top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 511 / Sri Lalitha Chaitanya Vijnanam - 511




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 511 / Sri Lalitha Chaitanya Vijnanam - 511 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా

దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀


🌻 511. 'బందిన్యాది సమన్వితా'🌻


బందిని మొదలగు ఆరుగురు దేవతలతో నుండునది శ్రీమాత అని అర్థము. పాశము, త్రిశూలము యిత్యాది ఆరు ఆయుధములతో శ్రీమాత యిచట సుప్రతిష్ఠయై యున్నదని 504వ నామమున వివరించుట జరిగినది. స్వాధిష్ఠానమున ఆరు దళములు శిష్టులకు సుమేదస్సును కలిగించి ఆనందము నీయగ, శిష్టులు కాని వారికి అరిషడ్వర్గములను పుట్టించును. అసూయ, గర్వము, కామము, కోపము, రాగము, ద్వేషము యిత్యాదివి కలుగును. వాటితో జీవుడు దేహమున బందీ అగును. బంధమునకు ప్రథమ కారణము అసూయ, మిగిలిన వన్నియూ అసూయతో పుట్టు వికారములు. ఈ వికారముల కారణముగ జీవుడు బంధములకు గురి యగును. అప్పుడు బందిని ఆదిగా గల దేవతలు దేహమున బంధించి రోగపీడితునిగ చేసి దుఃఖ పరంపరలో ముంచెత్తును. అసూయ లేనివారే నిజమగు అదృష్టవంతులు. అసూయ దాటుట ప్రధానమగు పురుషకారము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 511 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻105. Medhonishta maduprita bandinyadi samanvita

dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻


🌻 511. 'Bandinyadi Samanvita'🌻


Shrimata is the one with the six deities including Bandini. It is explained in the 504th name that Srimata is glorified with six weapons like Pasha and Trisula. In Swadhisthana, the six petals give rise to wisdom and happiness for the virtuous, and give birth to Arishadvargas for the non-virtuous. Jealousy, pride, lust, anger, love, hatred etc. With them, jeeva becomes a prisoner of the body. Jealousy is the first cause of bondage, all other distortions is born of jealousy. Because of these distortions jeeva is subject to attachments. Then Bandini and following deities captivate the jeeva in the body, bring maladies and subject him to sorrows. Those who are free of jealousy are truly fortunate. Overcoming jealousy is the main effort to be made.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹





Comments


bottom of page