🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 510 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 510 - 1🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀
🌻 510. ‘మధుప్రీతా’ - 1🌻
మధువు నందు ప్రీతి గలది శ్రీమాత అని అర్థము. మధువనగా మేదస్సు నందు జీవుడు అనుభవించు ఆనందము. అనగా చైతన్యానందము. శ్రీమాత చైతన్య స్వరూపిణి. ఆమె ఆనందమునకు కారణము, శివునితో తాదాత్మ్యత చెందుట వలననే. శ్రీకృష్ణుడు కూడా మధురానాథుడుగ వర్ణింపబడినాడు. మధుర యందలి కృష్ణ భక్తులు అంతరంగమున కృష్ణుని భావించుచు అమితమగు చైతన్యా నందమును పొందిరి. బాహ్యముతో సంబంధము లేక అంతరంగమున కృష్ణానుభూతితో పరవశులై ఆడిపాడిరి. వీరందరును మధురావాసులే. స్వాధిష్ఠానమున గల శ్రీమాత యిట్టి అనుభూతితో జీవుల యందుండి జీవులకు కూడ మధురానుభూతిని పంచుటకు సంసిద్ధమై యున్నది. ఆమె మధుప్రీత. ఆమెను ఆరాధించువారు కూడ అట్టి అనుభూతిని పొందగలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 510 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻105. Medhonishta maduprita bandinyadi samanvita
dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻
🌻 510. 'Madhupreeta' - 1🌻
Shrimata is known to love nectar. Nectar here is joy experienced by the living being in the sweet intellect. That is the joy of consciousness. Srimata is the personification of Chaitanya. The reason for her happiness is her immersion with Lord Shiva. Lord Krishna is also described as Madhuranatha. The Krishna devotees of Mathura realized Krishna within themselves and experienced great bliss of consciousness. They sang and danced with the ecstacy of feeling Krishna Consciousness internally without any connection with the outside. All of them are residents of Madhura. Sri Mata in Swadhishthana is with this ecstacy in the living beings and is ready to give them this ecstacy. She is a lover of nectar or bliss. Thus her worshippers also enjoy the same.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments