two faced). Vishuddhi Goddess Ekavaktra (single faced). Thus it goes.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Commentaires