top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 510 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 510 - 2




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 510 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 510 - 2🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।


దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀


🌻 510. ‘మధుప్రీతా’ - 2🌻


మధువు అంతరంగ రసానుభూతియేగాని, మద్యపానము చేయువారికి కలుగు అనుభూతి గాదు. కొందరు శ్రీవిద్య ఉపాసకులు తగు మాత్రము మద్యము గ్రోలి ఆరాధన చేయు ఆచార మొకటి నేటికిని వాడుకలో వున్నది. మద్యము వలన చైతన్యమునకు మైకము కలుగును గాని అది ఆనందము కాజాలదు. రసానుభూతి వేరు, మద్యపానానుభూతి వేరు. రెంటికిని చాల వ్యత్యాసమున్నది. భక్తి పరిపక్వత చెందు చుండగ, అట్టి భక్తి శ్రీమాత యందనురక్తిగ మారుచుండగ, మేదస్సు నుండి రస ముద్భవించును. తన్మయత్వము కలుగును. ఇది అంతరంగ రసాయనము. బాహ్య సాధనములగు మద్యము, కల్లు యిత్యాదివి జీవుని చైతన్యరహితునిగ చేయును గాని రసభరతుని చేయలేవు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹Sri Lalitha Chaitanya Vijnanam - 510 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻105. Medhonishta maduprita bandinyadi samanvita

dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻


🌻 510. 'Madhupreeta' - 2🌻


Wine here is an inner feeling, not a feeling experienced by the drinker. There is a tradition today in some Srividya worshipers where they take wine as a part of the practice. Alcohol brings stupor to consciousness, but it does not bring bliss. This relishable state is different from the integrated state of alcoholism. There is a huge difference between the two. When Bhakti matures into anurakti or attachment towards Shrimata, Rasa emerges from the intelligence. An engrossment happens. It is an internal chemical. External tools such as wine, alcohol etc. can make the jeeva unconscious in chaitanya but cannot make him relish the bliss



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page